కృష్ణా జల వివాదంలో తెలంగాణ నేతల వాదన రాజకీయ అవసరమేనని… ఉద్వేగాలను.. భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్ల తెలుగు రాష్ట్రాలకు దమ్మిడి ఉపయోగం ఉందా..?అని ప్రశ్నించారు మంత్రి పేర్ని నాని. ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువగా చెంచాడు నీటిని కూడా తీసుకోవడం లేదని.. కృష్ణా జల వివాదంపై ఆ రాష్ట్ర సీఎం కేసీఆర్ తో చర్చలు జరపడానికి ఏపీ సీఎం జగన్ సిద్దంగా ఉన్నారని స్పష్టం చేశారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి తెలుగు రాష్ట్రాలకు ఇరిగేషన్ పరంగా…
తెలంగాణలో బోనాల ఉత్సవాలను ప్రతి ఏడాడి ఏరువాక తరువాత అగరంగవైభవంగా జరుపుతుంటారు. వాతావరణంలో మార్పులు వచ్చిన తరువాత, ఎలాంటి రోగాలు, మహమ్మారులు రాకుండా కాపాడాలని వేడుకుంటూ బోనాల పండుగను నిర్వహిస్తుంటారు. కరోనా కాలంలో బోనాలను ఎలా నిర్వహించాలి అనే అంశంపై ఈరోజు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమీక్షను నిర్వహించారు. బోనాల పండుగను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. Read: 500 చిత్రాల్లో నటించిన అనుపమ్ ఖేర్ అమాయకుడి చేతిలో అడ్డంగా బుక్కయ్యాడు! కోవిడ్ మార్గదర్శకాలు పాటిస్తూ బోనాలను…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత భట్టి విక్రమార్క ఫైర్ అయ్యారు. తెలంగాణ తెచ్చుకున్నది నీళ్ళు..నిధులు కోసమేనని… కృష్ణ, గోదావరి నీళ్ళు వాడుకోవాలి అనే ఉద్యమాలు చేశామని తెలిపారు. పోతిరెడ్డి పాడు పాపం… కెసిఆర్ దేనని అని మండిపడ్డారు. Ntr ప్రారంభించినప్పుడు కెసిఆర్ మంత్రి అని… అప్పుడు కెసిఆర్ ఏం చేశాడని ప్రశ్నించారు. రెండు నదులపై కెసిఆర్ చేపట్టిన ప్రాజెక్టులతో ప్రయోజనమే లేదని… కృష్ణా నదిపై సంగమేశ్వర ప్రాజెక్టు ap కడుతుందన్నారు. read more…
తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నాయని… ఈ రోజు ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ నుండి దక్షిణ ఒడిస్సా వరకు సముద్ర మట్టానికి 0.9 కిమి వరకు వ్యాపించి ఉందని తెలి పింది వాతావరణ శాఖ. రాగల 3 రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు… ఈ రోజు రేపు కొన్ని ప్రదేశాలలో, ఎల్లుండి చాలా ప్రదేశాలలో వచ్చే…
బీజేపీలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ చేరిక సందర్భంగా నేతల మధ్య పొరపచ్చాలు వచ్చాయా? ఆయన చేరికను తమ ఖాతాలో వేసుకునేందుకు కొందరు ప్రయత్నించారా? ఆ ప్రచారానికి చెక్ పెట్టేలా.. హుజురాబాద్‌లో ఇంఛార్జ్‌ల నియామకం జరిగిందా? బీజేపీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఎవరు ఎవరికి చెక్ పెట్టారు? ఈటల చేరిక సందర్భంగా జరిగిన పరిణామాలపై చర్చ! తెలంగాణ బీజేపీలో బయటకు అంతా సవ్యంగా ఉన్నట్టు కనిపిస్తున్నా.. అంతర్గతంగా ఆధిపత్య పోరు నడుస్తోందట. సీనియర్ల మధ్య పడటం…
