రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యవసాయ శాఖపై సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… రైతు, రైతుబిడ్డ అయిన కెసీఆర్ ముఖ్యమంత్రి అవడం మన అదృష్టం రైతు బంధు అనేది దేశంలో ఎవరికి రాని ఆలోచన, ప్రధాన మంత్రి కూడా ఈ పథకం స్పూర్తితో పీఎం కిసాన్ ను ప్రారంభించారు. రైతు భీమా పథకం ను మొట్టమొదటి గా ప్రారంభించిన రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు. ఎవరికి ఒక పైసా లంచం లేకుండా, రైతులకు ఇబ్బంది లేకుండా ఒకే రోజు రిజిస్ట్రేషన్, ముటేషన్ ధరణి ద్వారా చేస్తున్న ప్రభుత్వం మనదే. కర్ణాటకలో బిజెపి ప్రభుత్వం తెలంగాణ లో లాగా పూర్తి ధాన్యంను కొనడంలేదు. రైతులకు 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణనే అన్నారు.
ఇక ఒకప్పుడు నీటికి కటకటలాడిన రాజన్న సిరిసిల్ల జిల్లా నేడు నిండు కుండలా మారింది. భారత దేశంలోనే గొర్రెల సంఖ్య రెట్టింపు ఐన రాష్ట్రం తెలంగాణ. మన రాష్ట్రంలో నాలుగు రకాల విప్లవాలు కళ్ళముందు ఆవిష్కరించ బడినాయి. తెలంగాణ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం గా మారింది. తెలంగాణ ఉద్యమంలో మీకు పంటలు పండించవచ్చా అని అడిగిన సందర్బం నుండి దేశానికే తెలంగాణ ధాన్యాగారం గా మారింది. కేవలం సిరిసిల్ల జిల్లా లోనే ఒక లక్ష టన్నుల ధాన్యం అదనంగా పండింది. ఎఫ్.సి.ఐ దొడ్డు వడ్లు కొనమంటుంది. ముఖ్యమంత్రి కెసిఆర్, ప్రధాన మంత్రితో మాట్లాడి ఈ ఒక్క సంవత్సరం కొనడానికి ఒప్పించారు.
కానీ ఈ పంటలు పండించడం, ప్రత్యామ్నాయం వైపు చూడకపోతే తీవ్రంగా ఇరుక్కుపోతాం. నువ్వులు, కందులు, పల్లీలు, పొద్దుతిరుగుడు, శనగలు లాంటి పంటలు పండించాలి. ఆయిల్ ఫాం పంటకు జిల్లాలో మంచి అవకాశం ఉంది. ప్రతి గ్రామంలో వంద ఎకరాల్లో ఆయిల్ ఫాం పంట పండించేలా చూడాలి. నేను మోహినికుంటలో పది, పదిహేను ఎకరాలు కొనుక్కుని ఆయిల్ ఫాం పంటను పండిస్తాను అని పేర్కొన్నారు.