నేడు నెల్లూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన..
నెల్లూరు జిల్లా కందుకూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు (ఫిబ్రవరి 15) పర్యటించబోతున్నారు. నేటి ఉదయం 11.45 గంటలకి టీఆర్ఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ప్రాంతం వద్ద దిగి.. అక్కడి నుంచి కోవూరు రోడ్డు మీదగా దూబగుంట సమీపంలో ఏర్పాటు చేస్తున్న ఎంఆర్‌ఎఫ్ ఫెసిలిటీ సెంటర్ (వేస్ట్ ప్రాసెసింగ్ యూనిట్)కు శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొననున్నారు. ఆ తర్వాత దూబగుంట గ్రామంలోని స్థానికులతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక, స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా గ్రామంలో కాలనీలు, డ్రైనేజీలు శుభ్రం చేసే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎంపిక చేసిన మూడు గృహాలలో ఇంకుడుగుంతలను సైతం ఆరంభించనున్నారు. అనంతరం పార్కు కమ్ పాండ్‌ను ఆయన సందర్శించనున్నారు. ఆ తర్వాత కందుకూరులోని అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం పాల్గొంటారు. ఈ బహిరంగ సభలో మాట్లాడటంతో పాటు మున్సిపాలిటీలోని ప్రజలతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం హెలిపాడ్ వద్దకు చేరుకుని ఉండవల్లికి తిరిగి పయనం అవుతారు. ఇక, సీఎం చంద్రబాబు పర్యటన ఏర్పాట్లను మంత్రులు పర్యవేక్షిస్తున్నారు.
ఢిల్లీ పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్ విస్తరణపై పార్టీ పెద్దలతో చర్చ..?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం సాయంత్రం హుటాహుటిన ఢిల్లీకి పయనమయ్యారు. ఏఐసీసీ పిలుపుతో ఆయన హస్తినకు వెళ్లినట్లుగా సమాచారం. ఈ సందర్భంగా ఈరోజు (ఫిబ్రవరి 15) పార్టీ పెద్దలతో సమావేశం కానున్నారు. ఈ పర్యనటలో భాగంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కేసీ వేణు గోపాల్ తో పాటు పలువురు పార్టీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి కలవనున్నారు. ఈ భేటీలో టీపీసీసీ కార్యవర్గ కూర్పుతో పాటు కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ పదవుల నియామకంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఇక, నామినేటెడ్ ప్రభుత్వ పదవులకు అభ్యర్థులను ఎంపిక చేయడం, ఎమ్మెల్యేల కోటా కింద ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల లిస్ట్ రెడీ చేయడం వంటి అంశాలపై కాంగ్రెస్ అధిష్టానంతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. అలాగే, తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ చేపట్టిన కులగణన, ఎస్సీ వర్గీకరణ, పార్టీలో చోటు చేసుకుంటున్న పరిణామాలను కూడా అధిష్టానం దృష్టికి సీఎం తీసుకెళ్లే ఛాన్స్ ఉంది.
మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు..
తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, సినీ నటి మాధవి లత వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. న్యూ ఇయర్ సందర్భంగా తాడిపత్రిలో మహిళల కోసం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు జేసీ ప్రభాకర్ రెడ్డి. అయితే ఈ ఈవెంట్ కు మహిళలు ఎవరు వెళ్లొదంటూ మాధవీ లత ఓ వీడియో రిలీజ్ చేసింది. దాంతో ఆగ్రహించిన జేసీ నటి మాధవిలతనుద్దేసిస్తూ మాధవీ లత ఒక వ్యభిచారి అని, ఆమెను బీజేపీలో ఇంకా ఎందుకు కొనసాగిస్తున్నారో తెలియడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలో జేసీ ప్రభాకర్ పై విమర్శలు రావడంతో మాధవిలతకు ఆ మధ్య క్షమాపణలు చెప్పారు. ఆవేశంలో మాట్లాడాను అని వివరణ ఇచ్చారు. ఇక ఇక్కడితో ఈ వ్యవహారం సద్దు మణిగింది అని అందరు అనుకున్నారు. కానీ తాజాగా మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి పై కేసు నమోదు అయింది. సినీ నటి మాధవి పై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదు చేసారు పోలీసులు.సైబరాబాద్ పోలీసులకు సినీనటి మాధవిలత ఇచ్చిన ఫిర్యాదు పై కేసు నమోదు చేసిన పోలీసులు. సినీనటి మాధవిని ఉద్దేశిస్తూ కొన్నాళ్ల క్రితం అభ్యంతరకర అసభ్యకరమైన దూషణలు చేసారు ప్రభాకర్ రెడ్డి. తనను కించపరుస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారని ఫిర్యాదు చేసిన సినీ నటి మాధవిలత.
ప్రయాగ్‌రాజ్‌లో రోడ్డుప్రమాదం.. 10 మంది భక్తుల మృతి
మహా కుంభమేళాలో మరో ఘోర ప్రమాదం జరిగింది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కు భక్తులతో వెళ్తున్న బస్సును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది భక్తులు మృతిచెందారు. మరో 19 మంది గాయపడ్డారు. ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా నుంచి యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లోని త్రివేణి సంగంలో స్నానం చేసేందుకు వెళ్తున్నారు. అయితే ప్రయాగ్‌రాజ్-మిర్జాపూర్ హైవేలోని మేజా ప్రాంతంలో బొలెరో కారు బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోగా.. 19 మంది గాయపడ్డారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం స్వరూప్ రాణి మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. తదుపరి ప్రక్రియ కొనసాగుతోందని డీసీపీ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు.
మద్యం ఎందుకు అమ్ముతున్నారని ప్రశ్నించినందుకు ఇద్దరు యువకుల దారుణ హత్య
తమిళనాడులో దారుణం చోటు చేసుకుంది. తమ కాలనీలో మద్యం ఎందుకు అమ్ముతున్నారు అని ప్రశ్నించడంతో ఇద్దరు యువకులను దారుణంగా హత్యచేశారు. ఈ ఘటన తమిళనాడు రాష్ట్రం మైలాడుతురై జిల్లా ముట్టం గ్రామంలో చోటుచేసుకుంది… గ్రామానికి చెందిన హరీష్, హరిశక్తి ఇంజనీరింగ్ విద్యార్థులు. తమ కాలనీలో ఎందుకు మద్యం అమ్ముతున్నారని.. రాత్రి పగలు తేడా లేకుండా అమ్మడం ఏంటని మద్యం వ్యాపారులతో గొడవకు దిగారు.. విద్యార్థుల గొడవతో పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇద్దరు మద్యం వ్యాపారాలను అరెస్టు చేశారు. అయితే తమతో గొడవపడి వ్యాపారానికి అడ్డొచ్చిన యువకులపై కక్ష పెంచుకున్న మద్యం వ్యాపారులు… తెల్లవారుజామున ఇంటి బయట ఉన్న ఇద్దరు యువకులను దారుణంగా కత్తితో పొడిచి హత్య చేశారు. హత్య చేసిన మద్యం ముగ్గురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. పుదుచ్చేరిలోని రెయిన్‌బో నగర్‌లోని 7వ క్రాస్ స్ట్రీట్‌లోని ఒక శిథిలావస్థలో ఉన్న ఇంట్లో ముగ్గురు యువకులు హత్యకు గురైనట్లు పెరియకడై పోలీసులకు సమాచారం అందింది. వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇద్దరు యువకుల మృతదేహాలను గుర్తించారు.
దిల్ రూబా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. కిరణ్ అబ్బవరం గతేడాది “క” సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టాడు. ఈ సినిమా ఘనవిజయం ఇచ్చిన ఉత్సాహంలో దిల్ రూబా సినిమాను అనౌన్స్ చేసారు. “క” సూపర్ హిట్ తర్వాత వస్తున్న చిత్రంగా ‘దిల్ రూబా’ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఆ మధ్య రిలీజ్ చేసిన ‘దిల్ రూబా’ టీజర్ కు మంచి స్పందన లభించింది. మొదట ఈ సినిమాను ప్రేమికుల దినోత్సవం కానుకగా ఫిబ్రవరి 14న వరల్డ్ వైడ్ గా థియేటర్స్ లో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు.
బాలీవుడ్ బ్యూటీ తో నాగ్ అశ్విన్ మూవీ..?
టాలీవుడ్ నుంచి పోటీ పడుతున్న దర్శకుల్లో నాగ్ అశ్విన్ ఒకరు. ఆయన తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడి’ మూవీ బాక్సాఫీస్ దగ్గర ఎంత సెన్సేషనల్ హిట్‌గా నిలిచిందో చెప్పకర్లేదు.ప్రభాస్ హీరోగా నటించిన ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉండనుండటంతో ‘కల్కి సీక్వెల్’ చిత్రం ఎప్పుడు ఎప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. కానీ షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందా అనే దాని మీద ఇంకా క్లారిటీ లేదు. ఇటివల నిర్మాత అశ్వినిదత్ జూన్ ఉంచి ఉండొచ్చని హింట్ ఇచ్చాడు. కానీ.. ప్రభాస్ ఉన్న బిజీ చూస్తుంటే ఇప్పుడంతా లో స్టార్ట్ అయ్యేలా కనిపించడం లేదు. ఎందుకంటే ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ పూర్తి అయ్యాక, ‘స్పిరిట్’ సెట్స్ మీదకు రావాలి అని సందీప్ రెడ్డి వంగా చెప్పడంతో ప్రభాస్ కూడా ఎస్ చెప్పాడని టాక్. అంటే అప్పటిదాకా ‘కల్కి 2’ డౌటే. అయితే ఆలోపు అశ్విన్ బాలీవుడ్ హీరోయిన్ తో ఓ మూవీ ప్లాన్ చేస్తున్నట్లు తాజాగా ఓ న్యూస్ బయటకు వచ్చింది.