తెలంగాణ బీజేపీ నాయకురాలు విజయశాంతి మరోసారి కేసీఆర్ ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ ఫైర్ అయ్యారు. తాజాగా సిరిసిల్ల జిల్లాలోని రుద్రంగిలో ఒక మహిళ తన భూమి సమస్య పరిష్కారం కోసం లంచం ఇవ్వలేక తహసీల్దార్ కార్యాలయం గుమ్మానికి తాళిబొట్టు వేలాడదీసిందని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. కాగా, మొన్న మెదక్ జిల్లా తాళ్లపల్లి తండాలో మరణించిన మాలోత్ బాబు అనే రైతుకు పట్టాదారు పాస్ బుక్ రాకపోవడంతో ఆ కుటుంబానికి రైతుబీమా పరిహారం, రైతుబంధు అందలేదని అన్నారు. ఈ నేపథ్యంలో శివ్వంపేటలోని తహసీల్ కార్యాలయం వద్ద తీవ్ర నిరసనలు వెల్లువెత్తాయని విజయశాంతి గుర్తుచేశారు. రెండు రోజుల పరిధిలో ఈ సంఘటనలు జరగడంతో రాములమ్మ రెవిన్యూ శాఖలో ఎలాంటి లోపాలు ఉన్నాయో అర్థంపడుతుందన్నారు.