ASHA Workers Protest: తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆశా వర్కర్లు చేస్తున్న ఆందోళన ఉద్రిక్తతకు దారి తీసింది. కోఠిలోని ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయంలో నిరసన చేస్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అరెస్టు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు పెద్ద ఎత్తున్న నినాదాలు చేస్తున్నారు.
ఇష్టారాజ్యంగా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు నడుస్తున్నాయని మండిపడ్డారు. పద్దతి ప్రకారం అసెంబ్లీ నడవటం లేదు.. రాజ్యాంగ విలువలు, నిబంధనలు లేకుండా అసెంబ్లీ నడుస్తుంది అని జగదీశ్ రెడ్డి ఆరోపించారు.
Congress: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలకు ఏఐసీసీ నుంచి పిలుపు వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ మధ్యాహనం 3.30 గంటలకి డిల్లీకి బయలు దేరి వెళ్లనున్నారు.
CM Revanth Reddy: శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్లో రెస్క్యూ ఆపరేషన్ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈరోజు (మార్చ్ 24) సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
Hanamkonda: హనుమకొండ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. హిందూ యువకుడిపై దాడికి పాల్పడ్డారు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన కొందరు యువకులు. వివరాల్లోకి వెళితే.. ముస్లిం అమ్మాయితో మాట్లాడాడు అనే సాకుతో న్యూ శాంపేట్ ప్రాంతానికి చెందిన సాయి చరణ్ అనే యువకుడిని కిడ్నాప్ చేసి తీవ్రంగా కొట్టారు కొందరు మైనార్టీ యువకులు
Asha Workers: తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ నేడు చలో హైదరాబాద్ కి పిలుపునిచ్చారు తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆశా వర్కర్లు. తమ డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ.. ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.
Congerss Minister : సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్ పహాడ్ వద్ద మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సమావేశంలో తెలంగాణలో సన్న బియ్యం పంపిణీ, నల్లగొండ జిల్లాకు సంబంధించిన అభివృద్ధి ప్రణాళికలు, కాంగ్రెస్ భవిష్యత్ లక్ష్యాల గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, “తెల్ల రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికి ఏప్రిల్ నెల…
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. తనకు 65 ఏళ్ల వయసు ఉందని అనారోగ్యంతో బాధపడుతున్నానని పిటిషన్ లో పేర్కొన్నారు. తాను వైద్యం కోసమే అమెరికా వెళ్ళినట్టు నాంపల్లి కోర్టులో మెమో దాఖలు చేశానని ప్రభాకర్ రావు తెలిపారు. తనకు ఏ రాజకీయ పార్టీతో సంబంధాలు లేవంటూ హైకోర్టుకు ప్రభాకర్ రావు…
మేడ్చల్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ సైకో వీరాంగం సృష్టించాడు. రోడ్డుపై వెళ్తున్నవారిపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డాడు. సైకో దాడిలో గాయపడిన ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. సైకో చేసిన రాళ్ల దాడిలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. ఈ ఘటన స్థానికంగా తీవ్రకలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన జగేశ్వర్ తన భార్య, కుమార్తె రియాకుమారి(6)తో కలిసి పోచారం మునిసిపాలిటీలో నివాసం ఉంటూ భవన నిర్మాణ పనులు చేసుకుంటూ జీవిస్తున్నాడు. పశ్చిమ…
మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి దూకుడు, ఆయన వ్యవహార శైలి ఏకంగా సొంత హస్తం పార్టీ క్యాడర్‌నే కలవర పెడుతోందట. అంతా నా ఇష్టం.. నా మాటే శాసనం అన్నట్టుగా ఆయన పోకడ ఉందని అంటున్నారు. నేను చెప్పినట్టే అంతా నడవాలి.. నా మాటే వినాలి.. అన్నీ నేనే అన్ని సెట్ చేస్తానంటూ..