తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తమిళనాడు, కర్నాటక బీజేపీ సహా ఇంఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి, పలువురు బీజేపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో 70 శాతం మండలాల్లో 3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి.. రాష్ట్రంలో వాతావరణం బీజేపీకి అనుకూలంగా ఉంది.. దీన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
హైదరాబాద్ నాంపల్లిలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర సంక్షేమ పథకాల పేర్లను మార్చితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తే.. ఇందిరమ్మ పేరు ఎలా పెడతారని ప్రశ్నించారు. కేంద్ర సంక్షేమ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పేర్లనే రాష్ట్రాలు పెట్టాలన్నారు. పేదల ఇళ్ల కోసం కాకుండా.. పేర్ల కోసం కాంగ్రెస్ నేతలు పాకులాడుతున్నారని బండి సంజయ్ విమర్శించారు. 6 గ్యారంటీలపై కాంగ్రెస్కు చిత్తశుద్ధి…
ప్రభుత్వ పథకం ‘ఇందిరమ్మ ఆత్మీయ భరోసా’పై తెలంగాణ హైకోర్టులో పిల్ దాఖలైంది. నారాయణపేటకు చెందిన గవినోళ్ల శ్రీనివాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా తెలంగాణ ప్రభుత్వం పథకం రూపొందించిందని, పట్టణ (మున్సిపాలిటీల పరిధి) రైతు కూలీలకు మాత్రం డబ్బులు ఇవ్వడం లేదని శ్రీనివాస్ తన పిటిషన్లో పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ కోర్టుకు హాజరయ్యారు. Also Read: Ration Cards: రేషన్ కార్డులు ఇవ్వడం…
గతంలో ఎవ్వరూ రేషన్ కార్డులు ఇవ్వలేదనట్లు కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతోందని, రేషన్ కార్డులు ఇవ్వడం చారిత్రాత్మకమా? అని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఆరు లక్షల యాబై వేల రేషన్ కార్డులు ఇచ్చామని, కాంగ్రెస్ సర్కార్ లాగా ఏనాడూ ప్రచారం చేసుకోలేదని మండిపడ్డారు. కేసీఆర్ నాయకత్వంలో చేసిన పనులు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చేయలేదన్నారు. జనవరి 30వ తారీఖు నాడు 420 హామీలు ఇచ్చి 420 రోజులు అవుతుందని…
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజా పాలన’ కార్యక్రమంలో ఇందిరమ్మ ఇల్లు రాలేదని మనస్థాపం చెందిన ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద సంఘటన పెద్దపెల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం కిష్టంపేటలో సోమవారం చోటుచేసుకుంది. రైతు మరణంతో కిష్టంపేటలో విషాదఛాయలు అలుముకున్నాయి. పెద్దదిక్కు మరణించడంతో కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. Also Read: Phone Tapping Case: అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు ఊరట! వివరాల ప్రకారం… పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్…
ఫోన్ ట్యాపింగ్ కేసులో అదనపు ఎస్పీ తిరుపతన్నకు ఊరట లభించింది. సుప్రీంకోర్టు అతడికి బెయిల్ మంజూరు చేసింది. తిరుపతన్న బెయిల్ పిటిషన్ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మలతో కూడిన ధర్మాసనం సోమవారం విచారించింది. కేసు దర్యాప్తు, విచారణకి పూర్తిగా సహకరించాలని.. సాక్షులని ప్రభావితం చేయవద్దని తిరుపతన్నకు సుప్రీంకోర్టు కండిషన్స్ పెట్టింది. దాంతో ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి తెలంగాణ ప్రభుత్వంకు గట్టి షాక్ తగిలింది. గడిచిన 10 నెలలుగా తిరుపతన్న జైలులో ఉన్న…
తెలంగాణలో మరో సంచలన ఘటన చోటుచేసుకుంది. నల్గొండ జిల్లా సూర్యాపేటలో పరువు హత్య కలకలం రేపింది. ఆదివారం ఆర్ధరాత్రి నగర శివారులోని మూసీ కాల్వ కట్టపై ఓ యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. మామిళ్లగడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అలియాస్ మాల బంటి అనే యువకుడు హత్యకు గురైనట్లు పోలీసులు గుర్తించారు. యువకుడిని దుండగులు బండ రాళ్లతో మోదీ హత్య చేసినట్లు పోలీసులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. Also Read: Hydra…