తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతూ, తగ్గుతూ ఉన్నాయి. రాష్ట్ర వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం… గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 329 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. కరోనా తో ఒక్కరు మృతిచెందారు.. ఇక, 307 మంది కోవిడ్ బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,60,471 కు చేరగా.. రికవరీ కేసులు 6,51,085 కు పెరిగాయి.. ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య…
హుజూరాబాద్ ఉప ఎన్నిక ఎందుకు వచ్చింది. ఈ ఎన్నికల్లో ఎవరి గెలిస్తే మేలు జరుగుతాదో ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఈ ఎన్నికల్లో ఈటల రాజేందర్ పెద్ద నాయకుడు కావాలని తన స్వార్థం కోసం ఎన్నిక తీసుకొచ్చిండు అని మంత్రి హరీష్ రావు అన్నారు. తాజాగా జమ్మికుంట పట్టణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ… బీజేపీకి ఓటు వేస్తే ఇప్పుడున్న గ్యాస్ ధర వెయ్యి నుండి పదిహేను వందలు అవుతాది. బీజేపీ ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మి…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల జాబితాలో మొదట వినిపించే పేరు బండ్ల గణేష్. అయితే తాను అభిమానిని కాదు అని.. భక్తుడినని బండ్ల గణేష్ ఎప్పుడు చెప్తుంటాడు. కానీ ప్రజల కోసం ఓ పార్టీని స్థాపించి గత ఎన్నికలో పవన్ పోటీ చేయగా… బండ్ల గణేష్ మాత్రం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవకపోతే అది కోసుకుంటా.. ఇది కోసుకుంటా అంటూ మాట్లాడి.. తీరా ఎన్నికలో ఓడిన తర్వాత పార్టీనుండి తప్పుకున్నాడు. ఇక తాను…
రాష్ట్రంలో త్వరలో జరుగబోయే హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకు చావోరావో అన్నట్లుగా మారింది. ఇక్కడ పోటీ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్యే నడుస్తోందని భావించినా అనుహ్యంగా కాంగ్రెస్ కూడా రేసులోకి వచ్చింది. కాంగ్రెస్ కేవలం సెకండ్ ప్లేస్ కోసమే పోటీ పడుతుండగా టీఆర్ఎస్, బీజేపీలు మాత్రం గెలిచి సత్తాచాటాలని ఉవ్విళ్లురుతున్నాయి. ఈ నేపథ్యంలోనే హూజురాబాద్ వేదికగా ఈ రెండు పార్టీలు పొలికల్ హీట్ ను పెంచుతున్నాయి. ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన సీఎం కేసీఆర్ బీజేపీని ప్రస్తుతం…
బీజేపీకి ఓటు వేస్తే లాభం జరుగుతుందా.. టీఆర్ఎస్ కి ఓటు వేస్తే లాభం జరుగుతుందా ఆలోచించాలి అని ప్రజల్ని ఆర్థిక మంత్రి హరీశ్ రావు కోరారు. పని చేసిన వాళ్ళు ఎవరూ.. చేయగలిగేవారు ఎవరు ఆలోచించాలి. కళ్యాణలక్ష్మీని కొంతమంది పరిగెరుకున్నట్లు అని విమర్శిస్తున్నారు. రాష్ట్రంలో 57 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరికి త్వరలోనే పెన్షన్ అందుతుంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలను అమాంతం పెంచుతోంది. దొడ్డు వడ్లు కొనమని కేంద్రం చెబుతోంది. వీణవంకలో ఓట్లు అడిగే ముందు…
తెలంగాణ పీసీసీకి కొత్త అధ్యక్షుడు, కొత్త కమిటీల నియామకం తర్వాత తొలిసారి హస్తినబాట పట్టారు నేతలు.. ఏఐసీసీ ఆదేశాల మేరకు ఢిల్లీ వెళ్లిన టి. కాంగ్రెస్ నేతలు.. రాహుల్ గాంధీతో సమావేశం అయ్యారు.. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఇతర నేతలు హాజరయ్యారు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితిపై చర్చిస్తున్నట్టుగా తెలుస్తోంది.. తెలంగాణలో ప్రజా సమస్యలపై ఆందోళనలు, పార్టీ పటిష్టం కోసం కార్యాచరణపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. ఈ…
రాయలసీమ ఎత్తిపోతల కేసులో మరోసారి విచారణ జరిపింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జీటీ).. ఇవాళ విచారణ సందర్భంగా.. కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎన్జీటీకి నివేదిక అందజేసింది.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలాన్ని సందర్శించిన కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు చెందిన శాస్త్రవేత్త పసుపులేటి డా. సురేష్ బాబు.. రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు స్థలం వద్ద ఎలాంటి పనులు జరగడం లేదని.. ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకువచ్చిన సామగ్రి అంతా ఆ ప్రాంతంలో నిల్వ ఉంచారని ఎన్జీటీ…
టీఆర్ఎస్, బీజేపీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ.. బండి మీద కారు ప్రయాణిస్తోందంటూ కామెంట్ చేసిన ఆయన.. బీజేపీ, టీఆర్ఎస్ కు అవగాహన ఉందన్నారు.. తెలంగాణ విమోచన దినోత్సవం జరపటం ఇద్దరకీ ఇష్టం లేదని.. ఈ విషయంలో బీజేపీ, టీఆర్ఎస్ కు నార్కోటిక్ టెస్ట్ చేయాలని వ్యాఖ్యానించారు. ఇక, తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవానికి బీజేపీ మతం రంగు పులుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు నారాయణ.. విమోచన దినోత్సవం గురించి మాట్లాడే అర్హత కమ్యూనిస్టులకు మాత్రమే…
పద్దెనిమిది నెలల తరువాత తెలంగాణాలో మళ్ళీ ఈ నెల 1వ తారీఖు నుంచి స్కూల్స్ తెరుచుకున్నాయి. అయితే హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పుతో విద్యార్థులు స్కూల్స్ కి ఖచ్చితంగా హాజరు కావాల్సిన అవసరం లేకుండా పోయింది.గ్రేటర్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో 5,526 ప్రైవేటు.. 2,249 గవర్నమెంట్ స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 16 లక్షల మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. వీరిలో తొలి రోజు చాలాచోట్ల విద్యార్థుల హాజరు నామమాత్రంగానే కనిపించింది. సుమారు 21.77 శాతం మంది…
హుజురాబాద్ ఉప ఎన్నికలు జరగనున్న తరుణంలో.. కాంగ్రెస్ పార్టీని వీడి.. అధికార టీఆర్ఎస్లో చేరారు పాడి కౌశిక్ రెడ్డి.. ఆ తర్వాత గవర్నర్ కోటాలో కౌశిక్ రెడ్డిని శాసన మండలికి పంపనున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్.. దీనిపై నిర్ణయం తీసుకున్న తెలంగాణ కేబినెట్.. గవర్నర్ తమిళిసై ఆమోదం కోసం ఆ ఫైల్‌ను రాజ్‌భవన్‌కు కూడా పంపించారు. అయితే, గవర్నర్ కోటాలో పాడి కౌశిక్ రెడ్డి పేరును ఎమ్మెల్సీగా ప్రభుత్వం సిఫార్సు చేయడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ప్రభుత్వంపై…