ఆర్.కృష్ణయ్యకు బెదిరింపు కాల్స్.. హోంమంత్రి, డీజీపికి ఫిర్యాదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు. రెండు రోజులుగా అయితే ఈ కాల్స్ మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
Read Also: కొత్త మద్యం పాలసీ ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ ప్రభుత్వం
Also Read
హుజురాబాద్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చినందుకు గత రెండు రోజుల్లో తనకు వెయ్యికి పైగా బెదిరింపు కాల్స్ వచ్చినట్లు ఆర్.కృష్ణయ్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫోన్‌ల వెనుక ఎవరు ఉన్నారో తేల్చాలని హోంమంత్రి, డీజీపీకి వినతిపత్రం ఇచ్చానని ఆయన వెల్లడించారు. కొన్ని శక్తులు తనపై బురద జల్లడానికి ప్రయత్నిస్తున్నాయని.. తాను భయపడే రకాన్ని కాదన్నారు. గత 40 ఏళ్లుగా తాను బీసీల అభ్యున్నతికి పనిచేస్తున్నట్లు స్పష్టం చేశారు.
తాజావార్తలు
-
Indian Railway: రైళ్లలో టికెట్ లేని ప్రయాణికులకు షాక్.. భారీగా జరిమానాలు..
-
Story Board : నేపాల్ ఆకస్మిక వరదలకు కారణాలేంటి..? చైనా నిర్లక్ష్యం ఎంతవరకు ఉంది..?
-
OTR: ఎమ్మెల్యే, ఎంపీ.. మధ్యలో సూర్యలంక బీచ్!
-
OTR: ఆ నేతకు పీఏ పోట్లు.. ఆ ఎమ్మెల్యే చుట్టూ నడుస్తున్న అసలు డ్రామా!
-
OTR: సొంత పార్టీ నేతలకే టార్గెట్ అవుతున్న తెలంగాణ బీజేపీ సోషల్ మీడియా!
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!