తెలంగాణలో పార్టీ ఏర్పాటు దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు వైఎస్ షర్మిల.. ఇప్పటికే వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘంలో కూడా రిజిస్ట్రర్ చేశారు.. వచ్చే నెలలో పార్టీ జెండా, అజెండా ప్రకటించనున్నారు. వచ్చే నెలలోనే పార్టీ ఏర్పాటు చేయనున్నారు షర్మిల. అయితే.. ప్రజలకు దగ్గర కావాలనే నేపథ్యంలో వరుసగా జిల్లాల పర్యటనలు షర్మిల చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే ఇవాళ తెలంగాణ ఐటీ శాఖ మంత్రి.. కేటీఆర్ ఇలాకా అయిన రాజన్న సిరిసిల్లాలో…
ఇవాళ్టి నుండి టీచర్లు, సిబ్బంది స్కూళ్లకు రావాలని తెలంగాణ విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. టీచర్లతో సహా… జూనియర్ కళాశాలలకు లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ రావాలని కూడా పేర్కొంది. 3 నెలల తర్వాత పాఠశాలలకు టీచర్లు..కాలేజీలకు లెక్చరర్ లు తిరిని వస్తున్నారు. జులై ఒకటి నుండి ఆన్లైన్/ ఆఫ్ లైన్ తరగతులు ప్రారంభం అవుతుండడంతో ఏర్పాట్లు చేయాలని విద్యా శాఖ ఆదేశాలు జారీ చేసింది. read more :వైఎస్ వివేకా హత్య కేసు : ఇవాళ…
సెకండ్ వేవ్‌లో కరోనా కేసులు పెరగడంతో నెలక్రితం లాక్డౌన్ విధించించింది తెలంగాణ ప్రభుత్వం. నిత్యావసర సరుకుల కోసం కొంత సమయం మినహాయింపు తప్పా.. విద్యాసంస్థలు పూర్తిగా మూతపడ్డాయి. ఆ తరువాత దశల వారీగా సడలింపులు ఇచ్చింది. తాజాగా కరోనా కేసులు రోజు రోజుకు తగ్గుతుండడంతో.. లాక్డౌన్ ఎత్తేసింది ప్రభుత్వం. ఆల్ ఓపెన్ అంటూనే.. జులై ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలను తిరిగి ప్రారంభించాలని నిర్ణయించింది. ఇందు కోసం విధి విధానాలను కూడా రూపొందించాలని విద్యాశాఖను ఆదేశించింది.…
అన్ని రంగాల్లోనూ మహిళ నాయకత్వాన్ని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్… మహిళా సాధికారత, సమానత్వం సాధించాలంటే, భిన్నత్వాన్ని, సమ్మిళిత సమాజాన్ని సాధించాలంటే మహిళా నాయకత్వాన్ని అన్ని దశలలోనూ పెంపొందించాల్సిన ఆవశ్యకత ఉందన్నారు.. హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఎంటర్ప్రైజెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉమెన్ లీడర్స్ ఫోరమ్‌ను వర్చువల్ పద్ధతిలో ప్రారంభించిన గవర్నర్.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేట్ రంగంలో, అలాగే వివిధ వ్యవస్థలలో సీనియర్ పొజిషన్లో మహిళా నాయకత్వం చాలా తక్కువ ఉందని…
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి వచ్చింది.. ఈ సారి ఎలక్ర్టానిక్ వాహన రంగంలో రూ. 2,100 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధమైంది ట్రైటాన్ ఈవీ.. జహీరాబాద్ నిమ్జ్‌లో యూనిట్ ఏర్పాటు చేయనుంది ట్రైటాన్ ఈవీ.. దీంతో.. దాదాపు 25 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని అంచనా వేస్తున్నారు.. మొదటి ఐదేళ్లలోనే సుమారు 50 వేల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయడమే టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ట్రైటాన్ ఈవీ సంస్థకు ధన్యవాదాలు తెలిపారు రాష్ర్ట…