తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 33,506 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 162 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 214 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,877 కి చేరగా.. రికవరీ కేసులు…
హుజూరాబాద్‌లో రాజకీయ యుద్దం మొదలైంది. ప్రచార పర్వం వాడి వేడిగా సాగుతోంది. బీజేపీ , టీఆర్ఎస్ హోరా హోరీ తలపడుతున్న ఈ పోరులో ఓటరు ఎటువైపు? నోటిఫికేషన్ రాక ముందు నుంచే ఇక్కడ ఎన్నికల వేడి మొదలైంది. ఓ వైపు అధికార పార్టీ గెలుపు మంత్రంగా ప్రభుత్వ పథకాలను ఓటరు చెంతకు తీసుకుపోతోంది. మరోవైపు, దగాపడ్డ తెలంగాణ బిడ్డలా ..ఆత్మగౌరవం అంటూ నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్. మరి ఈటల వైపు సానుభూతి పవనాలు…
పింఛన్ల దరఖాస్తు గడువును మళ్లీ పొడిగించింది తెలంగాణ ప్రభుత్వం… గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 57 ఏళ్లు నిండిన పేదలందరికీ ఆసరా వృద్ధాప్య పింఛన్లు అందించడానికి సిద్ధం అవుతుతోన్న సర్కార్.. అందులో భాగంగా ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని చేపట్టింది.. ప్రభుత్వం పెట్టిన గడువు ప్రకారం.. గత నెలలోనే గడువు ముగిసిపోగా.. మరో అవకాశం కల్పించాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు సీఎస్ సోమేష్ కుమార్.. మీసేవ కేంద్రాల్లో ఈ నెల 11వ తేదీ…
తెలంగాణ లో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశాల నుండి అనేక కంపెనీలు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బంజారాహిల్స్ లోని రోడ్ నెంబర్ 14లో క్రిస్సమ్ -ఫర్నీచర్, ఇంటీరియర్ షోరూంను ఎమ్మెల్సీ కవిత ఈ రోజు ప్రారంభించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్ఐపాస్, సింగిల్ విండో అనుమతులు లాంటి అనేక చర్యలతో పారిశ్రామిక ప్రగతి పరుగులు పెడుతోందని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులకు ఎమ్మెల్సీ కవిత శుభాకాంక్షలు తెలిపారు.…
జోగుళాంబ గద్వాల జిల్లా ఐజ మండలం కొత్తపల్లి లో భారీ వర్షాల కారణంగా ఇవాళ ఉదయం గోడ కూలి.. ఐదుగురు మృతి చెందారు. అయితే.. కొత్తపల్లి ఘటనపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డి కి ఫోన్ చేసి దుర్ఘటనపై ఆరాతీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. మృతులు ఒక్కొక్కరికీ రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించాలని అదేశాలు జారీ చేశారు సీఎం కేసీఆర్. ఇక సీఎం కేసీఆర్ ఆదేశాలపై స్పందించిన మంత్రి…
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక్కోచోట ఉప ఎన్నికలు జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో తెలంగాణలోని హుజూరాబాద్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇక్కడ పోరు ఉత్కంఠగా మారింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లోని కడపలో జిల్లాలోనూ ఉప ఎన్నిక జరుగుతోంది. వైసీపీకి చెందిన బద్వేల్ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య అకాల మృతితో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమేననే టాక్ విన్పిస్తోంది. తెలంగాణలోని హుజూరాబాద్ లో ఐదు…
తెలంగాణలో కరోనా కొత్త కేసుల సంఖ్య మరింత కిందకు దిగివచ్చింది.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,166 శాంపిల్స్ పరీక్షించగా.. 190 మందికి పాజిటివ్‌గా తేలింది.. ఇవాళ మరో వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందగా.. 245 మంది కరోనాబాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,67,725 కు చేరగా.. రికవరీ కేసులు 6,59,508 కి పెరిగాయి. ఇక, ఇప్పటి వరకు కోవిడ్‌తో…
తెలంగాణ బీజేపీలో పాత కమలనాథులు ఇక ఫేడ్ అవుటేనా? పార్టీ పరంగా ఇక గుర్తింపు లేనట్టేనా? పాతవాళ్లను పక్కన పెట్టి.. కొత్త వాళ్లను అందలం ఎక్కించడంపై కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పార్టీ ఇస్తున్న సంకేతాలేంటో నాయకులకు అర్థం కావడం లేదా? బీజేపీ పాత నేతలు ఢిల్లీ పెద్దల దృష్టిలో ఉన్నారా?కమిటీలో ఆరుగురికి చోటిస్తే.. ఐదుగురు కొత్తవారే..! బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యలు ప్రకటన తెలంగాణ కాషాయ సేనలో సెగలు రేపుతోంది. పార్టీలో పదవులు పేరు…
తెలంగాణలో జనసైనికులతో పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం ఏర్పాటు చేశారు. చాలా రోజుల తరువాత తెలంగాణలో కార్యకర్తలతో, నాయకులతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 2009 లో తెలంగాణలో సంపూర్ణంగా తిరిగానని అన్నారు. తనను దెబ్బకొట్టేకొద్దీ మరింత ఎదుగుతానని తెలిపారు. అన్నింటికీ సిద్ధపడే రాజకీయాల్లోకి వచ్చినట్టు పవన్ తెలిపారు. ఈ నేల తనకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చిందని అన్నారు. బలమైన సామాజిక మార్పుకోసం ప్రయత్నిస్తానని అన్నారు. తెలంగాణ ప్రజలు కోరుకున్నప్పుడు…