తెల్ల రేషన్ కార్డు దారులకు సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. ప్రతి పేదవాడు సన్న బియ్యం తినాలని ఈ పథకం తీసుకొచ్చామన్నారు. అద్భుతమైన పథకం రూపొంచించిన ఉత్తమ్ కుమార్ రెడ్డికి ధన్యవాదాలు.. భూమి కోసం భుక్తి కోసం పోరాటం చేసిన చరిత్ర ఉమ్మడి నల్లగొండ జిల్లాది.. పౌరుషాల గడ్డ నల్లగొండ జిల్లా.. ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పినట్టే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీ ఇచ్చారు.
Also Read:Cool Down Electronic Gadgets: వేసవిలో ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లను చల్లగా ఉంచడానికి ఇలా చేస్తే సరి!
నల్లగొండ జిల్లా తీర్పు, ప్రజా తీర్పుగా గుర్తిస్తారు. 25 లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది, ఇందిరమ్మది.. రేషన్ షాపుల ద్వారా అందిస్తున్న దొడ్డు బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఆ బియ్యాన్ని 10 రూపాయలకు అమ్ముకుంటున్నారు.. మిల్లర్లు ఆ బియ్యాన్ని కొని ప్రభుత్వానికీ అమ్ముతున్నారు.. మిల్లర్ల మాఫియా చేతుల్లోకి దొడ్డు బియ్యం వెళ్ళడం వల్ల 10 వేల కోట్ల నష్టం జరుగుతుంది.. మిల్లర్లు ప్రభుత్వానికి సహకరించటం లేదు.. ఆహార భద్రత చట్టాన్ని పకడ్బందిగా అమలు చేస్తాం.. బీఆర్ఎస్ ఎందుకు సన్న బియ్యం ఇవ్వలేకపోయింది.. కేసీఆర్ తన ఫామ్ హౌస్ లో వరి సాగు చేసి.. రాష్ట్ర ప్రజలను మాత్రం వరి సాగు వద్దు అన్నారు.. సన్న బియ్యం పథకం చరిత్రలో మిగిలిపోతుంది.
Also Read:CSK vs RR: చెన్నై ఫీల్డింగ్.. విక్టరీపై కన్ను
ఎవర సీఎంగా ఉన్నా, ఏ ప్రభుత్వం వచ్చినా సన్న బియ్యం పథకం ఆపలేరు. రాష్ట్రంలో అన్ని సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేస్తాం..10ఏళ్లు సీఎంగా ఉన్న కేసీఆర్ SLBC నీ నిర్లక్ష్యం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి కొట్లాడితె slbc ప్రాజెక్ట్ వచ్చింది.. నల్లగొండ జిల్లా మీద కోపంతోనే జిల్లా సాగు నీటినీ నిర్లక్ష్యం చేశారు.. కాళేశ్వరం ప్రపంచంలో 8వ వింత కాదు.. ఏకైక వింత.. మీకు ఉరి వేసినా తప్పులేదు.. నా సంకల్పం మంచిది కాబట్టి నా జిల్లా ప్రజలు ఆశీర్వదించారు.. ప్రజలు mp గా గెలిపించాను… Pcc అధ్యక్షుడిని అయ్యాను.. రైతుల గుండెల్లో ఇందిరమ్మ, సోనియమ్మ పేరు నిలిచిపోయేలా పని చేస్తాం.. ఉత్తమ్ అడిగినవి అన్ని మంజూరు చేస్తామని సీఎం రేవంత్ వెల్లడించారు.