మాజీమంత్రి ఈటల రాజేందర్ నేడు హుజూరాబాద్ నియోజకవర్గంలో పాదయాత్ర మొదలుపెట్టారు. ఆయన మాట్లాడుతూ.. అధికార టీఆర్ఎస్పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తన పాదయాత్రను అడ్డుకునేందుకు కుట్ర జరుగుతుందని ఆరోపించారు. తెలంగాణను కేసీఆర్ రజాకార్ల రాజ్యం చేసిండన్నారు.. ‘దళిత బందు పథకం’ పెట్టారట సంతోషం.. కానీ ఇంతవరకు దళితులకు ఇస్తామన్న 3 ఎకరాలు అమలు కాలేదని, వారి సంక్షేమ కోసం ఏమీ చెయ్యలేదని ఆరోపించారు. కేవలం ఎన్నికల కోసం పథకాలు తీసుకురావద్దు.. రెండేళ్లుగా ఇవ్వని పెన్షన్, రేషన్ కార్డ్ ఇస్తున్నారు.…
నీళ్లు.. నిధులు.. నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పులపాలు చేస్తున్నాడని మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి తెలిపారు. నీళ్లు చేతులారా వదులుతున్నాడు, ఉన్న ఉద్యోగాలు పీకేస్తున్నాడు.. నిధులు ఎలాగో లేవు, రాష్ట్రాన్ని అప్పులపాలు చేసాడని ఆరోపించాడు. రంగారెడ్డికే కాదు.. పశ్చిమ తెలంగాణకి చుక్క నీరు రానివ్వకుండా చేసాడు. రాష్ట్రానికి దరిద్రం పట్టుకోవడం కాదు…కేసీఆర్ కుటుంబం పట్టుకుందని విమర్శలు చేశారు. ఎట్టిపరిస్థితుల్లో హుజూరాబాద్‌లో కేసీఆర్‌ని ఓడిస్తామని తేల్చి చెప్పారు. ఇందుకోసం అన్ని పార్టీల నాయకుల…
తెలంగాణకు మరో మూడు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. నిన్న సముద్ర మట్టానికి 0.9 కిమీ ఎత్తు వద్ద ఏర్పడిన ఉత్తర దక్షిణ ద్రోణి, ఈ రోజు బలహీన పడింది. తూర్పు – పశ్చిమ ద్రోణి/షేర్ జోన్ ఈ రోజు సుమారు 17°N అక్షాంశం వెంబడి స్థిరంగా ఉండి, సముద్ర మట్టానికి 4.5 కిమీ నుండి 5.8 కిమీ మధ్య కొనసాగుతూ ఎత్తుకి వెళ్ళే కొలదీ దక్షిణ వైపుకి వంపు తిరిగి ఉంది. read…
ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం కోకాపేటలోని భూములను వేలం వేసింది. ఈ వేలంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే కోకాపేటలో వేలం వేసిన భూములను సందర్శించాలని కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. కోకాపేట భూములను సందర్శించి, ధర్నా చేయాలని పార్టీ నిర్ణయించారు. దీంతో జూబ్లీహిల్స్‌లోని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. భూముల సందర్శనకు వెళ్లకుండా కాంగ్రెస్ నేతలు వెళ్లకుండా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. Read:…
తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే త్వరలో అమలు చేయబోతున్న దళిత సాధికారత పథకానికి.. “తెలంగాణ దళిత బంధు” అనే పేరును సీఎం కేసీఆర్ ఖరారు చేశారు. మొదటగా, పైలట్ ప్రాజెక్టు కింద ఒక నియోజక వర్గాన్ని ఎంపిక చేసి, ‘తెలంగాణ దళిత బంధు’ పథకాన్ని అమలును ప్రారంభించాలని సమావేశం నిర్ణయించింది. అందులో భాగంగా పైలట్ నియోజకవర్గంగా కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్ నియోజవర్గాన్ని ఎంపిక చేశారు. read also :…
సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంత చుట్టు పక్కల కాలనీల్లో నివసిస్తున్న వేలాది మంది ప్రజలకు ఇబ్బంది మారిన కంటోన్మెంట్ రహదారుల మూసివేత సమస్యను పరిశీలించాలని ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు కేంద్ర రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్ భట్ కు సూచించారు. నూతనంగా సహాయమంత్రిగా నియమితులైన అజయ్ భట్, ఆదివారం నాడు ఢిల్లీలోని ఉపరాష్ట్రపతి నివాసంలో, వారిని మర్యాదపూర్వకంగా కలిశారు. read also : ముగిసిన శ్రీలంక ఇన్నింగ్స్…ఇండియా టార్గెట్ ఎంతంటే ? ఈ సందర్భంగా సికింద్రాబాద్ కంటోన్మెంట్…
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 578 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో 3 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 731 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్..దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,36,627 కు చేరగా… రికవరీ కేసులు 6,23,044 కు…
గత కొన్ని రోజులుగా దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇటు తెలంగాణ రాష్ట్రంలో కూడా విస్తారంగా వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే, భాగ్యనగరంలో ప్రతిరోజూ మద్యాహ్నం సమయంలో వర్షం కురుస్తున్నది. ఈ రోజు కూడా నగరంలో కుండపోతగా వర్షం కురుస్తున్నది. ఈ వర్షానికి రోడ్లన్నీ తడిసిముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లొకి వర్షం నీరు చేరుతున్నది. నాలాలు పొంగిపొర్లుతున్నాయి. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అబిడ్స్, హిమాయత్ నగర్, సికింద్రాబాద్, బేగంపేట, నాంపల్లి, ఎంజే…
తెలంగాణ బీజేపీ నేతలు ఇరకాటంలో పడ్డారా? తెలుగు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం కీలకంగా మారిన గెజిటే దానికి కారణమా? ఏపీ బీజేపీ నేతల పాటనే తెలంగాణ కమలనాథులు పాడుతున్నారా? ఈ యుగళగీతం వెనక ఆంతర్యం ఏంటి? ఇది నష్టమా.. లాభమా? గెజిట్‌పై తెలంగాణ బీజేపీ స్పందించిన తీరు మీద చర్చ! కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ధారిస్తూ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ జారీ చేసిన నోటిఫికేషన్‌పై తెలుగు రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు స్పందించాయి.…
చికిత్స కోసం దాచుకున్న రెండున్నర లక్షల రూపాయలను ఎలుకలు కొట్టడంతో తీవ్ర బాధలో ఉన్నాడు ఓ వృద్ధుడు. మహబూబాబాద్ మండలం ఇందిరానగర్ తండాలో ఈ ఘటన చోటుచేసుకొంది. ఈ వార్త విన్న గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న రెడ్యాకు ఫోన్ చేసి భరోసా కల్పించారు. రెడ్యాతో ఫోన్ లో మాట్లాడారు. రెడ్యా దాచుకున్న డబ్బులను తిరిగి ఇప్పిస్తానని, ఆయన కోరుకున్న చోట మెరుగైన వైద్యం కల్పిస్తామన్నారు.…