బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాసబ్ ట్యాంక్ పోలీసు స్టేషన్లో విచారణకు శుక్రవారం హాజరయ్యారు. హుజూరాబాద్ ఎమ్మెల్యే తన అడ్వకేట్‌తో కలిసి స్టేషన్ లోపలికి వెళ్లారు. ముందుగా అడ్వకేట్‌ను పోలీసులు అనుమతించలేదు. ఉన్నతాధికారుల అనుమతితో పోలీసులు లోపలికి అనుమతించారు. కౌశిక్ రెడ్డిని మాసబ్ ట్యాంక్ పోలీసులు గంటపాటు విచారణ చేశారు. పోలీసులు 32 ప్రశ్నలు అడిగి స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. విచారణ ముగిసిన అనంతరం ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నాపై కాంగ్రెస్ ప్రభుత్వం…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సింగపూర్‌లో పర్యటిస్తున్నారు. గురువారం రాత్రి సింగపూర్ చేరుకున్న సీఎం.. ఈరోజు ఉదయం ఆ దేశ విదేశాంగ మంత్రి వివియన్ బాలకృష్ణన్‌తో భేటీ అయ్యారు. ఈ భేటీలో సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మూసీ పునరుజ్జీవనం, గ్రీన్ ఎనర్జీ, పర్యాటకం, ఐటీ, విద్య, నైపుణ్య నిర్మాణంపై చర్చించారు. ఈ సమావేశంలో సింగపూర్‌లోని అభివృద్ధి పనులతో…
అప్పుడెప్పుడో ఇంద్ర సినిమాలో చెప్పిన ఈ డైలాగ్ చిరంజీవి ఇప్పుడు వేస్తున్న పొలిటికల్ స్టెప్స్‌కు సరిగ్గా సరిపోతుందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. కాశీకి వెళ్ళకున్నా... కాషాయం కప్పుకోవడం మాత్రం దాదాపు ఖాయమని అంటున్నారు. కాకుంటే... ఇది రాజకీయ కాషాయం. ఇక వారణాసిలో బతకకున్నా... తన రాజకీయ వరస మాత్రం మార్చుకోబోతున్నారట.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. రీజనల్ రింగ్ రోడ్, పర్యాటక శాఖకు సంబంధించి రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం అటవీ భూముల అనుమతులపై చర్చించారు. సీఎం రేవంత్‌తో పాటు మంత్రి కొండా సురేఖ కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్‌ను కలిసి, రాష్ట్రం నుంచి పంపించిన ప్రతిపాదనలను త్వరగా ఆమోదించాలని కోరారు. భూపేందర్ యాదవ్ సానుకూలంగా స్పందించారు. కేంద్ర పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో…
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. జనవరి 17 నుంచి 24 వరకు సింగపూర్, స్విట్జర్లాండ్ దేశాల్లో సీఎం పర్యటించనున్నారు. సీఎంతో పాటు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ పర్యటనల్లో పాల్గొననున్నారు. గురువారం రాత్రి 10 గంటలకు ఢిల్లీ నుంచి రేవంత్ రెడ్డి బృందం సింగపూర్‌కు బయలుదేరుతుంది. 17, 18, 19 తేదీల్లో సింగపూర్‌లో మూడు రోజులు పర్యటిస్తారు. ఈ పర్యటనలో…
ఖమ్మం పత్తి మార్కెట్లో బుధవారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దాదాపు 400 పత్తి బస్తాలు అగ్నికి ఆహుతయ్యాయి. సంక్రాంతికి ముందు కొందరు వ్యాపారులు రైతుల వద్ద కొనుగోలు చేసిన పత్తి అగ్ని ప్రమాదంలో కాలిపోయింది. ఈ ఘటనపై రాత్రే స్పందించిన మంత్రి తుమ్మల నాగేశ్వర రావు.. నేడు ఖమ్మం మార్కెట్‌ను పరిలిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాత్రి పత్తి కాలిపోవడం దురదృష్టకరం అని పేర్కొన్నారు. ఖమ్మం మార్కెట్‌ను ఆదర్శవంతమైన మార్కెట్‌గా తీర్చి దిద్దుతా అని…