ఈ నెల 25 న ప్లీనరీలో పార్టీ అధ్యక్షున్ని ఎన్నుకుంటామని.. గులాబీ దుస్తులు ధరించి ప్రతినిధులు ప్లీనరీకి రావాలని టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ… దశాబ్దాల తెలంగాణ కలను టీఆర్ఎస్ సాకారం చేసిందని.. బాబా సాహెబ్ అంబేద్కర్ చెప్పిన బోధించు సమీకరించు పోరాడు అన్న మాటల స్ఫూర్తితో ఉద్యమాలను కొనసాగించామని తెలిపారు. 14 ఏళ్ల పాటు…
తెలంగాణ రాష్ట్రంలోని పోడు భూముల సమస్య పరిష్కారం పై సీఎం కేసీఆర్ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. కాసేపటి క్రితమే ప్రగతి భవన్ లో ప్రారంభమైన ఈ సమీక్షా సమావేశంలో అడవుల పరి రక్షణ, హరిత హారంపై చర్చిస్తున్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం కోసం కార్యాచరణ రూపొందించనున్నారు. అడవులు అన్యాక్రాంతం కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై, హరిత హారం ద్వారా విస్తృత ఫలితాల కోసం ప్రణాళికలపై చర్చించనున్నారు. పోడు సమస్యపై అటవీ, గిరిజన సంక్షేమ శాఖల…
హుజురాబాద్ ఉప ఎన్నికలు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి.. విమర్శలు, ఆరోపణల పర్వం కొనసాగుతోంది.. ఈ నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్.. మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్, టి.పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి రహస్యంగా కలిశారని ఆరోపించారు కేటీఆర్.. అన్ని ఆధారాలున్నాయని.. ఉప ఎన్నికలో బీజేపీ-కాంగ్రెస్ పార్టీ కుమ్మక్కయ్యాయని మండిపడ్డారు. హైటెక్స్ లో టీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. కాంగ్రెస్…
యాదాద్రి నిర్మాణం పై విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర సరస్వతీ స్వామి ఆసక్తి కర వ్యాఖ్యలు చేశారు. యాదాద్రి నిర్మాణం నేపథ్యంలో సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారని కొనియాడారు.. తెలంగాణలో మత సామరస్యంతో కేసీఆర్ పాలన సాగుతోందన్నారు స్వరూపానందేంద్ర. రాజుల కాలం తర్వాత నిర్మాణమైన అద్భుతమైన దేవాలయం యాదాద్రి అని… సనాతన ధర్మాన్ని గుర్తించి యాదాద్రిని సీఎం కేసీఆర్ మహా క్షేత్రం గా తీర్చిదిద్దారని ప్రశంసలు కురిపించారు. సీఎం కేసీఆర్ మైలురాళ్లలో తెలంగాణ సాధనతో పాటు…
తెలంగాణలో ఎన్నికలు వచ్చాయంటే చాలు అధికార టీఆర్ఎస్ పార్టీని ‘చపాతీ రోలర్’ వెంటాడుతూనే వస్తోంది.. స్వతంత్ర అభ్యర్థులకు ఎన్నికల కమిషన్ కేటాయించే ‘రొట్టెల పీట’ (చపాతీ రోలర్) కారు గుర్తుకు తలనొప్పిగా మారుతోంది. ఇప్పటికే తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో పలు నియోజకవర్గాల్లో దీని ప్రభావం స్పష్టంగా కనిపించింది. కొన్ని నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల ఓటమి ప్రధాన కారణం ఈ చపాతీ రోలరే అని నిర్ధారణకు వచ్చిన టీఆర్ఎస్ నేతలు.. అంతే కాదు, దుబ్బాక బై…
తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 42,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా… కొత్తగా 193 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి.. మరో వ్యక్తి కోవిడ్ బారినపడి మృతిచెందాడు.. ఇదే సమయంలో.. 196 కోవిడ్ బాధితులు కోలుకున్నట్టు బులెటిన్‌లో పేర్కొంది సర్కార్.. దీంతో.. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,69,932 కి చేరగా.. రికవరీ కేసులు…
గెల్చిన ఎమ్మెల్యే.. ఓడిన అభ్యర్థి ఇద్దరూ ప్రస్తుతం ఒకే పార్టీ. ఎవరి పదవి వాళ్లదే. అంతా బాగానే ఉన్నా.. వచ్చే ఎన్నికల్లో ఎవరికి అసెంబ్లీ టికెట్ ఇస్తారు? సిట్టింగ్ ఎమ్మెల్యేకు ఛాన్స్ ఉంటుందా? లేక ముందు నుంచీ పార్టీలో ఉన్న నేతను పిలుస్తారా? ఈ అంశం చుట్టూనే ఆసిఫాబాద్‌లో వాడీ వేడీ చర్చ జరుగుతోందట. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆసిఫాబాద్ టీఆర్ఎస్లో ఆధిపత్యపోరు..! ఈయన పేరు ఆత్రం సక్కు. కొమురం భీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే. 2018లో…
రాజకీయాల్లో గెలుపు కీలకం. లేదా చేతిలో ఏదైనా పదవి ఉండాలి. అవేమీ లేకపోతే ఎవరూ పట్టించుకోరు. ప్రస్తుతం టీఆర్ఎస్లో అలాంటి నాయకుల పరిస్థితి దుర్భరంగా మారిందట. ఒకప్పుడు వెలుగు వెలిగినా.. ఒకే ఒక్క ఓటమి పొలిటికల్ స్క్రీన్‌పై లేకుండా చేసేసింది. పార్టీ కార్యక్రమాల్లోనూ వారి పాత్ర లేకుండా పోయిందా? సన్నాహక సమావేశాల్లో కనిపించని ఓడిన ముఖ్య నేతలు..! టీఆర్ఎస్ ప్రయాణం ప్రారంభమై 20 ఏళ్లు. ఈ సందర్భంగా భారీ శక్తి ప్రదర్శనకు సిద్ధమవుతోంది పార్టీ. ముందుగా ప్రజాప్రతినిధుల…
తెలంగాణ ఇంటర్ పరీక్షల విషయంలో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దు చేయాలని తల్లిదండ్రుల సంఘం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం నాడు హైకోర్టు అత్యవసర విచారణ జరిపింది. అక్టోబర్ 25 నుంచి పరీక్షలు ఉండగా ఇప్పుడు పిటిషన్ వేస్తే ఎలా? అని హైకోర్టు పిటిషన్ దారులను ప్రశ్నించింది. చివరి నిమిషంలో ఇంటర్ పరీక్షలపై జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షలను ఆపలేమని న్యాయస్థానం తేల్చి చెప్పింది. యథావిధిగా పరీక్షలు నిర్వహించుకోవచ్చని…
రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కూడా దొరకని పరిస్థితి వచ్చింది.. అయితే, ఏ పంట పడితే అది వేసి.. నష్టాలు చవిచూడొద్దని చెబుతున్నారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి.. ఈ యాసంగిలో మినుములు సాగు చేయాలని రాష్ట్ర రైతాంగానికి విజ్ఞప్తి చేశారు.. యాసంగిలో మినుములు విరివిగా సాగు చేయాలని కోరిన ఆయన.. పూర్తి స్థాయిలో మార్క్ ఫెడ్ ద్వారా మినుముల కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.. రైతులు వెంటనే మినుములను విత్తుకోవాలని.. మినుముల…