కాళేశ్వరంలో మళ్ళీ కరోనా కలకలం రేపింది. గత కొన్ని రోజుల నుండి మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముందస్తుగా కాళేశ్వర గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం దేవస్థానంకు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని…
తెలంగాణ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 465 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మరో 04 మంది కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, 869 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,31,683 కు చేరగా.. రికవరీ కేసులు 6,17,638 కు…
ఢిల్లీలో కేంద్ర పర్యాటకశాఖ మంత్రి కిషన్ రెడ్డితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదివారం భేటీ అయ్యారు. భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వారసత్వ సంపదగా ఉన్న భువనగిరి కోటకు కేంద్రం తరపున నిధులను మంజూరు చేయాలని కోరారు. 45 నిముషాల పాటు ఈ సమావేశం సాగింది. కోమటిరెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణలో పర్యాటక ప్రాంతాల అభివృద్ధిపై కిషన్ రెడ్డితో చర్చించాను. భువనగిరి కోట అభివృద్ధి, మూసినది ప్రక్షాళన, ఫార్మా సిటీ అంశాలను కిషన్ రెడ్డితో చర్చించానన్నారు.…
గతం లో సాగు నీటి కోసం,కరెంట్ కోసం రాష్ట్రం లోని రైతులు తీవ్ర ఇబ్బందులు పడేవారు. కానీ నేడు కేసీఆర్ ప్రభుత్వం లో అటువంటి సమస్యలు లేవు. 24 గంటల కరెంట్ రైతులకు అందుబాటులో ఉంటుంది అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. నెలకు 12 లక్షల రూపాయలను రైతుల పేరు మీద ఎలక్ట్రిసిటీ కి తెలంగాణ ప్రభుత్వం చెల్లిస్తుంది. బ్యాంక్ ల నుండి అప్పు తీసుకుని రాష్ట్రంలో రైతాంగం పండించిన ప్రతి పంటను కొనుగోలు…
భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి.. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఇదివరకు కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా పనిచేసిన కిషన్ రెడ్డికి కేబినెట్ హోదా లభించింది. కిషన్ రెడ్డికి పదోన్నతి లభించడం, పైగా పర్యాటక మంత్రిత్వ శాఖకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోండటంతో కోమటిరెడ్డి ఆయనను కలిశారు. పుష్పగుచ్ఛం అందించి శుభాకాంక్షలు తెలిపారు. చారిత్రక వైభవం కలిగిన భువనగిరి కోట అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. పర్యాటక శాఖ మంత్రిగా తగిన నిధులు మంజూరు చేయాలని ఆయన…
మదనపల్లె పర్యటనలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యడు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. రెండు తెలుగు రాష్ట్రా సీఎంలు కలసి బోంచేసి ముద్దులు పెట్టుకోవడం కాదు. ఇద్దరు కలసి కర్ణాటక లోని అల్ మట్టి, మహారాష్ట్ర లోని బీమా నదులపై నిర్మిస్తున్న ప్రాజెక్టులను అడ్డుకోండి. అక్కడ డ్యామ్ లు కడితే కృష్ణా నది ఎడారిగా మారుతుంది అన్నారు. సీఎం జగన్ కు రాజకీయ బిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే అని… అలాంటి రాయలసీమకు కృష్ణా…
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షం కురిసింది. దాదాపుగా గంటకు పైగా నగరంలో కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లోకి నీరు చేరడంతో పలు కాలనీల్లోని ఇళ్లల్లోకి నీరు చేరింది. కూకట్పల్లి, కేపీహెచ్బి, హైదర్‌నగర్, అల్విన్ కాలనీ, నిజాంపేట్, ప్రగతినగర్ కాలనీ, బాచుపల్లి, బాలానగర్, చింతల్, జగద్గిరిగుట్ట, జీడిమెట్ల, కొంపల్లి, మాదాపూర్, మణికొండ, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ తో పాటు నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురిసింది. Read:…
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన.. ఇవాళ బంగాళఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం ప్రభావంతో.. భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అల్పపీడన ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో పలుచోట్ల వర్షాలు దంచి కొడుతున్నాయి. read also : నేటి నుంచి ఆషాఢమాసం బోనాలు ప్రారంభం ప్రధానంగా హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో కొద్దిరోజులుగా వానలు…
భాగ్యనగరంలో నేటి నుంచి బోనాల పండుగ ప్రారంభం కానుంది. ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం, ఆలయకమిటీలు సన్నద్ధమయ్యాయి. మరోవైపు..బోనాల సందర్బంగా ప్రజలకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా అమ్మవారి ఆశీస్సులు కలకాలం కొనసాగాలని ప్రార్థించారు.ఆషాడమాసం బోనాల ఉత్సవాలకు భాగ్యనగరం సిద్ధమైంది. గోల్కొండ జగదాంబికా అమ్మవారికి బోనం సమర్పించడంతో ఉత్సవాలు మొదలుకానున్నాయి. గోల్కొండ అమ్మవారి తొట్టెల ఊరేగింపుతో బోనాల సందడి మొదలు కానుంది. ఇవాళ్టి నుంచి దాదాపు నెల రోజుల పాటు ఈ ఉత్సవాలు…