కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని…అసలు హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా ? అని ప్రశ్నించారు. ”నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల భూమి వస్తుందా? ఇవన్నీ చేస్తామని చెబితే అప్పుడు మేం కూడా పోటీచేస్తాం. హుజూరాబాద్ ఉప ఎన్నిక పగ, ప్రతీకారం కోసం వచ్చిన ఎన్నిక మాత్రమే” అని షర్మిల పేర్కొన్నారు.