నేడు సుప్రీంకోర్టులో తెలంగాణ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణ జరగనుంది. విచారణ జరపనున్న జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ అగస్టీన్ జార్జ్ ల ధర్మాసనం విచారణ చేపట్టనుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ జరగనుంది. ఫిరాయింపుల అంశంపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఆలేటి మహేశ్వర్ రెడ్డి కూడా సుప్రీం కోర్టును ఆశ్రయించారు. మహేశ్వర్ రెడ్డి పిటిషన్ను బీఆర్ఎస్ నేతల పిటిషన్లను ట్యాగ్ చేసే అవకాశం ఉంది.…
సంక్షేమం అనే పదానికి అర్థమే మారిపోతుందని మంత్రి సీతక్క అన్నారు. బీపీఎల్ కింది వర్గాలకు ఆర్థిక సాయం చేసే పద్ధతి పోయిందని మండిపడ్డారు. అసెంబ్లీలో ఆమె మాట్లాడుతూ.. చెరువులను తెంపి చాపలు పంచే విధానంగా సంక్షేమము మారిందన్నారు. ఎస్సీ ఎస్టీ మైనార్టీ, పి ఆర్ ఆర్ బి, మహిళా సీ సంక్షేమ శాఖలకు గతంతో పోలిస్తే అత్యధికంగా నిధులు కేటాయించామని తెలిపారు. స్వరాష్ట్రంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చలేదని.. అందుకే ఆరు గ్యారెంటీలను అమలు చేసే విధంగా తెలంగాణ…
ఉద్యోగులకు తీపికబురు.. ఖాతాల్లో జమ అవుతోన్న నిధులు.. ఉద్యోగులకు శుభవార్త చెప్పింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.. ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిల విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రెండు రోజుల క్రితమే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు.. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలు.. దాదాపు 6,200 కోట్ల రూపాయాలు చెల్లించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో నిధులు జమ అవుతున్నాయి. GLI,…
Harish Rao : మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విరుచుకుపడ్డారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లను అరెస్టు చేయడాన్ని ఖండిస్తూ, తక్షణమే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. “అభయహస్తం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు పెంచాలని అడగడమే ఆశాలు చేసిన నేరమా?” అని ప్రశ్నించారు. వందల సంఖ్యలో పోలీసులను మోహరించి, బలవంతంగా వాహనాల్లో ఎక్కించి పోలీస్ స్టేషన్లకు తరలించడం దుర్మార్గమన్నారు. హరీష్ రావు మాట్లాడుతూ, కేసీఆర్ ఆశా వర్కర్లకు…
Heavy Rain: హైదరాబాద్ నగరంలో పలు చోట్ల వర్షం పడుతుంది. వాతావరణంలో మార్పుల వల్ల నగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వాన కురుస్తోంది. కాగా, హైదరాబాద్ పరిధిలో బోరబండా, మాదాపూర్, నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతి నగర్, జూబ్లిహిల్స్, సుల్తాన్ పూర్, మల్లంపేట్, గండి మైసమ్మ పరిసర ప్రాంతాలలో కురుస్తుంది వర్షం.
Sabitha Indra Reddy: మేడ్చల్ లో ఎంఎంటీఎస్ ట్రైన్ లో మహిళపై అత్యాచారయత్న ఘటనపై మాజీ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి స్పందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో మహిళలకు భద్రత లేదన్నారు.
Minister Komatireddy: నల్లగొండ జిల్లాలో పర్యటించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎన్టీవీతో మాట్లాడుతూ.. కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడుతున్నాడు.. పార్లమెంట్ స్థానాల్లో డిపాజిట్ లు కోల్పోయారు అని మండిపడ్డారు.
Local Body MLC Election: హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. ఇక, మే 1వ తేదీతో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎంఎస్ ప్రభాకర్ రావు పదవీ కాలం ముగియనుంది.
Lawyer Murder Case: హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. చంపాపేట్ పరిధిలోని న్యూ మారుతి నగర్ కాలనీలో లాయర్ ఇజ్రాయెల్ పై కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన న్యాయవాది ఇజ్రాయెల్ ను అపోలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందించగా.. ట్రీట్మెంట్ పొందుతూ మృతి చెందారు.