ఇళ్లలో పేపర్లు కనిపిస్తే చాలు ఎలుకలు నుజ్జు నుజ్జు చేసిన ఘటనలు ఎన్నో చూసి ఉంటారు.. కానీ, ఓ వృద్ధుడు తన ఆపరేషన్ కోసం కష్టపడి సంపాదించి కొంత… అప్పు తెచ్చి మరికొంత.. ఇంట్లో దాచుకున్నాడు.. కానీ, ఆ మొత్తం సొమ్మును ఎలుకలు నుజ్జు..నుజ్జు చేయడంతో లబోదిబోమనడం బాధితిడి వంతు అయ్యింది… మహబూబాబాద్ జిల్లా మహబూబాబాద్ మండలం వేంనూర్ శివారు ఇందిరానగర్ తండాలో జరిగిన ఆ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇందిరానగర్ తండాకు చెందిన…
శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతుంది. రెండు తెలుగు రాష్ట్రలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలో నీరు వచ్చి చేరుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 36,750 క్యూసెక్కులుగా ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 7,063 క్యూసెక్కులు గా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 809.60 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 34.1004 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం ఎడమగట్టు…
నేడు తెలంగాణలో జరగనున్న పాలిసెట్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు అధికారులు. ఈ పరీక్షకు లక్ష 2వేల496 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా 411 కేంద్రాలలో ఈ పరీక్షా జరగనుంది. ఉదయం 11 గంటల నుండి 1:30 వరకు పరీక్ష ఆఫ్‌లైన్(పెన్,పేపర్,పెన్సిల్)లో పరీక్ష జరగనుంది. అభ్యర్థులకు పది గంటల నుండే పరీక్ష హాల్ లోకి అనుమతించనున్నారు. 11 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యం అయిన నో ఎంట్రీ అని స్పష్టం చేసారు.…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాల పరిష్కారానికి కేంద్రం గెజిట్లు విడుదల చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం.. ఇక, త్వరలోనే పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో.. నీటా వాటాల విషయంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు సీఎం కేసీఆర్.. సాగునీటి విషయంలో తెలంగాణ రాష్ట్రానికి ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనివ్వకూడదని ఎంపీలకు స్పష్టం చేశారు కేసీఆర్. లోక్ సభ, రాజ్యసభల్లో, సందర్భం వచ్చినప్పుడల్లా తెలంగాణకు న్యాయంగా దక్కాల్సిన నీటివాటాకోసం కేంద్రాన్ని నిలదీయాలని, గట్టిగా కొట్లాడాలని…
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంచింది.. అయితే, ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని కోరుతూ ఇవాళ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసి కోరింది. తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ప్రతినిధులు, సింగరేణి ప్రాంత ఎమ్మెల్యే, ఎంపీలు ప్రగతి భవన్లో కేసీఆర్‌ను కలిసి.. ఈ మేరకు విజ్ఞప్త చేశారు.. అయితే, వారి వినతిపై సీఎం సానుకూలంగా…
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ పొలిటిషన్, రాజ్యసభ సభ్యులు డి. శ్రీనివాస్ ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు.. ఆయన కుమారుడు ఒకరు బీజేపీ నుంచి ఎంపీగా ప్రతినిథ్యం వహిస్తుండగా.. మరొకరు కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించడానికి సిద్ధం అవుతున్నారనే ప్రచారం సాగుతోంది.. ఇక, సార్వత్రిక ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో.. టీఆర్ఎస్కు కూడా దూరమైన డీఎస్.. తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ప్రచారం కూడా నడుస్తోంది.. ఈ నేపథ్యంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు…
మహిళల భద్రత విషయంలో తెలంగాణ రాష్ట్ర పోలీసులు మరో అడుగు ముందుకు వేశారు. మహిళలు, చిన్నారుల నేరాలపై పరిశోధనకు దేశంలోనే తొలిసారిగా ప్రత్యేక సైబర్ ల్యాబ్‌ను ప్రారంభించనున్నారు. సైబర్ నేరాలను నివారించేందుకు గాను రాష్ట్ర పోలీసు శాఖలో ప్రత్యేకంగా సైబర్ ల్యాబ్ పేరుతో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర మహిళా భద్రత విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటైన ఈ సైబర్ ల్యాబ్ పై మహిళా భద్రత విభాగం అడిషనల్ డి.జి స్వాతిలక్రా, సైబర్ ఇంటలీజెన్స్, డిజిటల్ ఫోరెన్సిక్…
భూముల వేలం తెలంగాణ ప్రభుత్వానికి భారీగా ఆదాయాన్ని తెచ్చిపెడుతోంది… నిన్న కోకాపేటలో రూ.2 వేల కోట్లకు పైగా ఆదాయం రాగా.. ఇవాళ సైబరాబాద్‌లో హైటెక్ సిటీ సమీపంలోని ఖానామెట్‌లోని భూముల వేలానికి విశేష స్పందన లభించింది. ఎంఎస్టీసీ ద్వారా నిర్వహించిన ఈ వేలంలో మొత్తం అయిదు ప్లాట్లను విక్రయించారు. 14.91 ఎకరాలకు గాను రూ. 729.41 కోట్ల ఆదాయం వచ్చినట్టు ప్రకటించారు అధికారులు.. గరిష్టoగా ఎకరానికి రూ.55 కోట్ల ధర పలకగా.. 15 ఎకరాలకు అవరేజ్ గా…
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 715 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో నలుగురు కరోనా బాధితులు మృతిచెందారు.. ఇక, ఇదే సమయంలో 784 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,35,320కు చేరగా… రికవరీ కేసులు 6,21,541కు పెరిగాయి.. ఇప్పటి వరకు…
మరోసారి సీఎం కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి… గందమల్ల రిజర్వాయర్ ఎత్తేస్తె ఆలేరు ప్రాంతం ఎడారిగా మారే ప్రమాదం ఉందని… కానీ, ఎమ్మెల్యే గొంగిడి సునీత చోద్యం చూస్తున్నారని ఫైర్ అయిన ఆయన.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల మోసం చేయడం మానుకోవాలని హితవుపలికారు.. కేసీఆర్ ఇన్నిసార్లు యాదాద్రికి వచ్చినా.. ఒక్కసారి యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ పరిస్థితి పట్టించుకోవడం లేదన్న ఆయన.. గజ్వేల్, సిరిసిల్ల, సిద్దిపేట మున్సిపాలిటీ…