* కొనసాగుతున్న ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. నేడు అర్జెంటీనాలో ప్రధాని పర్యటన.. అర్జెంటీనాతో పలు కీలక ఒప్పందాలు చేసుకున్న భారత్..
* హైదరాబాద్: నేడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా రామచందర్‌రావు బాధ్యతల స్వీకరణ.. ఉదయం 8 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయంలో ప్రత్యేక పూజలు.. 9 గంటలకు గన్‌పార్క్‌లో అమర వీరుల స్థూపానికి నివాళులు.. 11 గంటలకు బీజేపీ కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ
* హైదరాబాద్: ఈ రోజు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో కేటీఆర్ మీడియా సమావేశం
* గుంటూరు: నేడు రాజధాని గ్రామాల్లో గ్రామ సభలు.. రెండో విడత భూసమీకరణపై కొనసాగుతున్న గ్రామ సభలు
* విశాఖ: స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా EPDCL కార్పోరేట్ కార్యాలయం దగ్గర సీపీఐ ఆందోళన…. అదానీతో పవర్ ప్లాంట్ ఒప్పందాలు రద్దు చేయాలని., పెంచిన విద్యుత్ సర్దుబాటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్
* విశాఖ జిల్లా వైసీపీ విస్తృత స్థాయి సమావేశం.. బాబు ష్యూరిటీ – మోసం గ్యారెంటీ కార్యక్రమంలో పాల్గొనున్న బొత్స, కన్నబాబు.,..
* శ్రీ సత్యసాయి: హిందూపురం రూరల్ పరిధిలోని ముద్దిరెడ్డిపల్లి లో నేటి నుంచి శ్రీ రుక్మిణి పాండురంగ స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు.. నేడు ఆలయంలో స్వామివారికి ప్రాకారోత్సవం, కలశ స్థాపన, కళ్యాణోత్సవం, గరుడ వాహనం. పెద్ద సంఖ్యలో హాజరుకానున్న భక్తులు
* అనంతపురం : విడపనకల్లు మండలం డోనేకల్లు గ్రామంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొననున్న మంత్రి పయ్యావుల కేశవ్.
* శ్రీ సత్యసాయి : హిందూపురం పట్టణంలో ఇస్కాన్ ఆధ్వర్యంలో 32 అడుగుల మహా రథములో జగన్నాథ, బాలదేవ, సుభద్రదేవి రథయాత్ర
* అనంతపురం : బ్రహ్మసముద్రం మండలం వేస్ట్ కోడి పల్లి గ్రామం వద్ద బైరవానీతిప్పప్రాజెక్టు కాలువ పనులు పునఃప్రారంభించనున్న మంత్రి పయ్యావుల కేశవ్ , ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు, కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఎమ్మెల్యే సురేంద్రబాబు.