తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న భూ భారతి బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. డిసెంబర్ 17న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ చట్టానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడితే.. మూడు రోజుల సుదీర్ఘ చర్చ తర్వాత బిల్లును అసెంబ్లీ ఆమోదించింది.
2025 జనవరి 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 10 రోజులపాటు భక్తులను వైకుంఠ ద్వార దర్శనానికి అనుమతించనుంది టీటీడీ. పది రోజులపాటు టోకెన్ కలిగిన భక్తులకు మాత్రమే స్వామివారి వైకుంఠ ద్వార దర్శన భాగ్యం లభించునుంది.
రేవంత్రెడ్డి సర్కార్పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ.పాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్.. 7 లక్షల కోట్ల అప్పులు చేసి వెళ్లిపోతే.. రేవంత్ సర్కార్ వచ్చన తర్వాత మరో లక్ష కోట్లు పెరిగాయన్నారు.
తెలంగాణలోని 10వ తరగతి విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ పరీక్షల షెడ్యూల్ ఈరోజు రిలీజైంది. మార్చి 21 నుంచి ఏప్రిల్4 వరకు పదవ తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు పరీక్షల నిర్వహణ జరగనుంది.
తెలంగాణ అసెంబ్లీలో అప్పులు, వాటి చెల్లింపులపై స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ చర్చలో భాగంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఆర్థిక పరిస్థితిపై శ్వేత పత్రం విడుదల చేశామని తెలిపారు. మొత్తం అప్పు 6 లక్షల 71 వేల కోట్లు ఉంది.. చేసిన అప్పులు సరిగా చెప్పలేదు.. సభను తప్పుదోవ పట్టించారని ప్రతిపక్షం తప్పు పట్టిందని అన్నారు.
తాను పేదలకు అన్యాయం చేసే వ్యక్తిని కాదని, అవినీతి సొమ్ము తినే వ్యక్తిని అస్సలు కాదని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి అన్నారు. తన రాజకీయ జీవితం జీవితం మొత్తంలో పేదల కోసమె పోరాటం చేశాన్నారు. కొందరు రాజకీయ ప్రత్యర్థులు కావాలనే తనపై విమర్శలు చేస్తున్నారన్నారు. కార్మికుల పక్షాన పోరాటం చేసి వారికి న్యాయం జరిగేలా చేస్తానని కొండా మురళి చెప్ప్పుకొచ్చారు. అజంజాహీ మిల్స్ యూనియన్ కార్యాలయ స్థలం కబ్జా ఆరోపణలపై కొండా మురళి స్పందిస్తూ పై…