పీసీసీలో పంచాయితీలు.. మహిళా కాంగ్రెస్లో సిగపట్లు. కాంగ్రెస్ కల్చర్లో ఇది కామన్. ప్రస్తుతం తెలంగాణలో పీసీసీ చీఫ్ పోస్ట్కంటే మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ పదవిపై ఎక్కువ రచ్చ అవుతోంది. కమిటీ కూర్పు కొలిక్కివస్తున్నా.. ఆపేవాళ్లు తెరవెనక చురుగ్గానే పావులు కదుపుతున్నారట. ధరలు పెరిగినా.. మహిళా కాంగ్రెస్ సైలెంట్! తెలంగాణ పీసీసీ చీఫ్ నియామకం జటిలంగా మారినట్టే.. మహిళా కాంగ్రెస్ నాయకుల మధ్య కూడా కయ్యాలు ఓ రేంజ్లో సాగుతున్నాయి. రెండేళ్ల క్రితమే ప్రస్తుత మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు…
రైతులకు పంట పెట్టుబడి సాయానికి ప్రైవేట్ వ్యక్తులను ఆశ్రయించి ఇబ్బందులు పడకుండా ఉండేందుకు రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చారు సీఎం కేసీఆర్.. ప్రతీ పంటకు రైతుల ఖాతాల్లో సొమ్మును జమ చేస్తున్నారు.. ఈ నెల 15వ తేదీ నుంచి క్రమంగా రైతుల ఖాతాల్లో సొమ్ము జమ చేస్తుండగా.. ఇవాళ్టి వరకు రాష్ట్రవ్యాప్తంగా 60.84 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7360.41 కోట్లు జమ చేసినట్టు ప్రభుత్వం ప్రకటించింది.. 147.21 లక్షల ఎకరాలకు రైతుబంధు నిధులు విడుదల అయ్యాయని.. మిగిలిపోయిన…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్, ఆర్డీఎస్ వల్ల తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పై కేంద్ర జల వనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ తో ఫోన్ లో మాట్లాడారు ముఖ్యమంత్రి కేసీఆర్. అయితే రెండు రాష్ట్రాల నీటి పంపకాల విషయంలో ఎవరికి అన్యాయం జరుగకుండా చూస్తానని చెప్పిన కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్… ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాయలసీమ ప్రాజెక్టు పనులను పరిశీలించి వారం రోజుల్లో తనకు నివేదిక ఇవ్వాలని కేఆర్ఎంబిని ఆదేశించారు కేంద్ర మంత్రి. ప్రస్తుత…
ఇరిగేషన్ ప్రాజెక్టుల వ్యవహారం ఏపీ, తెలంగాణ మంత్రుల మధ్య మాటల యుద్ధానికి దారితీస్తోంది.. తాజాగా, ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కన్నబాబు… తెలంగాణ మంత్రులు మాట్లాడుతున్న భాష సంస్కారానికి సంబంధించిన అంశమని వ్యాఖ్యానించిన ఆయన… రాయలసీమ జిల్లాలు తాగు నీటి, సాగు నీటికి ఇబ్బందులు పడుతున్న ప్రాంతమని… కానీ, హీరోయిజం కోసం, రాజకీయాల కోసం వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవుపలికారు.. మరోవైపు.. వ్యవసాయ ఉత్పత్తులను ఎప్పటికప్పుడు కొనుగోలు చేస్తున్నామని.. చంద్రబాబు, లోకేష్ జూమ్…
