జలసౌధలో ఈరోజు ఉదయం 11 గంటలకు కేఆర్ఎంబి సమావేశం జరగనుంది. 14 నుంచి గెజిట్ అమలు నేపథ్యంలో బోర్డ్ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసింది. కృష్ణ బేసిన్ లోని తెలంగాణ 7 ప్రాజెక్ట్స్ ఆంధ్రప్రదేశ్ 22 ప్రాజెక్ట్స్ బోర్డ్ పరిధిలోకి వెళ్లనున్నవి. జలవిద్యుత్ ని గెజిట్ ప్రకారం బోర్డు పరిధిలోకి తీసుకురావడం పై తెలంగాణ అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. కృష్ణ పై విద్యుత్ పంపుహౌస్ లను బోర్డ్ పరిధిలోకి ఇవ్వాలని కోరిన ఆంద్రప్రదేశ్… తెలంగాణ విద్యుత్ పేరిట…
తెలంగాణ కరోనా కేసులు రోజు రోజు తగ్గుముఖం పడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 40, 354 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 183 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో ఇద్దరు వ్యక్తులు కోవిడ్ బారినపడి మృతిచెందాడు. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,68,070 కి చేరగా.. రికవరీ కేసులు 6,59,942 కి పెరిగాయి.. ఇక,…
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేషన్లు దాఖలవ్వగా అందులో 9 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో బద్వేల్లో 18 మంది బరిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు.…
టెన్త్ పరీక్షా పేర్లను కుదించారు. ఈ ఏడాది పదో తరగతిలో ఆరు పరీక్షలే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు పదో తరగతి పరీక్షల విధానంపై విద్యాశాఖ కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. 11 పేపర్లకు బదులుగా ఆరు పరీక్షలే నిర్వహించాలని నిర్ణయించినట్టు ఉత్తర్వుల్లో తెలిపారు. ఒక్కో సబ్జెక్టుకు ఒక పరీక్షే నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలిపారు. అలాగే.. ఈ సారి పరీక్ష సమయం 2 గంటల 45 నిమిషాల నుండి 3…
తెలంగాణ రాష్ట్ర స్పీకర్ పోచారం కాన్వాయ్ ల్లోని పోలీసు వాహనం ఢీకొని దురదృష్టవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందాడు. అధికారిక కార్యక్రమాలలో పాల్గొనడానికి స్పీకర్ పోచారం హైదరాబాద్ నుండి బాన్సువాడకు వెళ్ళుతున్న సమయంలో మేడ్చల్ సమీపంలోని కాళ్ళకల్ వద్ద ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు సమాచారం అందుతోంది. ఈ ప్రమాద సమయంలో స్పీకర్ పోచారం వేరే వాహనంలో సంఘటన స్థలానికి దూరంగా ఉన్నాట్లు అధికారులు చెబుతున్నారు. ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే తక్షణమే.. బాధితునికి వైద్య సహాయం…
యూపీ లో బీజేపీ నేతలు రైతులను రాక్షసంగా చంపేసింది అని రేవంత్ రెడ్డి అన్నారు. దీని పై మోడీ అమిత్ షా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇది కాంగ్రెస్ సమస్య కాదు 80శాతం మంది రైతుల సమస్య. 80కోట్లమంది రైతులను బానిసలుగా మార్చే కుట్ర చేశారు. రైతుకు మరణ శాసనం రాసే చట్టాలు చేశారు. రైతులు తిరగబడి ఎర్రకోట పై జెండా ఎగరేశారు. కేసీఆర్ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించినట్లు చెప్పారు. ఢిల్లీకి వెళ్లి వచ్చిన తరువాత కేసీఆర్ కు…
తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలకు తెరదించాలన్న ఉద్దేశంతో కృష్ణానది యాజమాన్యబోర్డు, గోదావరి నది యాజమాన్య బోర్డుల పరిధిని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం.. దీనిపై గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.. ఈ నెల 14వ తేదీ నుంచి అమలు చేయాలని నిర్ణయించింది.. ఇప్పటికే రెండు బోర్డులు దీనిపై కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. ఈ నెల 14వ తేదీ నుంచి అమల్లోకి రానున్న గెజిట్ నోటిఫికేషన్ అమలు వాయిదా వేయాలని కోరుతోంది తెలంగాణ ప్రభుత్వం… గోదావరి నదిపై ఉన్న పెద్దవాగు…
తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సతీష్‌చంద్ర ప్రమాణస్వీకారం చేయించారు.. ఇవాళ రాజ్‌భవన్‌లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ సతీష్చంద్రచే రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రమాణం చేయించారు.. ఈ కార్యక్రమానికి స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, సీఎం కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, సీఎస్ సోమేష్ కుమార్ తదితరులు హాజరయ్యారు… కాగా, దేశవ్యాప్తంగా 13 హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేశారు. సెప్టెంబర్ 16న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు…
గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం ఇప్పటికే సమావేశం అయ్యింది.. జీఆర్ఎంబీ సభ్య కార్యదర్శి బీపీపాండే నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. ఈ నెల 14 నుంచి గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చించారు.. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకోవడంపై సమాలోచనలు చేవారు.. కృష్ణా, గోదావరి బోర్డుల పరిధిపై కేంద్రం ఇచ్చిన గెజిట్ నోటిఫికేషన్ అమలు దిశగా అడుగులు వేసేందుకు సిద్ధమైంది.. మొదటి దశలో అయిదు ప్రాజెక్టుల పరిధిలోని 29 కేంద్రాలను…
ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్‌రాజ్‌పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు…