తెలంగాణలో ఆంత్రాక్స్ చాప కింద నీరులా విస్తరించే ప్రమాదం పొంచి ఉంది. వరంగల్ జిల్లాలో ఆంత్రాక్స్ కలకలం రేపుతోంది. దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు గొర్రెలు చనిపోయాయి. గొర్రెల వరుస మరణాలను ఆంత్రాక్స్ కారణమని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. సాంబయ్య అనే వ్యక్తి పెంచుకుంటున్న గొర్రెల మందలో కొన్నిరోజులగా రోజుకొక గొర్రె చనిపోతుండటంపై పలువురు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని స్థానికులు పశువైద్యాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో వైద్యులు చనిపోయిన…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు సంఖ్య తగ్గుతూ వస్తుంది… వైద్య, ఆరోగ్యశాఖ తాజాగా విడుదల చేసిన బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలో గత 24 గంటల్లో 179 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.. మరో ఇద్దరు కరోనా బాధితులు మృతిచెందగా… ఇదే సమయంలో 104 మంది బాధితులు కోలుకున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.. తాజా కేసులతో కలుపుకొని రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,70,453కు చేరుకోగా.. ఇందులో 6,62,481 మంది బాధితులు కోలుకున్నారు.. ఇక, కోవిడ్…
హైదరాబాద్ వేదికగా జరిగిన గులాబీ పండుగ (టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ) సమావేశాలు ముగిశాయి… దాదాపు 8 గంటలపాటు వివిధ అంశాలపై చర్చ సాగింది.. మొత్తం 7 తీర్మానాలపై ప్లీనరీలో చర్చించింది ఆమోదం తెలిపారు.. అందులో కీలకమైనది పార్టీ బైలాస్‌లో పలు సవరణలకు ప్లీనరీ ఆమోదించడం.. పార్టీ ప్రెసిడెంట్ అందుబాటులో లేకపోతే వర్కింగ్ ప్రెసిడెంట్ బాధ్యతలు నిర్వహించేలా తీర్మానం చేశారు.. దీంతో.. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న కేటీఆర్‌కు మరిన్ని పవర్స్ ఇచ్చినట్టు అయ్యింది.. ఇక, బీసీ గణన,…
హుజురాబాద్ అసెంబ్లీ బై ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతూనే ఉంది.. సీఎం కేసీఆర్, మంత్రి హరీష్‌రావును టార్గెట్ చేస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు మాజీ పార్లమెంటు సభ్యులు, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు విజయశాంతి.. ఢిల్లీలో దళిత ఉద్యోగులను అత్యంత దారుణంగా బూతులు తిట్టి, చెయ్యి చేసుకుని, కొట్టి అవమానించిన హరీష్ రావుకు హుజూరాబాద్ ఎన్నికల బాధ్యత అప్పగించడం సిగ్గు చేటు అంటూ ఫైర్ అయిన రాములమ్మ… హరీష్ రావు దళిత…
అబాది జమ్మికుంటలో యూత్ మీటింగ్ కి ముఖ్య అతిథిలుగా ఈటల రాజేందర్, ఎమ్మెల్యే రఘునందన్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ… యువత మీరే ఎన్నికల ప్రచారం భుజాలమీద వేసుకొని పనిచేయాలి. తెరాస మంత్రులు, ఎమ్మెల్యేలు భయపెట్టిన కూడా మన యువత భయపడడం లేదు. 27 తరువాత ఊర్లలో మీరే ఉంటారు. కెసిఆర్ డబ్బులు, మద్యం సీసాలు పాతర వేయల్సింది మీరే. మీరు కొట్టే దెబ్బ ఊహకు కూడా అందకూడదు. చరిత్రలో మంచి రాజులు, చెడ్డ…
తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి షాక్ తగిలినట్టు అయ్యింది.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పార్టీలో కొత్త జోష్ వచ్చిందని కొందరు నేతలు చెబుతున్నమాట.. ఇక, భారీ ఎత్తున పార్టీలోకి వలసలు ఉంటాయని కూడా ప్రచారం జరిగింది. కానీ, రేవంత్‌రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తోన్న మల్కాజ్గిరి పార్టీమెంట్ స్థానం పరిధిలోనే పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది.. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్.. పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను…
కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తి స్తుందని.. ఫైర్ అయ్యారు సీఎం కేసీఆర్. కేంద్ర ఎన్నికల సంఘంపై సీఎం కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసీ కూడా రాజ్యాంగ పరిధి దాటి ప్రవర్తిస్తుందని… మండిపడ్డారు. టీఆర్ఎస్ ఆర్థికంగా బలమైన శక్తిగా ఎదిగిందని.. 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్ లు టిఆర్ఎస్ కు ఉన్నాయని పేర్కొన్నారు సీఎం కేసీఆర్.…
టీఆర్ఎస్ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం లో అధికారికంగా ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ కె కేశవరావు. దీంతో ఏకంగా 9 వ సారి టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా సీఎం కేసీఆర్ ఎన్నిక అయ్యారు. ఇక అధ్యక్షులుగా ఎన్నికైన అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ… ఏక గ్రీవంగా తనను ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు చెప్పారు. తొలిసారి 2001 సంవత్సరంలో జల దృష్యంలో టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించామని చెప్పారు. రక…
తెలంగాణలో కరోనా కారణంగా వాయిదా పడిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలకు అంతా సిద్ధం అయింది. పరీక్షల కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొవిడ్ నిబంధనలను పాటిస్తూ పరీక్షలను నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అరగంట ముందే విద్యార్థులను కేంద్రంలోకి అనుమతిస్తారు. ఈ ఏడాది పరీక్షల నిర్వహణకు ప్రయోగాత్మకంగా మొబైల్ యాప్‌ను వినియోగించనున్నారు. ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. సెంటర్ల వద్ద ప్రతి…
కొత్తకోట దయాకర్ రెడ్డి దంపతులకు కొత్త కష్టమొచ్చిందా? సైకిల్ దిగేందుకు సిద్దపడినా.. ఏ పార్టీలో చేరాలో తెలియక సతమతం అవుతున్నారా? గ్రామాల్లో తిరుగుతూ.. రాజకీయ భవిష్యత్‌ను నిర్ణయించమని పార్టీ మారిన పాత కేడర్‌ను కోరుతున్నారా? ఇది ఎత్తుగడ.. ఇంకేదైనా వ్యూహం ఉందా? ఏ పార్టీలో చేరాలో చెప్పాలని గ్రామాల్లో అడుగుతున్నారట..! ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని మక్తల్, దేవరకద్ర నియోజకవర్గాల్లో రాజకీయ సందడి మొదలైంది. టీడీపీ ఆవిర్భావం నుంచి జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కొత్తకోట దయాకర్‌రెడ్డి,…