HYDRA: హైదరాబాదులోని అమీన్ పూర్లో మరోసారి హైడ్రా అధికారుల కూల్చివేతలు ప్రారంభం కానున్నాయి. ఈ కూల్చివేతలు అమీన్ పూర్ పెద్ద చెరువు వద్ద అక్రమంగా నిర్మించిన నిర్మాణాలపై జరుగుతున్నాయి. పలు ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టిన హైడ్రా అధికారులు, చెరువును ఆక్రమించుకొని నిర్మాణాలు చేయడాన్ని గుర్తించారు. అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు తేలిన వెంటనే, హైడ్రా కమిషనర్ కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కూల్చివేతలు మరికొద్ది సేపట్లో ప్రారంభం కానున్నాయి. హైడ్రా అధికారులు ఈ కూల్చివేతల సమయంలో ప్రజల…
KTR: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. పలు సందర్భాల్లో తెలంగాణ అభివృద్ధిపై.. ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధి, సైబరాబాద్, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చాలా వేదికల్లోనూ ప్రశంసలు కురిపించారు.. తాజాగా, దావోస్ పర్యటనలో ఏపీ, మహారాష్ట్ర, తెలంగాణ సీఎంలో పాల్గొన్న కార్యక్రమంలోనూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్గా ఉందంటూ చంద్రబాబు కీర్తించారు.. ఇక, సోమవారం మీడియా సమావేశంలోనూ మరోసారి ఇదే అంశాన్ని ప్రస్తావించారు చంద్రబాబు.. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో తలసరి ఆదాయంలో అగ్రస్థానంలో…
Nalgonda: బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నేడు నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో రైతు మహా ధర్నా జరగనుంది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్యఅతిథిగా హాజరవుతారు. అలాగే మాజీ మంత్రి గుంటకంట్ల జగదీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర బీఆర్ఎస్ నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొననున్నారు. ఈనెల 12న నిర్వహించాల్సిన ఈ మహాధర్నాను సంక్రాంతి పండుగ కారణంగా వాయిదా వేసి 21న నిర్వహించేందుకు నిర్ణయించారు. కానీ, ఆ రోజుకు అనుమతి నిరాకరించిన పోలీసులు,…
రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
ప్రజా ప్రభుత్వం మరో రికార్డు నెలకొల్పింది. ఒకే రోజు నాలుగు సంక్షేమ పథకాలను విజయవంతంగా ప్రారంభించటంతో పాటు.. అక్కడికక్కడే 6,15,677 మంది అర్హులకు లబ్ధి కల్పించింది. అదే రోజున రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు ఆర్థిక శాఖ రూ. 579 కోట్లు విడుదల చేసింది.