హుజురాబాద్ ఉప ఎన్నికల్లో గెలిచేది ఈటల రాజేందరేనని.. దానికి సంబంధించిన సర్వే నివేదికలు కూడా వచ్చాయని తెలిపారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్.. ఢిల్లీలో ఇవాళ కేంద్రమంత్రి అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు.. 15 నిమిషాల పాటు సమావేశం జరిగింది.. అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. బీజేపీలో ఈటల రాజేందర్ చేరిన రోజే అమిత్ షాను కలవాలని అనుకున్నాం.. అప్పుడు కుదరలేదు కాబట్టి సమయం తీసుకుని ఈ రోజు వచ్చి…
తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని అమిత్‌షా అన్నారు.. ఇందుకోసం ఎన్ని సార్లైనా తెలంగాణ వస్తానని తెలిపారు ఈటల రాజేందర్.. అమిత్ షాతో తెలంగాణ బీజేపీ నేతల భేటీ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడిన ఈటల.. షాను కలిసి రాష్ట్ర పరిస్థితులు వివరించామని.. రాష్ట్రంలో కాషాయ జెండా ఎగరాలని ఆయన అన్నారని.. ఇందుకోసం ఎన్నిసార్లు అయినా తెలంగాణ వస్తా అన్నారని వెల్లడించారు.. ఇక, ఎవరు ఎంత డబ్బు ఖర్చు చేసినా గెలిచేది బీజేపీయేనని ధీమా వ్యక్తం చేసిన…
తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం అతిపెద్ద హాట్‌టాపిక్ జల వివాదం. ఎవరి వ్యూహాలు వారివే. ఇలాంటి పరిస్థితుల్లో పక్క రాష్ట్రానికి సహకరించేలా గూఢచర్యం చేస్తే ఎలా ఉంటుంది? ఓ కీలక అధికారే అలాంటి గూఢచర్యానికి పాల్పడుతున్నట్టు తెలిస్తే..!? రియాక్షన్ ఊహించలేం. తిన్నింటి వాసాలు లెక్కపెడుతున్న ఆ ఆఫీసర్‌ను కంట్రోల్ చేయలేకపోతే కష్టమంటున్నాయి ఏపీ ఇరిగేషన్ వర్గాలు. అదేంటో ఈ స్టోరీలో చూద్దాం. జలవివాదంలో పక్క రాష్ట్రానికి గూఢచర్యం? కొందరు అధికారులు అవినీతికి పాల్పడితే.. ఇంకొందరు విధి నిర్వహణలో…
టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా నిరుద్యోగ యువతకు ఉద్యోగ భద్రత కల్పించలేకపోయిందని మంథని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ విమర్శించారు. మంథనిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. ఏదో ఒకరోజు ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపే రోజు వస్తుందన్నారు. వివిధ శాఖల్లో ఉద్యోగ ఖాళీల గురించి ప్రభుత్వానికే స్పష్టత లేదు. ఖాళీల విషయంలో చిత్తశుద్ధి లేని ప్రభుత్వం.. యువతి యువకులకు ఏలాంటి భరోసా…
ఢిల్లీ : తెలుగు రాష్ట్రాల మధ్య జల వివాదం ముదురుతూనే ఉంది. కృష్ణా జలాల వినియోగంలో తెలంగాణ సృష్టిస్తున్న అడ్డంకులు, అవరోధాలు, అక్రమాలపై సుప్రీంకోర్టులో తాజాగా ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. “కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు” పరిధిని వెంటనే నోటిఫై చేయాలని… తెలంగాణ ప్రభుత్వం జూన్ 28న జారీ చేసిన జీవోను రద్దు చేయాలని ఈ పిటిషన్ లో పేర్కొంది ఏపీ సర్కార్. read also : హుజురాబాద్ ఉప ఎన్నిక : రేవంత్…
ఇక, ఖాళీల భర్తీకై వార్షిక నియామక కేలెండర్ (జాబ్ క్యాలెండర్ ) విడుదల చేయాలని నిర్ణయించింది తెలంగాణ కేబినెట్.. ఇవాళ ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన కేబినెట్… సుదీర్ఘంగా ఏడు గంటలకు పైగా సాగింది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్జీవో, టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్…
సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమవేశమైన కేబినెట్ పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకుంది.. కొత్త జోనల్ వ్యవస్థకు అనుగుణంగా ఉద్యోగుల జిల్లాల వారీ కేటాయింపులు, నూతన జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపులు, మరియు అధికారుల కేటాయింపులు చేపట్టాల్సిందిగా టీఎన్ జీవో , టీజీవో ప్రతినిధులు సీఎం కేసీఆర్‌కు చేసిన విజ్జప్తిని పురస్కరించుకుని అందుకు సంబంధించి కేబినెట్ చర్చించింది. ఉద్యోగ సంఘాల కోరిక మేరకు జిల్లాల వారీగా పోస్టుల కేటాయింపు, అధికారుల కేటాయింపును సత్వరమే…
తెలంగాణ రాష్ర్టంలోని అన్ని యూనివర్సిటీల వీసీలతో ఉన్నత విద్యామండలి సమావేశమైంది. 11 యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై చర్చిస్తున్నారు. వర్సిటీల్లో ఖాళీగా ఉన్న ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయడం కోసం విధివిధానాలు రూపొందించనున్నారు. న్యాయపరమైన చిక్కులు తలెత్తకుండా ప్రణాళిక రూపొందించనున్నారు. ఫ్యాకల్టీ నియామకం స్టేట్ వైడ్ గా (కేంద్రీకృతంగా) అన్ని యూనివర్సిటీ లకు కలిపి, లేదా యూనివర్సిటీ వైస్ గా చేయాలా అనే దానిపై వీసీల అభిప్రాయం తీసుకుంది…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ఇవాళ మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డితో సమావేశం అయ్యారు.. గతంలో కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన ఆయనను తిరిగి పార్టీలోకి రావాలని ఆహ్వానించడం.. ఆయన కూడా రెడీగా ఉన్నట్టు వారి మాటల్లో అర్థం అవుతోంది.. కొండా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత.. బీజేపీలో చేరడం ఖాయం అనే ప్రచారం జరిగినా.. ఆయన మాత్రం కాంగ్రెస్ గూటికి చేరడానికే ఉత్సాహంగా ఉన్నారని అర్థం అవుతోంది.. ఈ సమావేశం ముగిసిన తర్వాత మీడియాతో…
ఆడియో టేపు లీక్ వ్యవహారంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన హుజురాబాద్ నేత కౌశిక్‌రెడ్డికి మరో షాక్ తగిలింది… టీపీసీసీ చీఫ్‌గా రేవంత్‌రెడ్డిని నియమించేందుకు రూ. 50 కోట్లు తీసుకున్నారంటూ కౌశిక్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై సీరియస్‌గా స్పందించిన ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మాణిక్కం ఠాగూర్… పాడి కౌశిక్‌రెడ్డికి లీగల్‌నోటీసులు పంపారు.. కౌశిక్‌కు మదురై కోర్టు నుంచి ఈ లీగల్‌నోటీసు జారీ అయ్యాయి… దీనిపై వారం రోజుల్లో రాతపూర్వకంగా క్షమాపణ చెప్పాలని నోటీసుల్లో పేర్కొనగా… లేకపోతే…