వైరల్: ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు బెదిరింపులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తాజాగా బీఎస్పీలో చేరిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై అధికార టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్గొండ వేదికగా జరిగిన సభలో కేసీఆర్ ప్రభుత్వం పై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన విమర్శలకు కౌంటర్ ఇచ్చారు. ఉద్యోగం పోయే పరిస్థితుల్లో ప్రవీణ్‌కుమార్ వీఆర్‌ఎస్ తీసుకున్నారని ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్ ఆరోపించారు. అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్న టీఆర్ఎస్ పై విమర్శలు చేస్తున్న ప్రవీణ్‌కుమార్ ఏ కార్యక్రమాలు చేయకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీను ఎందుకు ప్రశ్నించరని నిలదీశారు.. అంతేకాదు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు తుంగతుర్తి ఎమ్మెల్యే కిషోర్.. అయితే.. ఆ తర్వాత ఓ వ్యక్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కు ఫోన్ చేసి బెదిరించిన ఆడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది..
ఎమ్మెల్యే గాదరి కిషోర్ కి ఫోన్ చేసి.. తాను సంపత్ స్వేరో అంటూ పరిచయం చేసుకున్న ఆ వ్యక్తి.. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై వ్యాఖ్యలు చేయడాన్ని తప్పుబట్టాడు.. ఫోన్‌లో ఎమ్మెల్యేతో దురుసుగా ప్రవర్తించాడు.. ప్రవీణ్ కుమార్ ను విమర్శించే స్థాయి నీదా అంటూ.. కాస్త బెదిరింపు ధోరణితో మాట్లాడిన సంపత్.. మరోసారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీద ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చాడు.. అయితే, అదే స్థాయిలో రియాక్ట్ అయ్యారు ఎమ్మెల్యే కిషోర్.. నా స్థాయి ఏంటో నాకు తెలుసు అంటూ సమాధానం ఇచ్చిన ఆయన.. గాదరి కిషోర్ అంటే ఏంటో చూస్తావా.. 172 కేసులు పెట్టుకుని జైలు పాలై వచ్చిన వ్యక్తిని.. ఉద్యమాలు చేసి వచ్చానన్నారు.. ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే.. ప్రవీణ్ కుమార్ ఫోన్ చేసి బెదిరించాలని చెప్పాడా..? ఇకనైనా ఫోన్ చేసి బెదిరింపులు బంద్ చేయండి.. జాతి పేరు ఆగం చేయకండి అంటూ హితవుపలికారు.. నాకు ఫోన్ చేసి బెదిరిస్తున్నావని.. పీఎస్‌లో కేసు పెడతానని హెచ్చరించారు ఎమ్మెల్యే.. అయితే.. ఇప్పుడా ఆడియో వైరల్‌గా మారి నెట్టింట్లో హల్‌చల్ చేస్తోంది.
Also Read
- France: విద్యార్థుల నిరసనలతో అట్టుడుకుతున్న ఫ్రాన్స్.. ఆస్తుల ధ్వంసం
- Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Pakistan-UN: కాశ్మీర్ సమస్య పరిష్కరించండి.. యూఎన్ ముందు పాక్ మళ్లీ దౌత్యం
తాజావార్తలు
-
Bhatti Vikramarka: “మీరు చేసిన తప్పులు వారానికి ఒకటి బయటపెడతా”.. హరీష్ రావుపై భట్టి విక్రమార్క ఫైర్..
-
Vijay Deverakonda: ఎన్నాళ్లయ్యిందయ్యా హిట్ కొట్టి.. బజ్ లేని ‘రణబాలి’తో విజయ్ కమ్‌బ్యాక్ ఇస్తాడా?
-
iPhone Sales: పండుగల వేళ ఐఫోన్ ప్రియులకు బంపర్ ఆఫర్.. ఐఫోన్ 15, 16, 17లపై ఊహించని తగ్గింపు!
-
Vidyut Jammwal: లైవ్ ఈవెంట్లో 15 నిముషాలు ఊపిరి ఆపిన బాలీవుడ్ హీరో.. సాధ్యమేనా?
-
Fauzi Teaser: ‘ఫౌజీ’ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!