కొత్త పీసీసీ అధ్యక్షుడి కోసం సుదీర్ఘ కసరత్తు చేసిన కాంగ్రెస్ పార్టీ అధిష్టానం చివరకు రేవంత్ రెడ్డిని కొత్త చీఫ్‌గా నియమించింది… అయితే, ఆది నుంచి పీసీసీ అధ్యక్ష పదవి కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తూ వచ్చిన.. పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి నిరాశే ఎదురైంది. దీంతో.. పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేశారు కోమటిరెడ్డి… పీసీసీ చీఫ్‌పై చర్చ జరిగిన ప్రతీసారి ఢిల్లీ వెళ్లి మరీ మంతనాలు జరిపిన కోమటిరెడ్డికి పదవి మాత్రం…
పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ గా తనను నియమించినందుకు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారికి ధన్యవాదాలు తెలిపారు అంజన్ కుమార్ యాదవ్. రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతంకి కృషి చేస్తా అన్నారు. బడుగు వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చారు. సామాన్య కార్యకర్త నుండి ఈ స్థాయి కి వచ్చా. 2004 నుండి… పార్టీ లో కీలకంగా పని చేశా . తెలంగాణ కోసం కొట్లడింది మేమే. కాబట్టి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ కి వచ్చే ఎన్నికల్లో అధికారం ఇవ్వండి అర…
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా…
ఈ రోజు ఉపరితల ఆవర్తనం ఆంధ్ర ప్రదేశ్ తీర ప్రాంతం & పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టాము నుండి 4.5 కిమి వరకు వ్యాపించి ఉన్నది. మరొక ఆవర్తనం ఉత్తర ఛత్తీస్ గడ్ &పరిసర ప్రాంతాలలో సముద్ర మట్టానికి 3.1 కిమీ వరకు వ్యాపించి ఉన్నది. ఈ రోజు, రేపు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు చాలా ప్రదేశములలో మరియు ఎల్లుండి కొన్ని ప్రదేశాలలో వచ్చే అవకాశములు ఉన్నాయి. వాతావరణ హెచ్చరికలు:- ఈ రోజు భారీ వర్షములు…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎవరిని పొమ్మనకుండానే పోయేలా చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్‌పై ఫైర్ అయ్యారు స్వామిగౌడ్… మాజీమంత్రి ఏ. చంద్రశేఖర్ నివాసంలో కొందరు తెలంగాణ ఉద్యమకారుల సమావేశం నిర్వహించారు.. స్వామిగౌడ్, యెన్నం శ్రీనివాసరెడ్డి, గాదె ఇన్నయ్య, బెల్లయ్య నాయక్, కపిలవాయి దిలీప్ కుమార్, బండి సదానంద్, రాములు నాయక్, రాణి రుద్రమ్మ తదితరులు హాజరయ్యారు.. ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం ఏ ఉద్దేశ్యంతో సాధించుకున్నామో ఆ విధంగా కలలు సహకారం కావడంలేదన్నారు.. ఉద్యమంలో…
గోరేటి వెంకన్న రాసిన గల్లీ చిన్నది పాటను ఎన్నో సందర్భాల్లో గుర్తుచూస్తేనే ఉంటారు తెలంగాణ సీఎం కేసీఆర్… వెంకన్న ఆ పాటలోని దళిత బస్తీల్లో కొరవడని సౌకర్యాలను వివరించారు.. మరోసారి ఆ పాటను గుర్తుచేశారు.. సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకం విధివిధానాల రూపకల్పనపై సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష భేటీ జరిగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. భూమి ఉత్పత్తి సాధనంగా ఇన్నాళ్లూ జీవనోపాధి సాగింది.. మారిన పరిస్థితుల్లో పారిశ్రామిక, సాంకేతిక తదితర రంగాల్లో…
సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి…
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది… సీఎం దళిత్ ఎంపవర్మెంట్ పథకంపై ఈ సమావేశంలో చర్చిస్తున్నారు.. ఈ సమావేశానికి అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు, సీపీఐ, సీపీఐ(ఎం)ల నుంచి సీనియర్ దళిత నేతలు, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులకు ఆహ్వానాలు వెళ్లగా.. ఈ సమావేశానిక టీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం,…
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మరోసారి బీజేపీ నేత విజయశాంతి పైర్ అయ్యారు. దళిత సాధికారత పేరుతో కొత్త నాటకాలకు తెర తీస్తున్నారని విజయశాంతి మండిపడ్డారు. దళిత మహిళ మరియమ్మ లాకప్ డెత్ ఘటనపై వెల్లువెత్తిన నిరసనలతో సీఎం కేసీఆర్ గారికి ఒక్కసారిగా దళిత సాధికారత గుర్తుకొచ్చిందా? అని నిలదీశారు. ఈ ఘటనపై పెల్లుబికుతున్న ఆగ్రహావేశాలను చల్లార్చడం కోసం అన్నట్టుగా రూ.1000 కోట్ల నిధులతో దళిత సామాజిక వర్గానికి ఏదేదో చేసేద్దామన్న ఆలోచనల్లో ఆయన ఉన్నట్టు కనిపిస్తోందని విమర్శించారు.…
నల్గొండ జిల్లా:-తెలంగాణ పీసీసీ నియామకంపై గుత్తా సుఖేందర్ రెడ్డి స్పందించారు. పీసీసీగా ఉన్న ఉత్తమ్ కుమార్ పోయి… ఉత్తర కుమారుడు వచ్చిండని… ఎవరు వచ్చినా.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది లేదు.. చచ్చేది లేదని సెటైర్ వేశారు. వచ్చే రెండేళ్లు.. కాంగ్రెస్ అంతర్గత సమస్యలు పరిష్కరించడానికే సరిపోదని ఎద్దేవా చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదానికి కేంద్ర ప్రభుత్వ వైఖరే కారణమని… సమైక్య ఆంధ్ర నుంచే తెలంగాణకు నదీ జలాల విషయంలో అన్యాయం జరుగుతుందన్నారు. పోతిరెడ్డిపాడు…