పేదరికాన్ని రూపుమాపాలన్నా.. ఒక వ్యక్తిని ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేది కేవలం చదువు మాత్రమే. అందుకే విద్యకు అంత ప్రాధాన్యతనిస్తూ ఖర్చుకు వెనకాడకుండా తమ పిల్లలను చదివిస్తున్నారు. ప్రభుత్వాలు సైతం విద్యావ్యాప్తికి కృషి చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. 20 మంది విద్యార్థులు ఉంటే చాలు.. ఆ ఏరియాలో ప్రభుత్వ పాఠశాల లేనట్టైతే వెంటనే ప్రాథమిక పాఠశాలను ప్రారంభించాలని ఆదేశించింది.
Also Read:Warangal: ఇన్స్టాలో మైనర్ బాలిక, బాలుడు రీల్.. ఘర్షణలో రెచ్చిపోయిన 50 మంది
మొదటి విడతలో 94 స్కూల్స్ పట్టణ ప్రాంతాల్లో, 63 ప్రైమరీ స్కూల్స్ గ్రామీణ ప్రాంతాల్లో వెంటనే ప్రారంభించాలని ఆదేశించింది. 20 కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఉన్న ప్రభుత్వ / స్థానిక సంస్థల పాఠశాల అందుబాటులో లేని గ్రామీణ ఆవాసాలు / పట్టణ కాలనీలు / వార్డుల లో ప్రైమరీ స్కూల్స్ అందుబాటులో ఉన్న ప్రభుత్వ గృహాలలో లేదా అద్దె వసతి గృహాలలో పాఠశాలలను వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని డిఇఓ లకి ఆదేశాలు జారీ చేసింది. ఫర్నిచర్, స్టేషనరీ, విద్యా సామగ్రి, ఇతర వస్తువులకు అవసరమైన బడ్జెట్‌ను డీఎస్ఈ ద్వారా జిల్లా కలెక్టర్లకు విడుదల చేయనుంది. 212 గ్రామీణ ఆవాసాలలో 359 పట్టణ కాలనీలు / వార్డులలో ప్రాథమిక పాఠశాలల ఏర్పాటు కానున్నాయి. మొత్తం 571 కొత్త ప్రైమరీ స్కూల్స్ అందుబాటులోకి రానున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో పేద విద్యార్థులకు ప్రయోజనకరంగా ఉండనున్నది.