తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ నిన్న టిఆర్ఎస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.. ఉద్యమ నేత నుంచి టీఆర్ఎస్లో కీలకనేత స్థాయికి ఎదిగిన ఈటల రాజేందర్ ఎట్టకేలకు 19 ఏళ్ల అనుబంధం తరువాత టీఆర్ఎస్తో బంధానికి స్వస్తి పలికారు. కాగా నేడు ఈటల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా లేఖను స్పీకర్ కు సమర్పించే అవకాశం ఉండగా.. ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. మంచి రోజు కోసం చూస్తున్న ఈటలకు…
తెలంగాణ మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతోపాటు ఎమ్మెల్యే పదవికి సైతం ఈటల రాజేందర్ రాజీనామా చేయనున్నారు. దీనిలో భాగంగా ఈ రోజు రాజేందర్ స్పీకర్‌కు శాసనసభ సభ్యత్వానికి రాజీనామా లేఖను పంపనున్నారు. టీఆర్ఎస్ పార్టీతో తనకున్న 19 ఏళ్ల అనుబంధాన్ని వదులుకుంటున్నట్లు రాజేందర్ ప్రకటించారు. ఆత్మగౌరవాన్ని ఎప్పుడూ వదులుకోబోనని… బానిసగా బతకలేనని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధర్మాన్ని నమ్ముకున్న కేసీఆర్…. ఇప్పుడు…
తెలంగాణ రాష్ట్రంలో కరోనా విపత్తు ప్యాకేజీ కింద నేటి నుంచి ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించనున్నారు. కేంద్ర ప్రభుత్వ పథకం పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఇచ్చే ఉచిత బియ్యంతో పాటు తెలంగాణ కోటా కింద కూడా ఉచిత బియ్యం పంపిణీ చేయనుంది. తెలుపు రేషన్ కార్డు ఉన్న ఒక్కో వినియోగదారునికి 15 కిలోల చొప్పున పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎలాంటి పరిమితులు లేకుండా కార్డుపై ఎందరుంటే అందరికి 15…
ఈటెల రాజేందర్ టిఆర్ఎస్ సభ్యత్వానికి శాసనసభకు రాజీనామా చేయడంతో తెలంగాణలో గత పక్షం రోజులుగా సాగుతున్న రాజకీయ చర్చలో ఘట్టం ముగిసింది, ఢల్లీిలో బిజెపి జాతీయ అద్యక్షుడు జెపి నడ్డా తదితరులను రాష్ట్ర అద్యక్షుడు బండిసంజయ్ సహా కలసి వచ్చిన తర్వాత ఇంకా ఆయన ఆ పార్టీలో చేరతారా లేదా అన్న మీమాంస అర్థం లేనిది. ఈ నెల తొమ్మిదవ తేదీన అంతకు ముందురోజో ఆయన చేరతారని బిజెపి ముఖ్యనేతలే చెబుతున్నారు. టిఆర్ఎస్లో తిరుగుబాటు తీసుకొచ్చి అసమ్మతివాదులను…
కరోనా సమయంలో అంబులెన్స్‌లు కూడా దొరకని పరిస్థితి ఏర్పడింది.. ఒకవేళ దొరికినా అడిగినంత సమర్పించుకోవాల్సిన పరిస్థితి.. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో సేవా భారతి ఆధ్వర్యంలో ఉచిత అంబులెన్స్ సేవలు ప్రారంభమయ్యాయి. ఉచిత అంబులెన్స్ సేవలు కావాలనుకునేవారు 040-48213100 నంబర్‌ను సంప్రదించాలని సేవాభారతి ప్రతినిధులు తెలిపారు. బర్కత్‌పురా కేశవనిలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో సేవాభారతి ప్రాంత అధ్యక్షుడు దుర్గారెడ్డి, కార్యదర్శి ప్రభల రామ్మూర్తి సహా ఇతర సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. మరోవైపు. సేవా భారతి…
లాక్డౌన్ చర్యలు క్రమంగా కరోనా కేసులు తగ్గేలా చేస్తున్నాయి.. తెలంగాణలో కోవిడ్ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి.. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,36,096 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… 2,175 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.. కరోనా బారినపడి మరో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో.. 3,821 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ప్రస్తుతం రాష్ట్రంలో 30,918 యాక్టివ్ కేసులు…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల… ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో.. తన అనుచరుడితో కేంద్ర ఎన్నికల కమిషన్‌లో రిజిస్ట్రర్ చేయించారు.. అభ్యంతరాలు ఉంటే తెలపాలంటూ ఓ ప్రకటన కూడా చేశారు.. మరోవైపు పార్టీ నిర్మాణంపై కూడా దృష్టి సారించారు.. తాజాగా, వైఎస్ షర్మిల ఆదేశానుసారం.. అడ్ హక్ అధికార ప్రతినిధులను నియమించినట్టు ఆమె కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది.. ఆ ప్రకటన ప్రకారం వైఎస్ఆర్టీపీ అధికార ప్రతినిధులుగా..…
ముఖ్యమంత్రి కేసీఆర్ హరిత తెలంగాణ స్వప్నం సాకారం కోసం.. రాష్ట్రంలో రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సంకల్పం గొప్పదని హరీశ్ రావు అన్నారు. తన పుట్టిన రోజు సందర్భంగా మంత్రి హరీశ్ రావు సిద్దిపేటలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రకృతి ప్రకోపిస్తే అల్లకల్లోలమే జరుగుతుందనీ, దాన్ని నివారించాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం మన అందరి బాధ్యత అని పేర్కొన్నారు.…
ఈటల రాజేందర్ విమర్శలు చేసినా, ఆరోపణలు గుప్పిస్తూ వచ్చినా.. ఇంత కాలం కాస్త ఓపిక పట్టిన టీఆర్ఎస్ నేతలు.. ఇప్పుడు ఈటల.. టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడంతో ఒక్కసారిగా ఆయనపై విమర్శల వర్షం కురిపిస్తున్నారు.. ఈటల ఎపిసోడ్‌పై స్పందించిన మంత్రి సత్యవతి రాథోడ్.. ఆత్మ గౌరవం కోసం కాదు… ఆత్మ రక్షణ కోసమే టీఆర్ఎస్ పార్టీకి ఈటల రాజీనామా చేశారని ఆరోపించారు.. స్వప్రయోజనాల కోసం తెలంగాణ ప్రయోజనాలకు అడ్డు పడే బీజేపీ కాళ్ల వద్ద ఆత్మగౌరవాన్ని ఈటెల…