ప్రజల కష్టాలు, ప్రాంతం సమస్యల కంటే వారికి సొంత వ్యాపారాలు.. ఆస్తులే ఎక్కువ అయ్యాయా? తీవ్ర నష్టం చేకూర్చే చర్యలు జరుగుతోన్నా.. అధినేతను విమర్శిస్తున్నా నోరెత్తకపోవడానికి కారణం అదేనా? సీమకు ప్రాణాధారమైన రాయలసీమ లిఫ్ట్.. RDS కుడి కాల్వలకు తెలంగాణ అడ్డుపడినా కర్నూలు నేతలు స్పందించకపోవడానికి అవే కారణాలా? జల జగడంపై పెదవి విప్పని కర్నూలు వైసీపీ నేతలు! రాయలసీమ ఎత్తిపోతల పథకం, RDS కుడి కాలువ పనులు తెలుగు రాష్ట్రాల మధ్య నిప్పుల వర్షం కురిపిస్తున్నాయి.…
అక్రమార్కుల భరతం పడతామని కొరడా బయటకు తీశారు. దూకుడుగా వెళ్లారు కూడా. ఇంతలో ఏమైందో ఏమో ఉలుకు లేదు పలుకు లేదు. ఎక్కడివారు అక్కడే గప్‌చుప్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆసక్తికర చర్చకు దారితీస్తోన్న ఆ సంగతేంటో ఈ స్టోరీలో చూద్దాం. నాడు గంభీరమైన ప్రకటనలు.. నేడు పత్తా లేరు! తప్పు చేస్తే తాట తీస్తాం. ఎంతటి వారైనా వదిలేదు లేదు. కటకటాల వెనక్కి నెట్టడం ఖాయం. కరోనా సమయంలో నిజమాబాద్ జిల్లా ఉన్నతాధికారులు గంభీరంగా పలికిన…
మాజీ మంత్రి ఎల్.రమణ శుక్రవారం తెలంగాణ తెలుగు దేశం పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరుతున్నట్లుగా రమణ ప్రకటించారు. దీంతో టీ-టీడీపీ నూతన అధ్యక్షుడి ఎంపిక అనివార్యమైంది. కాగా నేడు ఏపీ మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీ పార్టీ తెలంగాణ శాఖకు చెందిన కోర్ కమిటీ సభ్యులు, పార్లమెంటరీ పార్టీ ఇన్ చార్జీలతో ప్రత్యేకంగా భేటీ అయిన చంద్రబాబు.. టీటీడీపీకి ఎవరిని అధ్యక్షుడిగా…
తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల రగడ కలకలం రేపుతోంది. కరోనా పీక్‌లో ఉన్న సమయంలో తమ పనితీరుతో మంచిపేరు తెచ్చుకున్న వారికి ఆ నిర్ణయం మింగుడు పడటం లేదట. కానీ.. అసలు విషయం తెలుసుకుని ఎక్కడివారు అక్కడే గప్‌చుప్ అయ్యారట. అదే ఇప్పుడు ఆ శాఖలో హాట్ టాపిక్‌గా మారింది. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. డిప్యుటేషన్ల రద్దుతో వైద్యశాఖలో కలకలం వైద్యశాఖకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఇటీవల కీలక నిర్ణయం తీసుకుంది. డైరెక్టర్ ఆఫ్…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుతుంది వస్తున్న విషయం తెలిసిందే. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం గత 24 గంటల్లో 1,00,632 మంది సాంపిల్స్ పరీక్షించగా… కొత్తగా 704 మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది.. మరో ఐదుగురు కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇదే సమయంలో 917 మంది కోవిడ్ బాధితులు కోలుకున్నారు.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,218కు చేరగా.. ఇప్పటి వరకు 6,16,769 మంది పూర్తిస్థాయిలో కోలుకున్నారు.. ఇక,…
