తెలంగాణ పీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని అధిష్టానం ప్రకటించింది. అయితే ప్రకటన వచ్చిన కాసేపటికే మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి పార్టీకి రాజీనామా చేస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏఐసీసీ సభ్యత్వానికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి శనివారం రాత్రి లేఖ పంపారు.ఇక టీపీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టనున్న రేవంత్ రెడ్డి.. పార్టీలో చిన్ని చిన్న విభేదాలు సహజమేనని.. అందరినీ కలుపుకొని ముందుకు సాగుతానని…
హైదరాబాద్ లో ఇవాళ వేకువజాము నుంచి వర్షం పడుతోంది. సరిగ్గా ఉదయం 3 గంటలకు ప్రారంభమైన ఈ వర్షం… ఇంకా కొనసాగుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, దిల్ సుఖ్‌నగర్, కోటి, నాంపల్లి, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్‌పేట్, ఎస్సార్ నగర్, కూకట్ పల్లి, కొండాపూర్, నారాయణగూడ, హయత్ నగర్ తదితర ప్రాంతాల్లో ఇవాళ తెల్లవారు జాము నుంచి వర్షం కురుస్తోంది. ఉదయం నుంచి ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. read also : బీజేపీ దూకుడు…త్వరలో…
ఈటల రాజేందర్ రాకతో మంచి ఊపు మీద ఉన్న బీజేపీ పార్టీ… మరింత దూకుడుగా ముందుకు వెళ్లేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగానే ఈ నెల 30 న బీజేపీ రాష్ట్ర వర్గ సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది రాష్ట్ర కార్యవర్గం. ఈ సమావేశంలో హుజురాబాద్ ఉప ఎన్నిక, బండి సంజయ్ జిల్లాల పర్యటనతో పాటు తాజా రాజకీయ అంశాలపై చర్చ జరుగనుంది. జూలై 1 నుంచి 8 వరకు బండి సంజయ్ జిల్లాల పర్యటన చేయనున్నారు.…
టైమ్‌కు ప్రభుత్వ ఆఫీసుల తలుపులు తెరుచుకుంటాయి కానీ.. కుర్చీలలో సిబ్బంది ఉండరు. కొందరైతే ఎప్పుడొస్తారో.. ఎప్పుడెళ్లిపోతారో కూడా చెప్పలేం. ఇంకొందరు పైరవీలతో పనికానిచ్చేస్తుంటారు. ఈ తరహా ఉద్యోగులకు చుక్కలు చూపిస్తున్నారట ఆ జిల్లాకు కొత్తగా వచ్చిన కలెక్టర్. దాంతో టాప్ టు బోటమ్ ఒక్కటే హడావిడి. ఎవరిపై ఎప్పుడు వేటు పడుతుందో తెలియక టెన్షన్ పడుతున్నారట. విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తే వేటు! పమేలా సత్పతి. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా ఈ మధ్యే బాధ్యతలు చేపట్టారు. వరంగల్…
అడ్డగూడురు పోలీస్‌స్టేషన్ లాకప్ డెత్ కేసులో మరో అధికారి పై చర్యలు తీసుకున్నారు సీపీ. చౌటుప్పల్ ఏసీపీ సత్తయ్యను రాచకొండ పోలీస్ కమీషనరేట్‌కు ఆటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసారు సీపీ. భువనగిరి ట్రాఫిక్ ఏసీపీ శంకర్‌కు అదనపు భాద్యతలు అప్పగించారు కమీషనర్ మహేష్ భగవత్. ఇప్పటికే ఎస్సై మహేష్ ఇద్దరు కానిస్టేబుల్స్ ను సస్పెండ్ చేసిన సీపీ… ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం నలుగు అధికారుల మీద చర్యలు తీసుకున్నారు. అయితే ఈ లాకప్ డెత్…
టీచర్ల ప్రమోషన్స్, బదిలీ లు, పాఠశాలల పునః ప్రారంభం పై సీఎంతో మాట్లాడాము అని తెలిపారు పిఆర్టియూ నేతలు శ్రీపాల్ రెడ్డి, కమలాకర్ రావు. స్కూల్స్ ,జూనియర్ కళాశాలల ప్రత్యక్ష తరగతులు తాత్కాలిక వాయిదాకు సీఎం హామీ ఇచ్చారు అన్నారు. గతంలో మాదిరిగానే స్కూల్స్ జూనియర్ కళాశాలల్లో ఆన్లైన్ తరగతులు జరుగుతాయని… పరిస్థితిలు చక్కబట్టాకే ప్రత్యక్ష తరగతులు ఉంటాయని తెలిపారు. ఇక 50 శాతం టీచర్ల తోనే పాఠశాలలు ప్రారంభమవుతాయని… కొత్త జిల్లాల ప్రకారమే టీచర్ల బదిలీలు,…
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక దళితుల మీద దాడులు, లాకప్ డెత్ లు పెరిగాయి అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. పోలీస్ ల దెబ్బలకు తట్టుకోలేక మరియమ్మ మరణించింది. దీని పై మేము గవర్నర్ ను కలిసి వస్తుంటే సీఎం కార్యాలయం నుంచి మాకు ఫోన్ వచ్చింది. దళిత ఎంపవర్ మెంట్ సమావేశానికి రావాలని ఆహ్వానించారు. దళితుల మీద దాడులు చేస్తూ సమావేశానికి రమ్మంటే ఎందుకు రావాలని నిలదీశాను.. దాంతో సీఎం మమ్మల్ని కలవడానికి అవకాశం…
తెలంగాణలో కరోనా కేసులు మళ్ళీ రోజు రోజుకు తగ్గుతున్నాయి. తాజాగా ప్రభుత్వం కరోనా బులెటిన్ ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం రాష్ట్రంలో కొత్తగా 1,028 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,19,865 కి చేరింది. ఇందులో 6,01,184 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 15,054 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక రాష్ట్రంలో కరోనాతో 9 మంది మృతి చెందారు. దీంతో రాష్ట్రంలో…
గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు భేటీ అయ్యారు. దళిత అవేదన దీక్ష తర్వాత కలిసిన కాంగ్రెస్ నేతలు.. నిన్న సీఎం తో పార్టీ ఎమ్మెల్యేల సమావేశం అవ్వడం పై మాట్లాడుతూ… దీని పై సోషల్ మీడియా లో తప్పుగా ట్రోల్ అవుతుందని చెప్పారు. సోషల్ మీడియా ప్రచారం పై జగ్గారెడ్డి, శ్రీధర్ బాబు అభ్యంతరం వ్యక్తం చేసారు. సమస్యలు సీఎం కి కాకుంటే ఇంకా ఎవరికి చెప్తాం అని అన్నారు. మేము కలిసింది…
మరియమ్మ లాకప్ డెత్ చాలా దురదృష్టకరం అని అన్నారు ఏఐసీసీ ఎస్సీ విభాగం చైర్మన్, మహారాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి నితిన్ రావత్. మరియమ్మ అనే మహిళను అరెస్ట్ చేశారు. అప్పుడు కనీసం మహిళ పోలీసులు లేరు సిగ్గుచేటు. లాకప్ డెత్ చేసిన వాళ్ళను సస్పెండ్ చేశారు. మరి మరియమ్మ బతికి వస్తుందా అని అడిగారు. రాబోయే ఎన్నికలలో దళితులు టీఆర్ఎస్ కు ఓట్లు వేయవద్దు. ఈ ముఖ్యమంత్రిని గద్దె దింపాలి. మరియమ్మ సంఘటన చాలా దుఃఖం…