హుజూరాబాద్ లో అభివృద్ధి జరగలేదు అని బాల్క సుమన్ అన్నాడు. ఒక్క డబల్ బెడ్ రూమ్ కట్టలేదు అంటే దానికి కారణం ఈటల న ప్రభుత్వ పనితీరు కు నిదర్శనమా అని అన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. ఈటల రాజేందర్ సీఎం కి లేఖ రాసాడని ఫేక్ లెటర్ సృష్టించారు. గజ్వేల్,సిద్దిపేట, సిరిసిల్ల కు ఇచిన్నట్లు నిధులు ఇతర నియోజక వర్గాలకు ఇవ్వలేదని బాల్క సుమన్ ఒప్పుకున్నాడు.. బాల్క సుమన్ బానిస సుమన్.. ఆ కుటుంబానికి…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదంలో ఇరు రాష్ట్రాల మంత్రులు, నేతలు హాట్ కామెంట్లు చేసుకుంటున్నారు.. తాజాగా ఈ వ్యవహారంపై స్పందించిన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. తెలంగాణ సీఎం కేసీఆర్ మొదట్లో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు.. రాయలసీమ రైతులకు నీళ్ల కోసం సహకరిస్తా అని తెలిపారు.. కానీ, ఇప్పుడు జరుగుతున్న వ్యవహారం నాకు నచ్చలేదు అన్నారు.. అయితే, దాని గురించి మాట్లాడటం నాకు ఇష్టంలేదన్నారు పెద్దిరెడ్డి.. కానీ, మాకు ఎంత నీరు కావాలో అంతే తీసుకుంటామని స్పష్టం…
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జల జగడం మళ్లీ మొదలైంది… అయితే, ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టుల జీవో ఉపసంహరించుకుని, పనులు అపి వస్తే చర్చలకు సిద్ధం అని ప్రకటించారు తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి.. టీఆర్ఎస్ ఎల్పీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. సమైక్య రాష్ట్రంలో ఆనాడు పాలకులే తెలంగాణ ప్రాంతానికి కరువు సృష్టించారని ఫైర్ అయ్యారు.. ఏపీ అక్రమంగా కడుతున్న ప్రాజెక్టుల పై గ్రీన్ ట్రిబ్యునల్ లో స్టే ఇచ్చిన పనులు చేస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఏపీ…
టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉద్యమకారులు ఎవ్వరు లేరు. అక్కడ ఉన్న వాళ్లంతా తెలంగాణ ద్రోహులే అని బీజేపీ కోర్ కమిటీ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. హుజురాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించిన ఆయన మాట్లాడుతూ… సొంత పార్టీ నేతలే కొనుగోలు చేస్తున్న దుస్థితి ఇప్పుడు హుజురాబాద్ లో కొనసాగుతోంది. ఇరిగేషన్ ప్రాజెక్టుల ద్వారా వచ్చిన కమిషన్లతో ఉప ఎన్నికల్లో గెలవాలని కేసీఆర్ చూస్తున్నారు. నాగార్జునసాగర్, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఈటల రాజేందర్…
నాగోల్ లోని ఫతుల్లాగూడాలో 9 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన భవన నిర్మాణ వ్యర్దాల రీ-సైకలింగ్ ప్లాంట్ ను మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్తా ఉత్పత్తి అవుతుంది. అందుకే గతంలో ఉన్న 70 చెత్తా కలెక్షన్ ట్రాన్స్ఫర్ స్టేషన్ల ను 100 కు పెంచుతున్నాం. ఇంకా చెత్తను తరలించేందుకు 90 ఆధునిక వాహనాలు ఏర్పాటు చేశాం. మనం గ్రేటర్…
పేద వాళ్ల కోసం వైఎస్ ఆరోగ్య శ్రీ పథకం తెచ్చారు. కార్పొరేట్ ఆస్పత్రిలో ఉచిత వైద్యం అందించారు. అంతకముందు ఒక్క నాయకుడు కూడా ఇలా ఆలోచించలేదు. నా తండ్రిది పెద్ద మనసు అని వైస్ షర్మిల పేర్కొన్నారు. కుటుంబాలని నిలబెట్టిన పథకం అది. కానీ తెలంగాణ లో ఆరోగ్య శ్రీ అందడం లేదు. కరోనా రోగాన్ని ఆరోగ్య శ్రీ లో ఎందుకు చేర్చలేదు. పేద వాళ్ళ ను తెలంగాణ సర్కారు ఆదుకోవడం లేదు అని అన్నారు. ఫామ్…