తెలంగాణ అసెంబ్లీ ప్రాంగణంలో డా.బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద కాంగ్రెస్ ధర్నా చేస్తోంది. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ధర్నా చేస్తున్నారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు ఆందోళనలో పాల్గొన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ ఈ ధర్నా చేస్తోంది. అంబేద్కర్ తమకు దేవుడు లెక్క అని, అమిత్ షా క్షమాపణలు చెప్పాలని పీసీసీ చీఫ్ డిమాండ్ చేశారు. Also…
శాసనసభలో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు మధ్య వాడీవేడి సంభాషణ జరిగింది. క్వశ్చన్ అవర్‌లో ఒక మంత్రి.. మరొక మంత్రిని ప్రశ్న అడగడం ఏంటని హరీశ్ రావు ప్రశ్నించారు. మంత్రులే ప్రశ్నలు అడిగితే.. ప్రశ్నోత్తరాలకు అర్థమే మారిపోతుందన్నారు. అందుకు కోమటిరెడ్డి ఘాటుగా స్పందించారు. హరీశ్ రావు బీఆర్ఎస్కు డిప్యూటీ లీడరా?, ఎమ్మెల్యేనా?.. ఏ హోదాతో మాట్లాడుతున్నారు?, ఆయనకు ప్రశ్నించే హక్కు లేదన్నారు. ప్రతిపక్ష నేత ఏడాదిగా సభకు రాకపోవడం తెలంగాణ ప్రజలను అవమానపరచడమే…
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. గురువారం ఐదవ రోజు వాడివేడిగా సమావేశం జరగనుంది. నేడు అసెంబ్లీలో నాలుగు ప్రభుత్వ బిల్లులతో సహా భూభారతి బిల్లుపై చర్చ కొనసాగనుంది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. నేడు అసెంబ్లీలో ప్రభుత్వ అప్పులు, చెల్లింపులపై సహా రైతు భరోసాపై చర్చ జరగనుంది.
హైదరాబాద్ పాతబస్తీలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఐఎస్ సదన్ పోలీసు స్టేషన్ పరిధి మాదన్నపేట చౌరస్తాలోని ఓ పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలకు తోడు నల్లటి పొగ ఆ ప్రాంతమంతా దట్టంగా వ్యాపించింది. మంటలను చూసి పరిశ్రమలోని కార్మికులు ప్రాణ భయంతో బయటకు పరుగులు తీశారు. అగ్నిప్రమాదంను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. హుటాహుటిన అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని.. 6 ఫైరింజిన్లతో మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. సోఫా మరియు తలుపులను…
మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది.. ఏపీ, తెలంగాణకు చెందిన 1,200 మంది మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు శుభవార్త చెప్పింది సుప్రీంకోర్టు.. మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ల నియామక జీవోను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు వెలువరించగా.. వాటిపై స్టేటస్ కో విధించింది సుప్రీంకోర్టు..
లగచర్లలో అధికారులపై దాడి కేసులో నిందితులందరికీ నాంపల్లి ప్రత్యేక న్యాయస్థానం బెయిల్‌ను మంజూరు చేసింది. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగతా నిందితులు అందరికీ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.