ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్ ముసాయిదా విడుదల చేసింది. కృష్ణా గోదావరి నదీజలాల నిర్వహణ సంఘాల పరిధినిప్రకటించింది. దీని అమలు కోసం ఇరు రాష్ట్రాలు చెరి 200 కోట్ల చొప్పున చెల్లించాలనీ, అక్టోబర్నుంచి అమలులోకి వస్తుందని ప్రకటించింది. ఈ ప్రకటనను తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ వ్యతిరేకించగా ఎపి ముఖ్యమంత్రి జగన్ ఆహ్వానించారు. వాస్తవంలో…
కరీంనగర్ జిల్లా : మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్‌లో ఉప ఎన్నిక అనివార్యం అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు ఉప ఎన్నికల నోటిఫికేషన్ రాక ముందే అన్ని పార్టీలు ప్రచారాన్ని మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలో హుజురాబాద్ ఉప ఎన్నికపై వైఎస్ షర్మిల కీలక ప్రకటన చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేయబోమని…అసలు హుజురాబాద్ ఎన్నికల వల్ల ఉపయోగం ఉందా ? అని ప్రశ్నించారు. ”నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయా? దళితులకు మూడు ఎకరాల…
తెలంగాణలో గత కొంతకాలంగా కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి… రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 729 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కగా.. మరో 5 మంది కరోనా బాధితులు మృతి చెందారు.. ఇక, ఇదే సమయంలో 772 మంది కరోనా నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. read also : సినిమా థియేటర్ల సమస్యలు పరిష్కరిస్తా- తలసాని దీంతో.. మొత్తం పాజిటివ్…
ఇటీవల హైదరాబాద్ నగరంలో మోసాలు పెరిగిపోతున్నాయి. అవసరాలను అవకాశంగా మలుచుకుని సొమ్ము చేసుకునే మాయగాళ్ల మాటలతో కొందరు మోసపోతున్నారు. తాజాగా నగరంలో ప్లాట్ రిజిస్ట్రేషన్ పేరుతో కోట్లలో మోసాలకు పాల్పడిన ఘరానా మోసగాడిని సీసీఎస్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు అబ్దుల్ రషీద్ 15 మందికి ప్లాట్స్ ఇప్పిస్తానని నమ్మించి వారి నుంచి 5 కోట్లు వసూలు చేశాడు. 5 కోట్ల రూపాలయలు తీసుకుని ప్లాట్స్ ఇప్పించకుండా సొంత ఖర్చులకు వాడుకున్నాడు. బాధితుల ఫిర్యాదు మేరకు.. చాంద్రాయగుట్టలో…
రాజకీయాల్లో ఎవరు ఎప్పుడు శత్రువులుగా మారతారో చెప్పలేం. ఆ నియోజకవర్గంలో కూడా అంతే. నిన్న మొన్నటి వరకు దోస్త్ మేరా దోస్త్ అనుకున్నవారు నేడు ముఖం చిట్లించే పరిస్థితి. కొత్త మిత్రుడు దొరకడంతో పాత ఫ్రెండ్‌కు గుడ్‌బై చెప్పేశారట. అదే ఇప్పుడు అధికారపార్టీలో హాట్ టాపిక్. వారెవరో ఈ స్టోరీలో చూద్దాం. మాజీ ఎంపీ అనుచరుడిగా ఎమ్మెల్యేపై ముద్ర! ఖమ్మం జిల్లా వైరా. 2018 ఎన్నికల్లో ఇక్కడి ఫలితం ఓ సంచలనం. కాంగ్రెస్ తిరుగుబాటు అభ్యర్థిగా బరిలో…
వినాయక చవిత వచ్చిందంటే గణేష్ ఉత్సవాలు అంబరాన్ని తాకుతాయి.. ముఖ్యంగా భాగ్యనగరంలో గణేష్ ఉత్సవాలకు, నిమజ్జనానికి ప్రత్యేకస్థానం ఉంది.. ఇక, ఖైరతాబాద్‌లో కొలువుదీరే మహా గణనాథుడి విగ్రహం తయారీ నుంచి నిమజ్జనం వరకు అంతా ప్రత్యేకమనే చెప్పాలి.. ఒక్కోఏడాది ఒక్కోరూపంలో దర్శనమిచ్చే ఖైరతాబాద్ వినాయకుడు ఈ ఏడాది పంచముఖ రుద్ర మహాగణపతిగా దర్శనమివ్వనున్నాడు. ఖైరతాబాద్ గణేష్ విగ్రహ నమూనాను ఇవాళే ఆవిష్కరించింది ఉత్సవ కమిటీ.. పంచముఖ రుద్ర మహాగణపతిగా భారీ గణనాథుడి దర్శనమివ్వనుండగా.. మండపంలో గణనాథుడికి ఎడమ…
గత నెల (జూన్) 20 నుండి తెలంగాణాలో నూరు శాతం ఆక్యుపెన్సీతో థియేటర్లలో సినిమాలను ప్రదర్శించవచ్చని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ సినిమా థియేటర్ల యాజమాన్యం మాత్రం పెండింగ్ లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించే వరకూ థియేటర్లు తెరవమని చెప్పేశారు. అంతే కాకుండా అక్టోబర్ నెలాఖరు వరకూ నిర్మాతలెవరూ ఓటీటీలలో సినిమాలను విడుదల చేయవద్దంటూ తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఓ తీర్మానం కూడా చేసింది. అయితే… శనివారం తమ సమస్యలను…
హైదరాబాద్‌లో గణేష్ ఉత్సవాలు, నిమజ్జనానికి ప్రత్యేక స్థానం ఉంది… ఈ ఉత్సవాల్లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ కీలక పాత్ర పోషిస్తోంది.. కరోనా మహమ్మారి కారణంగా.. గత ఏడాది ఉత్సవాలు కళ తప్పాయి.. ఈసారి కూడా అప్పటి వరకు కరోనా పరిస్థితులు ఎలా ఉంటాయోననే టెన్షన్ కొనసాగుతూనే ఉంది.. ఈ ఏడాది 10 సెప్టెంబర్న గణేష్ ఉత్సవాలు స్టార్ట్ అవుతాయని.. 19వ తేదీన గణేష్ నిమజ్జనం ఉంటుందని వెల్లడించారు భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ…
కోకాపేట్, ఖానామెట్ భూముల వేలానికి అనూహ్య స్పందన వచ్చింది.. కనక వర్షమే కురిసింది.. అయితే, ఖానామెట్ భూముల వేలంపై కీలక ఆదేశాలు ఇచ్చింది తెలంగాణ హైకోర్టు.. ఖానామెట్‌లోని మూడెకరాల స్మశాన వాటిక వేలాన్ని ఆపాలని హైకోర్టు ఆదేశించింది. ఖనామెట్‌లో గొల్డెన్ మైల్‌లోని 15 ఎకరాలను వేలం వేశారు.. అయితే, 15 ఎకరాల్లో మూడెకరాల స్మశానం కూడా ఉంది. ఆ స్మశాన స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వం వేలానికి పెట్టగా.. ఆ స్మశానవాటిక వేలాన్ని ఆపాలంటూ హైకోర్టును ఆశ్రయించారు స్థానికులు……