Chinnamail Anji Reddy: ఎమ్మెల్సీ ఎన్నికల్లో నిజామాబాద్ – కరీంనగర్ – మెదక్ – ఆదిలాబాద్ గ్రాడ్యుయేట్ స్థానం నుంచి బరిలోకి దిగిన చిన్నమైల్ అంజిరెడ్డి.. ప్రచారంలో దూకుడు పెంచారు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చేతుల మీదుగా భీఫామ్ అందుకున్నారు పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కుమార్తె అశ్విత.. తండ్రి విజయం కోసం కుమార్తె తాపత్రయం పట్ల హర్షం వ్యక్తం చేశారు కిషన్‌రెడ్డి.. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో భాగంగా నిజామాబాద్‌లో జిల్లా బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. కేంద్రంలో మోడీ ప్రభుత్వ పాలనకు ఆకర్షితులై యువత అంతా బీజేపీ వైపు ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెనెక్కాక నిరుద్యోగుల సమస్యలను విస్మరించిందని, ఆరు గ్యారెంటీలు అమలు చేస్తానని కేవలం ఫ్రీ బస్సు ఇచ్చి చేతులు దులుపుకుందని విమర్శించారు.
Read Also: Rythu Bharosa: రైతులకు శుభవార్త.. వాళ్లకు రైతు భరోసా నిధులు విడుదల
ఇక, యువ వికాసం పేరిట నిరుద్యోగులను, యువతి, యువకులను కాంగ్రెస్ మోసం చేస్తున్నారని మండిపడ్డారు అంజిరెడ్డి.. 5 లక్షల రూపాయల జాబ్ కార్డు, ప్రతి మండలానికి అంతర్జాతీయ పాఠశాల, యువ వికాసం పథకం కింద విదేశీ విద్యకు 26 లక్షల రూపాయలు ఇస్తా మని వాగ్దానం చేసి.. ఇప్పుడు హామీలు గాలికొదిలేసారని విమర్శించారు. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులకు ఉపకార వేతనాలు ఆలస్యం, రీయింబర్స్‌మెంట్ ఇవ్వకపోవడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. 317 జీవో పైన స్పష్టత లేకపోవటంతో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారన్నారని పేర్కొన్నారు.. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచి నిరుద్యోగులను మోసం చేసిందని, నిరుద్యోగులు, మేధావులు, లాయర్లు, డాక్టర్లు, యువతా తమ మొదటి ప్రాధాన్య ఓటు వేసి నన్ను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.. మీ ప్రతినిధిగా మండలిలో నిరుద్యోగుల గొంతుకనవుతాను సమస్య ల పరిష్కారానికి కృషి చేస్తానని పేర్కొన్నారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్.. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా పసుపు బోర్డు ఛైర్మెన్ పల్లె గంగారెడ్డి, జిల్లా అధ్యక్షులు నాగేష్ కులాచారి, ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా.. ఇతర సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.