కాళేశ్వరం కమిషన్ వద్ద మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ బహిరంగ విచారణ ముగిసింది. కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఓపెన్ కోర్ట్ విచారణకు రిటైర్డ్ సీఎస్, రిటైర్డ్ ఇరిగేషన్ సెక్రటరీ శైలేంద్ర కుమార్ జోషి హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించింది. అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సీడబ్ల్యూసీ చెప్పిందన్న ఎస్కే జోషి కమిషన్‌కు తెలిపారు.
నిత్య పెళ్లికొడుకుల ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట ఇలాంటి ఘటనలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో మోసాలకు పాల్పడుతున్న నిత్యపెళ్లికొడుకు కోసం పోలీసులు గాలిస్తున్నారు. విగ్గులు పెట్టుకుని వేషాలు మారుస్తూ మోసాలకు పాల్పడుతున్నాడు వంశీకృష్ణ అనే నిత్య పెళ్లికొడుకు.
Bhubharati Bill: నేడు తెలంగాణ శాసనమండలిలో భూ-భారతి బిల్లును మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రవేశ పెట్టారు. ఈ సందర్బంగా ఆయన కాంగ్రెస్ అంటేనే ప్రజలకు భద్రత, భరోసా అని తెలిపారు. ధరణిని తొలగించి కొత్తగా ఈ భూ-భారతి బిల్లును ప్రవేశపెట్టారు. ఇకపోతే, భూ-భారతి బిల్లులోని ప్రధానాంశాలు, ప్రత్యేకతలు ఇలా ఉన్నాయి. Also Read: Seethakka In Assembly: గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలపై స్పందించిన మంత్రి సీతక్క భూ-భారతి ప్రత్యేకతలు: • ఆరు మాడ్యూళ్లు :…
Ponnam Prabhakar: తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బిఆర్ఎస్ పార్టీ ఆటో కార్మికుల పైన మొసలి కన్నీరు కారుస్తోందని మండిపడ్డారు. మీకు చిత్తశుద్ధి ఉంటే, మీ ప్రభుత్వం అధికారంలో ఉన్న 10 సంవత్సరాల్లో ఆటో కార్మికుల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకున్నారో చెప్పండని ఆయన విమర్శించారు. మెట్రో వస్తే ఇతర వాటిపై ప్రభావం పడిందని, మహిళలకు ఉచిత ప్రయాణం అందిస్తే, ఆటో సర్వీసులకు ప్రభావం పడుతుందని చెప్పడం తప్పని…
తెలంగాణ అసెంబ్లీ శీతాకాల సమావేశాలు హాట్ హాట్‌గా జరుగుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులతో కాంగ్రెస్, బీఆర్ఎస్ పొలిటికల్ హీట్ పుట్టిస్తున్నాయి. అయితే ఇక్కడే బీఆర్ఎస్ కాస్త గందరగోళంలో ఉందన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. లగచర్ల భూ సేకరణ వివాదం నెల రోజుల నుంచి రాజకీయంగా నలుగుతోంది. ఈ ఎపిసోడ్లో ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని డిఫెన్స్‌లో పడేయడానికి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది గులాబీ పార్టీ. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఫార్మా సిటీ ఏర్పాటు ప్రయత్నం చేసింది…
హాస్టల్ విద్యార్థులకు మెనూను మార్చేశామని.. ప్రతి విద్యార్థికి హెల్త్ కార్డు ఇస్తామని.. ప్రతి నెలా చెకప్ చేయిస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. పేదల కష్టాలు ఏంటో మాకు తెలుసన్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా హాస్టల్ విద్యార్థులకు ఛార్జీలు పెంచామన్నారు. ముఖ్యమంత్రి, అధికారులతో పూర్తి స్థాయిలో చర్చించిన అనంతరం 40 శాతం వరకు విద్యార్థులకు అందించే ఛార్జీలు పెంచామన్నారు
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం తెలంగాణ రాష్ట్రానికి విచ్చేశారు. శీతాకాల విడిది కోసం విచ్చేసిన రాష్ట్రపతికి హైదరాబాద్‌లోని హకీంపేట్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ వద్ద గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి , మంత్రి సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ప్రభుత్వ సలహాదారు హర్కర వేణుగోపాల్‌లు ఘన స్వాగతం పలికారు.