Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కీలక సూత్రధారి అయినటు వంటి మాజీ ఐపీఎస్ అధికారి ప్రభాకర్ రావుకి కేంద్ర ప్రభుత్వం బిగ్ షాక్ ఇచ్చింది. ప్రభాకర్ రావు పాస్ పోర్ట్ రద్దు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
నాగార్జున సాగర్ లో ములుగు సీఆర్పీఎఫ్ బెటాలియన్ పోయి విశాఖ సీఆర్పీఎఫ్ బెటాలియన్ వచ్చిందన్నారు.. ఇప్పుడు సాగర్ పూర్తిగా చంద్రబాబు చేతిలోకి వెళ్లిపోయింది.. కేసీఆర్ సీఎంగ ఉన్నాన్ని రోజులు సీఆర్పీఎఫ్ బలగాలను సాగర్ కు రానివ్వలేదు అని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి చెప్పుకొచ్చారు.
CM Revanth Reddy: తెలంగాణ మాజీ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ తండ్రి తమిళనాడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, గొప్ప సాహితీవేత్త కుమారి అనంతన్ (హరికృష్ణన్ నాడార్ అనంత కృష్ణన్) మరణం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Bird flu: తెలంగాణ రాష్ట్రంలో బర్డ్‌ఫ్లూ విజృంభిస్తుంది. తాజాగా సిద్ధిపేట జిల్లాకు తాకింది ఈ వ్యాది. తొగుట మండలంలోని కాన్గల్ గ్రామ శివారులోని కోళ్ల ఫాంలో గత కొన్ని రోజులుగా కోళ్లు మృత్యువాత పడుతుండటంపై ఈ నెల 3వ తేదీన హైదరాబాద్ లోని పశుసంవర్థక శాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు.
కామారెడ్డి జిల్లాలో మరోసారి కల్తీకల్లు కలకలం రేపింది. గాంధారి మండలం గౌరారంలో కల్తీకల్లు తాగి 30 మంది అస్వస్థకు గురయ్యారు. అందులో ఆరుగురి పరిస్థితి సీరియస్‌గా ఉంది. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. కామారెడ్డి ప్రభుత్వ హాస్పిటల్ ఐసీయూలో ఆరుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. గౌరారంలోని కల్లు దుకాణంలో కల్లు తాగిన వారు వింతగా ప్రవర్తిస్తున్నారు. కుస్తీ పోటీల సందర్భంగా గౌరారం గ్రామానికి చెందిన గ్రామస్తులు కల్లు తాగారు. కల్లు దుకాణంపై చర్యలు తీసుకోవాలని…
టెక్నాలజీ అందుబాటులోకి వచ్చాక మోసాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. సోషల్ మీడియా ఉపయోగించుకుని మోసాలకు తెగబడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఓ వ్యక్తి ఏకంగా ఎమ్మెల్యే ఫొటోలను ప్రొఫైల్ పిక్ గా వాడుకుని యువతులను బురిడీ కొట్టించాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 26 మంది యువతులను పెళ్లి పేరుతో నమ్మించి డబ్బులు దండుకున్నాడు. దీనికోసం షాడి డాట్ కామ్ ను ఉపయోగించుకున్నాడు. షాది డాట్ కామ్ మోసగాడి కేసులో సంచలన విషయాలు వెలుగుచూశాయి.…