ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఇప్పుడు కృష్ణానదిపై నిర్మిస్తోన్న ప్రాజెక్టులు చిచ్చుపెడుతున్నాయి.. ఓవైపు ఫిర్యాదులు చేస్తూనే.. మరోవైపు ఇరు రాష్ట్రాల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది.. జలవివాదంలో ఆంధ్ర నేతలపై తెలంగాణ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డిపై విమర్శలు రాగా.. తాజాగా.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్‌రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. వైఎస్సార్ తెలంగాణ ప్రాంతానికి రాక్షసుడు అంటూ విమర్శించారు. ఇక, తెలంగాణ సీఎం కేసీఆర్ స్నేహ హస్తం ఇస్తే..…
నన్ను ఓడించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.. కానీ, మీకు కూడా గుణపాఠం చెబుతా అంటూ టీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్… ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరిన ఆయన.. ఆ తర్వాత తన నియోజకవర్గం హుజురాబాద్‌లో పర్యటిస్తూ.. రానున్న ఉప ఎన్నికలపై ఫోకస్ పెట్టారు.. వరుసగా ఆరు సార్లు విజయం సాధించా.. ఈసారి హుజురాబాద్‌లో కాషాయ జెండా ఎగురవేస్తానంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు.. మా బీజేపీ నేతలు వచ్చి…
రాయలసీమ ఎత్తిపోతలకు ఎలాంటి అనుమతుల్లేవు అని స్పష్టం చేశారు తెలంగాణ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి… కృష్ణా నది యాజమాన్య బోర్డు ఆదేశాలు, ఏపీ నేతల విమర్శలపై హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఎలాంటి అనుమతులు లేకున్నా.. ఏపీ ప్రభుత్వం కృష్ణ నది నీటిని తరలించే ప్రాజెక్టు పనులు చేస్తోందని విమర్శించారు.. అక్రమంగా కృష్ణ నీటిని తరలించే పనిని ఏపీ సర్కారు మొదలుపెట్టిందని ఫైర్ అయిన ఆయన.. అక్రమ నీటి తరలింపుతోపాలమూరు, రంగారెడ్డి, మెదక్ రైతుల నోట్లో మట్టి…
ఆయన వేదిక ఎక్కితే పాట పాడకుండా ఉండలేరు. అప్పటికప్పుడు పదాలతో పాట కట్టేస్తారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య పాడిన ఒకేఒక పాటతో సైలెంట్ అయిపోయారు. అదే ఆయన చివరి పాట. మీటింగ్‌కు వస్తే పాటల్లేవ్.. మాటల్లేవ్. ఎవరా వ్యక్తి? పాటల్లేవు.. పొడి పొడి మాటలే! తన పాటలతో తెలంగాణ ఉద్యమంలో గుర్తింపు తెచ్చుకుని.. ఎమ్మెల్యే అయిన వ్యక్తి రసమయి బాలకిషన్. ఎమ్మెల్యే అయినా పాటను మర్చిపోలేదు. సభలు, సమావేశాల్లో రసమయి ఉంటే పాట కూడా ఉంటుంది.…
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చిన తర్వాత ఏది రియలో.. ఏది వైరలో తెలియని పరిస్థితి… కొందరు కేటుగాళ్లు ఇష్టంవచ్చినట్టుగా తప్పుడు ప్రచారానికి తెరలేపుతున్నారు.. అది తెలియకకొందరు.. తెలిసి మరికొందరు షేర్ చేస్తూ.. అందులో భాగస్వాములు అవుతున్నారు.. అయితే, తెలంగాణ మంత్రి కేటీఆర్, వైఎస్ షర్మిల ఫొటోలతో.. హుజురాబాద్ ఎన్నికలకు సంబంధించిన ఓ తప్పుడు వార్త వైరల్ చేశారు కేటుగాళ్లు.. దీనిపై వైఎస్ షర్మిల అనుచరులు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.. బుధవారం రోజు సోషల్ మీడియాలో మేం పెట్టబోయే…
ఎర్రగడ్డ ఛాతీ ఆస్పత్రిలో 62 ఎకరాల్లో 325 పడకల ఆస్పత్రి కొనసాగుతుంది అని తెలంగాణ రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. 1200 బెడ్స్ తో వెయ్యి కోట్లతో ఎర్రగడ్డలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం జరుగుతుంది. హైదరాబాద్ మెడికల్ హబ్ గా ఉంది. 5 వేల కోట్లతో 4 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం జరుగుతుంది. సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి నాలుగు గేట్లు ఉండేలా… పార్కింగ్ ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఎమ్మెల్యే మాగంటి.…
ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో క్రింది స్థాయిలో గాలులు, పశ్చిమ, వాయువ్య దిశల నుండి వీస్తున్నవి. ఈ రోజు ఉపరితల ద్రోణి ఝార్ఖండ్ నుండి ఒడిస్సా మీదగా దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ వరకు సముద్ర మట్టానికి 1.5కిమి వరకు వ్యాపించి ఉన్నది. రాగల 3రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని ప్రదేశములలో వచ్చే అవకాశములు ఉన్నాయి. ఈరోజు భారీ వర్షాలు ఉత్తర, తూర్పు, మధ్య తెలంగాణా జిల్లాలో ఒకటి, రెండు ప్రదేశములలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.…
రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలని ఏపీకి కేఆర్ఎంబీ ఆదేశాలు జారీ చేసింది. ఏపీ ఇరిగేషన్ సెక్రటరీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. అందులో డీపీఆర్ సమర్పించి, ఆమోదం పొందే వరకు రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దని ఏపీకి స్పష్టం చేసిన కృష్ణా బోర్డు… రాయలసీమ ఎత్తిపోతల పనులు ఆపాలంటూ ఎన్జీటీ ఇచ్చిన ఆదేశాలనూ లేఖలో ప్రస్తావించింది కేఆర్ఎంబీ. తెలంగాణ ప్రభుత్వం ఫిర్యాదు చేసిందన్న అంశాన్ని లేఖలో పేర్కొన్న కేఆర్ఎంబీ… ప్రాజెక్టు సైటులో నిపుణుల బృందం పర్యటనకు ఏపీ సహకరించడం…
శక్తి వంతమైన భారతదేశం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకోవాలని అన్నారు మోడీ. స్వంతంగా మెజారిటీ ఉన్నా అందరినీ కలుపుకుని పోయి అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు అని బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ప్రతి భారతీయుడు తలెత్తుకుని నేను భారతీయుడిని అని చెప్పుకోవాలి. 2014 తర్వాత దేశం అభివృద్ధి చెందుతుంది. ధనిక రాష్ట్రం అయిన తెలంగాణను అప్పుల పాలు చేసారు కేసీఆర్. బీజేపీకి భయపడి గడీల నుంచి ఇప్పుడు బయటకు వస్తున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఇప్పటివరకు కేసీఆర్…