హైదరాబాదులో మరోసారి చెడ్డీ గ్యాంగ్ హల్ చల్ చేసింది. నగర శివారు ప్రాంతాల్లో చెడ్డి గ్యాంగ్ ఆనవాళ్లు కనిపించాయి. రాచకొండ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ ముఠా మరొకసారి కనబడింది. కుషాయిగూడ పరిధిలో చెడ్డి గ్యాంగ్ రెక్కీ చేసినట్లు తెలుస్తుంది. పలు కాలనీలలో చెడ్డీ గ్యాంగ్ తిరుగుతున్న దృశ్యాలు సిసి కెమెరాలో రికార్డు అయ్యాయి. చెడ్డి గ్యాంగ్ కదలికల పై జంటనగరాల్లో ప్రత్యేక దృష్టి పెట్టాయి పోలీసులు. నగరంలో మరొకసారి పాగా వేసిన చెడ్డీ గ్యాంగ్ ను పట్టుకోవడానికి…
వివిధ శాఖల్లో లక్ష 96 వేల ఉద్యోగాలు ఉన్నాయని పీఆర్సీ కమిషన్ రిపోర్ట్ లో పేర్కొంది. కానీ 50 వేల పోస్ట్ లు భర్తీ చేస్తామనడం కంటితుడుపు చర్య మాత్రమే అని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు NVSS ప్రభాకర్ అన్నారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వేయాల్సిందే… తొలగించిన స్టాఫ్ నర్సు లను వెంటనే తీసుకోవాలి అని తెలిపారు. ఇక ఏడు ఏళ్ళల్లో 7 చుక్కల నీళ్లు అయినా అదనంగా ఈ రాష్ట్ర వాటా…
తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు నిన్న ఓ మహిళా ఎంపీడీవో విషయంలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మరువక ముందే.. నేడు మరో మంత్రి గంగుల కమలాకర్ పొరపాటున చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కరీంనగర్ రూరల్ మండలం ఇరుకుల్ల గ్రామంలో హారితహారం కార్యక్రమంలో మంత్రి గంగుల కమలాకర్ పాల్గొని మొక్కలు నాటారు. మహిళా సంఘం, గౌడ సంఘాల కోసం నిర్మించిన కొత్త భవనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లెప్రగతి సభలో ప్రసంగిస్తూ.. ప్రభుత్వం అందిస్తున్న…
హుజూరాబాద్ నియోజకవర్గం ప్రజలు ధర్మం వైపు ఉన్నారు. నా వైపు ఉన్నారు అని ఈటల రాజేందర్ అన్నారు. తాజాగా ఆయన మాట్లాడుతూ… హుజూరాబాద్ నుజిల్లా చేయాలి, వావిలాల,చల్లుర్ లను మండలం వెంటనే చేయాలి అని తెలిపారు. స్పీకర్ కనీసం నా రాజీనామా తీసుకోవడానికి కూడా ముందుకు రాకపోగా, రాజీనామా ఇచ్చిన అరగంటలోనే ఆమోదించి గెజిట్ విడుదల చేసిన చరిత్ర దేశంలో ఇదే కావొచ్చు. అంటే అంత తొందరగా నన్ను ఓడించాలని ఉబలాటపడుతున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ కూడా ఖాళీ…
వైఎస్ షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు తెలంగాణ మంత్రి హరీష్‌రావు.. తాజాగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించిన ఆమె.. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకురావడమే లక్ష్యం అని ప్రకటించారు.. అయితే, ఇప్పుడు కొత్త కొత్త పార్టీలు వచ్చాయన్నారు హరీష్‌రావు.. గతంలో రాజ శేఖర్ రెడ్డి.. తెలంగాణ సిగరెట్టా..? బీడీనా అని అసెంబ్లీలో అడిగారని.. మా నీళ్లు, నిధులు ఆంధ్రకు తరలిస్తున్నందుకు మీకు మద్దతు ఇవ్వాలా? అని ప్రశ్నించారు.. తెలంగాణ ప్రజల హృదయాల్లో వైఎస్…