బీసీ రిజర్వేషన్స్ బిల్లు విషయమై తెలంగాణ బీజేపీ తడబడిందన్న వాదన బలపడుతోంది రాష్ట్ర రాజకీయవర్గాల్లో. దీనిపై కాస్త గట్టి చర్చే జరుగుతోందట. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లు అమలు చేయడంపై అభ్యంతరం చెబుతూ వస్తోంది కాషాయ దళం. తాము అధికారంలోకి వస్తే.... ఆ కోటాను ఎత్తేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కూడా పెట్టింది.
Minister Seethakka : వికలాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ఆధ్వర్యంలో సైదాబాద్ అబ్జర్వేషన్ హోమ్ లో డ్రగ్ డి-అడిక్షన్ సెంటర్ను మంత్రి సీతక్క ప్రారంభించారు. మిషన్ పరివర్తన కార్యక్రమం ద్వారా దేశంలోని డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలను సహకారం చేస్తూ ముందుకు వెళుతున్నామని మంత్రి సీతక్క తెలిపారు. డి అడిక్షన్ సెంటర్ నిర్వహణ కోసం వికలాంగులు,వయోవృద్ధులు,ట్రాన్స్ జెండర్ సాధికారత శాఖ ద్వారా 13 లక్షల 80 వేల…
తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. “కేసీఆర్ గారి ఆధ్వర్యంలో 14 సంవత్సరాలపాటు తెలంగాణ ఉద్యమం నడిపించారు. మెజార్టీ నియంతృత్వం మందబలం ఉన్నప్పుడు జరిగే నష్టాలు మా తెలంగాణ ప్రజలకు తెలుసు.. తెలంగాణ ఉద్యమ కాలంలో ఢిల్లీలో ఉన్న మంద బలంతో పాటు సమైక్యరాష్ట్రంలోని మెజార్టీ నాయకత్వం పైన పోరాటం…
నిరుద్యోగులకు ఉద్యోగ కల్పనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. జాబ్ నోటిఫికేషన్స్ ఇస్తూ.. పరీక్షలను నిర్వహిస్తూ.. వేగంగా ఫలితాలను ప్రకటిస్తూ నియామకాలు చేపడుతోంది. ఇప్పటికే గ్రూప్ 1,2,3 ఫలితాలను విడుదల చేసిన విషయం తెలిసిందే. అదేవిధంగా గత సంవత్సరం జాబ్ క్యాలెండర్ ను కూడా విడుదల చేసింది. తాజాగా రేవంత్ సర్కార్ నిరుద్యోగులకు గుడ్ న్యూస్ అందించింది. 10,954 గ్రామ పాలన అధికారి పోస్టులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ శాఖలో…
డీలిమిటేషన్.. ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఎక్కడ విన్నా డీలిమిటేషన్ గురించే చర్చ నడుస్తోంది. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే.స్టాలిన్ సారథ్యంలో డీలిమిటేషన్పై చెన్నైలోని ఐటీసీ ఛోళా హోటల్లో దక్షిణాది రాష్ట్రాల సీఎంలు సమావేశం అయ్యారు. దీంతో రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాది రాష్ట్రాలకు వాటిల్లే నష్టంపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సమావేశానికి హాజరైన సీఎం రేవంత్ రెడ్డీ డీలిమిటేషన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు.…
శ్రీశైలం జలాశయంలో ఒకవైపు నీటిమట్టం వేగంగా పడిపోతుంది. ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి తెలంగాణ జెన్కో విద్యుత్ ఉత్పత్తి కొనసాగిస్తుండగా.. కుడి విద్యుత్ కేంద్రంలో ఏపీ జెన్కో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసింది. రోజుకు ఒక టీఎంసీకి పైగానే విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తుండడంతో సమీప కాలంలోనే శ్రీశైలం డ్యామ్ లో నీటిమట్టం డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది..