హైదరాబాద్ టు షార్జా.. ఆ విమానంలో ముగ్గురే ప్రయాణికులు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏకంగా 180 మంది ప్రయాణికులు ఒకేసారి ప్రయాణం చేసే వీలున్న విమానంలో.. ముగ్గురంటే ముగ్గురే.. అది కూడా ఒకే ఫ్యామిలీ ప్రయాణం చేసింది… అయితే, విమానాన్ని ఆ ఫ్యామిలీ బుక్ చేసుకుందేమో.. అందుకే ముగ్గురు మాత్రమే ప్రయాణం చేశారని అనుకుంటే మాత్రం తప్పులే కాలేసినట్టే ఎందుకుంటే.. ఎలాంటి అదనపు ఖర్చులు చెల్లించకుండా ఈ సౌకర్యం తెలంగాణకు చెందిన ఓ ఎన్ఆర్ఐ ఫ్యామిలీకి లభించింది. హైదరాబాద్ టు షార్జా.. విమానంలో ముగ్గురు మాత్రమే ప్రయాణం చేసిన వీడియో ఒకటి నెట్టింట్లో ఇప్పుడు వైరల్‌గా మారిపోయింది… దానికి సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే..
మూడు నెలల క్రితం అత్యవసరంగా హన్మకొండకు వచ్చిన ఓ ఎన్‌ఆర్ఐ ఫ్యామిలీ ఇక్కడే చిక్కుకుపోయి.. అనేక ఇబ్బందులు పడింది.. కరీంనగర్‌కు చెందిన బండం శ్రీనివాసరెడ్డి, పోటు హరిత రెడ్డి దంపతులు. పదేళ్లుగా దుబాయ్‌లో నివాసముంటున్నారు. హరిత రెడ్డి ఓ ఆస్పత్రిలో వైద్యురాలిగా పని చేస్తుండగా, శ్రీనివాస రెడ్డి టెక్ మహేంద్ర కంపెనీలో ఉన్నత ఉద్యోగం చేస్తున్నారు. ఏప్రిల్ 18న హరిత రెడ్డి తండ్రి సత్యనారాయణ రెడ్డి కన్నుమూయడంతో ఈ దంపతులిద్దరూ కొడుకు సంజిత్ రెడ్డితో అదే రోజు హన్మకొండకు వచ్చారు. భారత్‌లో కరోనా వ్యాప్తితో ఏప్రిల్ 24 నుంచి యూఏఈ ప్రభుత్వం భారతీయ విమానాలపై నిషేధాన్ని విధించడంతో వారు ఇక్కడే ఇరుక్కుపోయారు. ఆరుసార్లు విమాన టికెట్లు కొన్నప్పటికీ మారుతున్న నిబంధనలతో ప్రతిసారీ ప్రయాణం వాయిదా పడింది.. అయితే, వైద్యులు, ఆరోగ్య సిబ్బంది, దౌత్యవేత్తలు, గోల్డెన్ వీసా కలిగిన వారు తమ దేశంలోకి రావొచ్చని యూఏఈ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ దంపతులిద్దరూ దుబాయ్‌కు తిరిగొచ్చేందుకు దరఖాస్తు చేసుకున్నారు.. అనుమతి కూడా లభించింది. ఇక, ఇతర ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో కేవలం ఈ ముగ్గురితోనే ఎయిర్‌బస్ ఏ-320 ఎయిర్ అరేబియా విమానం… హైదరాబాద్ నుంచి షార్జాకు చేరుకుంది. ఇప్పుడా వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
Also Read
- Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
- Punjab: ఎన్నికల వేళ హస్తం పార్టీకి షాక్.. కాంగ్రెస్ అధ్యక్షుడు అమరీందర్ వారింగ్ రాజీనామా
- Chhattisgarh: బాలీవుడ్ ఆఫర్ కొట్టేసిన మాజీ మావోలు.. ఏ సినిమా అంటే..!
- RBI: ఆర్బీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సుధాకర్ మల్లి నియామకం
తాజావార్తలు
-
Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
-
Legendary Director Singeetham Srinivasa Rao : తెలుగు సినిమా ప్రమోగశాల మూతపడింది..
-
Rahul Gandhi: ‘‘రాహుల్ గాంధీ భయపడ్డారు’’.. అఖిలేష్ హామీతో రాయ్‌బరేలీలో పోటీ..
-
Oben Rorr EVO: 180KM రేంజ్.. 8 ఏళ్ల బ్యాటరీ వారంటీ.. దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎలక్ట్రిక్ బైక్ ఇదే..!
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!