తెలంగాణ రాజకీయాలలో ఒక్కసారిగా నాయకత్వాలు, పార్టీల పాత్రలూ ప్రవేశ నిష్క్రమణలూ జరగిపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. వీటి ప్రభావం ఎలా వుంటుందనేదానిపై ఎవరి అంచనాలు వారికి వుంటాయి గాని మార్పు తథ్యం. పైగా ఇవన్నీ ఒకటి రెండు రోజుల తేడాతో జరగడం మరీ విశేషం. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పీసీసీ పదవి దక్కించుకున్న రేవంత్ రెడ్డి తనదైన శైలిలో అట్టహాసంగా బాధ్యతలు స్వీకరించారు. చాలా కాలం తర్వాత గాంధీ భవన్ కళకళలాడింది. ఆ మరుసటి రోజునే వైఎస్ జయంతి…
ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. మొదటి దశలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పారు. నూతన జోనల్ విధానానికి అడ్డంకులు తొలగడంతో ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. ఇక ప్రమోషన్ల ద్వారా ఏర్పడే ఖాళీలను గుర్తించి రెండో దశలో భర్తీ చేయాలని సూచించారు సీఎం కేసీఆర్. దీనికి సంబంధించిన పూర్తి నివేదికను సిద్ధం చేసి కేబినెట్ సమావేశానికి తీసుకురావాలని చెప్పారు. రాష్ట్రంలో నూతన జోన్లను ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న…
కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించింది… ఎన్నో కుటుంబాలను పొట్టనబెట్టుకుంది.. అయితే, కరోనాతో కన్నుమూశారంటే.. వారిని చూసేందుకు వచ్చేవారు కూడా లేకుండా పోయారు.. ఇదే ఆ దంపతులకు కలిసి వచ్చింది.. గచ్చిబౌలిలోని టిమ్స్ ఆస్పత్రిలో దారుణమైన ఘటన వెలుగు చూసింది.. కరోనా సమయంలో మృతదేహాల పైనుంచి నగలు మాయం చేశారు దంపతులు.. ఇప్పటి వరకు ఏడు మృతదేహాల నుంచి నగలను కొట్టేసినట్టు గుర్తించారు.. టిమ్స్ ఆస్పత్రిలో ఔట్ సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న దంపతులు.. కరోనాతో మృతిచెందినవారి నగలను…
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి.. గల్లీ క్రికెటర్‌గా మారిపోయారు.. ఓ గల్లీలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులను చూసి కారు దిగిన ఆయన.. వెంటనే బ్యాట్ అందుకుని సిక్స్‌లు బాదేశారు… పిల్లలతో కలసి సరదాగా క్రికెట్ ఆడారు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇవాళ తన స్వగ్రామం పోచారం నుంచి బాన్సువాడకు వెళ్లున్న స్పీకర్ శ్రీనివాస్ రెడ్డికి.. మార్గం మధ్యలో దేశాయిపేట గ్రామంలో క్రికెట్ ఆడుతున్న చిన్నారులు కనిపించారు.. తన కాన్వాయ్ ఆపి.. పిల్లలను పలకరించిన స్పీకర్..…
రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ కావడంపై సంచలన ఆరోపణలు చేశారు మంత్రి హరీష్‌రావు.. కాంగ్రెస్ ముసుగులో తెలంగాణలోకి మళ్లీ చంద్రబాబు వచ్చారని వ్యాఖ్యానించిన ఆయన.. బాబు తన మనుషులకు కాంగ్రెస్‌లో పదవులు ఇప్పిస్తున్నారన్న ఆయన.. చంద్రబాబు ఆనాడు 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుని గెలవాలని ప్రయత్నిస్తే ఆంధ్రబాబు అని ప్రజలు వెల్లగొట్టారని.. టీడీపీ ముఖం పెట్టుకుని వస్తే తెలంగాణ ప్రజలు రానివ్వరని, తన మనుషులను కాంగ్రెస్ లోకి పంపి తెలంగాణలో చంద్రబాబు అడుగు పెడుతున్నారని…
టి.పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీరియస్‌గా స్పందించారు ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్.. కేటీఆర్ మరోసారి ఇలా రేవంత్ రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే తాట తీస్తాం.. జాగ్రత్త అని హెచ్చరించారు.. కేటీఆర్ ఇప్పుడు పదవులు అనుభవిస్తున్నారు అంటే .. దానికి కారణం సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వబట్టేనని గుర్తుచేసిన ఆయన.. చరిత్ర మరిచిపోయి మాట్లాడుతున్నారని మండిపడ్డారు.. ఇక, కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణను పూర్తిగా నాశనం చేశారని ఫైర్ అయిన సంపత్.. కాంగ్రెస్ చిన్న…
నిన్నటి ఉత్తర – దక్షిణ ఉపరితల ద్రోణి ఈ రోజు బలహీన పడినది. ఈ రోజు తూర్పు – పశ్చిమ ఉపరితల ద్రోణి / షీర్ జోన్ 20°N వద్ద సముద్ర మట్టం నుండి 2.1కిమీ నుండి 5.8 కిమీ మధ్య వుంది. అల్పపీడనం ఈ నెల 11వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతం & వాయువ్య బంగాళా ఖాతం పరిసరాలలోని ఉత్తర ఆంధ్రా, దక్షిణ ఒడిస్సా తీరంల దగ్గర ఏర్పడే అవకాశం వుంది. ఈ రోజు,…
ఈరోజు తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ తన అధ్యక్ష పదవికి రాజీనామా చేసారు. చంద్రబాబుకు రాజీనామా లేఖ పంపిన ఎల్.రమణ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు టీఆర్ఎస్లో చేరుతున్నా అని పేర్కొన ఆయన రాష్ట్రప్రగతిలో భాగసౌమ్యం కావాలని అనుకుంటున్నాను అన్నారు. అయితే గత కొన్ని రోజులుగా తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ టీఆర్ఎస్లో చేరనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలను నిజం చేస్తూ నిన్నవెళ్లి సీఎం కేసీఆర్ ను…
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి అనుమతి ఇవ్వాలని కోరినట్లు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తెలిపారు. కేఆర్ఎంబి బోర్డు పరిధిని నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశాను అన్నారు. కేఆర్ఎంబి పరిధిలోని ప్రాజెక్టులకు రక్షణ కల్పించాలి. తెలంగాణ ప్రభుత్వం చట్ట వ్యతిరేకం గా వ్యవహరిస్తోంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. చట్ట ప్రకారం కృష్ణా జలాలను వాడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరాను. విశాఖ గ్రామీణ ప్రాంతాలకు మంచినీటి సరఫరా కోసం ఏలేశ్వరం ప్రాజెక్టు ఖర్చును సగభాగం “జలజీవన్ పథకం”…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ఎంపికయ్యాక దూకుడును పెంచారు. ప్రజాసమస్యలపై పోరాటం చేసేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ముఖ్యంగా రాష్ట్రంలో నిరుద్యోగం, పెరుగుతున్న పెట్రోల్ ధరలపై పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమం సమయంలో నిరుద్యోగులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని, నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని అనుకున్నా, ఆ సమస్య తీరకపోగా మరింత ఎక్కువైందని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తున్నది. Read: పాత్రల్లో పరకాయప్రవేశం…