తెలంగాణలో కురుస్తున్న భారీ నుంచి అతి భారీ వర్షాలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.. వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లడమే కాదు.. గ్రామాలు, పట్టణాల్లోని ముంపు ప్రాంతాల్లో జలమయం అయ్యాయి.. వరదల్లో చిక్కుకున్నవారిని రక్షించేందుకు సహాయక చర్యలు చేపట్టారు.. ఇక, ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది.. గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుండడంతో.. తెలంగాణ – మహారాష్ట్ర మధ్య రాకపోకలు నిలిచిపోయాయి… ఉధృతంగా ప్రవహిస్తోన్న గోదావరి వరద నీరు.. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని కందకుర్తి బ్రిడ్జిపై…
తెలంగాణలో రాజకీయ వేడి రాజుకుంటోంది. టీఆర్ఎస్ నేతలంతా హుజూరాబాద్ పై దృష్టి పెట్టగా.. కాంగ్రెస్, బీజేపీ నేతలు సైతం తమ తమ రాజకీయ ప్రాధాన్యాలకు అనుగుణంగా ముందుకు పోతున్నాయి. ఈ క్రమంలో.. బీజేపీ నేతలు ఈ నెల 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా.. పార్టీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను రాష్ట్రానికి రప్పిస్తున్నారు. ప్రస్తుతానికి అందిన సమాచారం ప్రకారం.. ఆయన రాక ఖరారైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ రాసిన…
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బండి సంజయ్ వాడిన సర్జికల్ స్ట్రైక్స్ అన్న పదం.. ఎంతటి ప్రభావాన్ని కలిగించిందో మనం ప్రత్యక్షంగా చూశాం. బీజేపీ అనూహ్య ఫలితాలను సొంతం చేసుకుని.. జీహెచ్ఎంసీలో బలం పుంజుకున్న తీరును సైతం గమనించాం. ఇదే ఒరవడిని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముందుకు తీసుకుపోతున్నట్టుగా కనిపిస్తోంది. తాజాగా.. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో నిర్వహించిన పాదయాత్రలో ఆయన చేసిన వ్యాఖ్యలు.. ఇందుకు నిదర్శనం. ఉత్తరప్రదేశ్ లో మాదిరిగా.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే.. వెంటనే…
సిద్దిపేట జిల్లా : కేసీఆర్ ప్రత్యేక చొరవతోనే తెలంగాణలో నీలి విప్లవానికి శ్రీకారమని మంత్రి హరీష్ రావు అన్నారు. సిద్దిపేట జిల్లా రంగనాయక సాగర్ లో చేప పిల్లలను విడుదల చేసి… రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టే చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు మంత్రులు హరీష్ రావు ,తలసాని శ్రీనివాస్ యాదవ్. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో మత్స్యరంగానికి ఊపిరి పోసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని… సీఎం కేసిఆర్ ప్రత్యేక…
తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షల కారణంగా శ్రీశైలం జలాశయానికి మళ్ళీ వరద నీరు పెరుగుతుంది. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఇన్ ఫ్లో 1,54,997 క్యూసెకులు ఉండగా ఔట్ ఫ్లో మాత్రం 56,635 క్యూసెక్కులుగా ఉంది. శ్రీశైలం పూర్తి స్థాయి నీటి మట్టం 885.00 అడుగులు కాగా ప్రస్తుతం 876.50 అడుగులుగా ఉంది. పూర్తిస్దాయి నీటి నిల్వ 215.8070 టిఎంసీలు కాగా ప్రస్తుతం 170. 6640 టీఎంసీలు ఉంది. అయితే ప్రస్తుతం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్…
ఢిల్లీ : నేడు రాహుల్ గాంధీ తో తెలంగాణ కాంగ్రెస్ నేతల కీలక సమావేశం జరుగనుంది. ఈ సమావేశం లో తెలంగాణ లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పై చర్చించనున్నారు నేతలు. అలాగే… తెలంగాణలో ప్రజా సమస్యల పై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణ పై సమాలోచనలు చేయనున్నారు. ఇక ఈ నేపథ్యం లోనే ఈ రోజు మధ్యాహ్నం 3.30 గంటలకు రాహుల్ తో సమావేశం కానున్నారు తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. పిసిసి…
సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది. 8 రోజులుగా ఢిల్లీలో బిజీబిజీ గా ఉన్న సీఎం కేసీఆర్…. ఇవాళ మధ్యాహ్నం తర్వాత హైదరాబాద్ బయల్దేరనున్నారు. సెప్టెంబర్ 1 వ తేదీ నుంచి ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం కేసిఆర్…. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీతో సమావేశమై రాష్ట్ర సమస్యలు, అవసరాలు, కేంద్రం నుంచి ఆశిస్తున్న సహాయం పై విస్తృతంగా చర్చలు జరిపారు. ఇద్దరు కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలలో పాల్గొన్న తెలంగాణ సీఎం… కేంద్ర రహదారుల మంత్రి…
తెలంగాణలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్ర కొనసాగుతోంది.. ఇప్పటికే 100 కిలోమీటర్ల మైలురాయిని దాటేసింది.. ఇక, సంజయ్ పాదయాత్రలో కేంద్రమంత్రులు, బీజేపీ సీనియర్ నేతలు, ప్రజాప్రతినిధులు, మాజీ సీఎంలు.. ఇలా రోజుకో నేత పాల్గొంటున్నారు. ఇవాళ బీజేవైఎం నేషనల్ ప్రెసిడెంట్ తేజస్వి సూర్య.. సంజయ్ పాదయాత్రలో కొద్దిసేపు తెలుగులోకి మాట్లాడారు తేజస్వి సూర్య.. బండి సంజయ్ చేసేది పాదయాత్ర కాదు కేసీఆర్ మీద చేసే దండ యాత్ర అన్న ఆయన.. తెలంగాణ వచ్చినప్పుడు కేసీఆర్…
ప్రజా సంగ్రామ యాత్ర కి కేంద్ర నాయకత్వం మద్దతు పూర్తిగా ఉంది అని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.ఈ ముఖ్యమంత్రి ఢిల్లీ వెళ్లి పొర్లు దండాలు పెట్టడం కాదు.. ఇచ్చిన హామీలు అమలు చెయ్యాలి. ఎక్కడికి వెళ్లినా ప్రజలు టీఆర్ఎస్ హామీలు గుర్తు చేస్తున్నారు అని చెప్పిన బండి సంజయ్ తెలంగాణ వచ్చిన తర్వాత విమోచన దినోత్సవం ను ఎందుకు జరపడం లేదు అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 17 నిర్వహించే సభకి కేంద్ర హోంమంత్రి…
కార్వీ ఎండీ పార్థసారథిని… చంచల్గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ ఎకనామిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు. పీటీ వారంట్ వేసి కస్టడీలోకి తీసుకున్నారు. ఈనెల 9 వరకు పార్థసారథిని కస్టడీకి అనుమతించింది కోర్టు. మరోవైపు ఇవాళ జైలులో ఈడీ విచారణ ముగిసింది. ఈడీ విచారణ ముగిసిన తర్వాతే పార్థసారథిని కస్టడీలోకి తీసుకున్నారు సైబరాబాద్ పోలీసులు. కాగా, కార్వీ కన్సల్టెన్సీ అక్రమాలను పాల్పడినట్టు అభియోగాలున్నాయి.. రూ.780 కోట్లు ఖాతాదారుల నెత్తిన కుచ్చుటోపీ పెట్టినట్లు నిర్ధారించారు. రూ.720 కోట్ల…