Bhu Bharati Portal: తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ్టి (ఏప్రిల్ 14న) నుంచి ప్రభుత్వం సరికొత్తగా భూ సమస్యల పరిష్కారం, లావాదేవీలకు సంబంధించిన సమాచారం రైతులకు, ప్రజలకు మరింత సులభంగా, వేగంగా అందుబాటులో ఉండే విధంగా భూ భారతి పోర్టల్ ను తీసుకొచ్చింది. ఈ పోర్టల్ ను ఈరోజు సాయంత్రం 5 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. భూ భారతి ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణలోని మూడు మండలాలను పైలెట్ ప్రాజెక్టులుగా ఎంపిక చేసుకొని వాటిలో జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ప్రజలకు, రైతులకు భూ భారతిపై అవగాహన కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆయా సదస్సుల్లో ప్రజల నుంచి వచ్చే సందేహాలు, సలహాలు, సూచనలను స్వీకరించే అవకాశం ఉంది.
Read Also: Vijay Devarakonda : ‘కింగ్డమ్’ రిలీజ్ డేట్ పై క్లారిటీ కావలంటున్న ఫ్యాన్స్..!
ఇక, అలాగే, కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. భూ భారతి పోర్టల్, ఇందిరమ్మ ఇళ్లపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రజలకు, రైతులకు అర్థమయ్యేలా సులభమైన భాషలో భూ భారతి పోర్టల్ రూపొందించింది తెలంగాణ ప్రభుత్వం. వెబ్ సైట్‌తో పాటు యాప్‌ను పటిష్టంగా నిర్వహించాలని అధికారులకు సీఎం ఆదేశించారు. ఈ పథకాలపై అసత్య ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకునేలా కలెక్టర్లకు సూచనలు చేయనున్నారు. దీంతో పాటు రాష్ట్రంలో తాగునీటి పథకాలపైనా కూడా సీఎం చర్చించనున్నారు.