ప్రముఖ న్యూస్ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్నకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. సోమవారం సాయంత్రం జైలు నుంచి విడుదల కానున్నట్లు తెలుస్తోంది. ఓ జ్యోతిష్యుడిని బ్లాక్ మెయిల్ చేసి రూ.30 లక్షలు డిమాండ్ చేశారన్న ఆరోపణలతో తీన్మార్ మల్లన్న ఆగస్టులో అరెస్ట్ అయ్యారు. ఆ సమయంలో క్యూ న్యూస్ కార్యాలయంలో పోలీసులు సోదాలు జరిపి కొన్ని హార్డ్ డిస్కులు, డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. Read Also: శంషాబాద్ లో భారీగా విదేశీ కరెన్సీ పట్టివేత తీన్మార్ మల్లన్నపై ఇప్పటివరకు…
నిర్మల్ జిల్లాలో సర్కారీ దవాఖానాలో వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. భైంసా ఏరియా ఆసుపత్రిలో బాలింత మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే బాలింత మృతి చెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. కుభీర్ మండలం బెల్లామ్ తండా కు చెందిన రేఖ అనే మహిళ ఆదివారం ఆస్పత్రికి వచ్చింది. ఆమె మధ్యాహ్నం 3 గంటలకు డెలివరీకి రాగా అర్ధ రాత్రి నార్మల్ డెలివరీ అయింది. అనంతరం డాక్టర్లు, సిబ్బంది వెళ్ళిపోయారు. మగ బిడ్డ కు జన్మ నిచ్చిన రేఖ అనారోగ్యంతో కన్నుమూసింది.…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు పూర్తిగా తగ్గుముఖం పట్టలేదు. పలు చోట్ల ఇంకా డబుల్ డిజిట్‌లోనే కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత 24 గంటల్లో తెలంగాణ వ్యాప్తంగా కొత్తగా 122 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో 171 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 6,72,489కి చేరింది. కరోనా నుంచి 6,64,759 మంది కోలుకోగా మొత్తం 3,966…
రెండు తెలుగు రాష్ట్రాలకు మరో సారి వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. శ్రీలంక దగ్గర్లోని కొమరీన్ ఏరియాలో అల్పపీడనం కొనసాగుతోంది. 3 రోజుల పాటు తెలంగాణలో వర్షాలు దంచికొట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇప్పటికే 2 రోజులుగా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి. అకాల వర్షాలతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. పలు ప్రాంతాల్లో ధాన్యం రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఏపీలోనూ రానున్న 24…
తెలంగాణలో బస్సు ఛార్జీల మోత మోగనుందా? సామాన్యులపై నిత్యావసరాలకు తోడు బస్సు ఛార్జీలు కూడా భారం కానున్నాయా? అంటే అవుననే అనిపిస్తోంది. ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై త్వరలో నిర్ణయం వెలువడనుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అధికారులతో సమావేశం అయింది. ఖైరతాబాద్ రవాణా శాఖ మంత్రి కార్యాలయంలో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపుపై సమావేశం అయింది. సమావేశంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆఫీస్ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండి సజ్జనార్, ఆర్టీసీ ఉన్నతాధికారులు పాల్గొని వివిధ…
హైదరాబాద్ లో కలకలం రేపుతున్న డ్రగ్స్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. బాలానగర్ డ్రగ్స్ కేసులో ఎల్బీ నగర్ కోర్ట్ లో లొంగిపోయారు నిందితులు. గతంలో ఇంజనీరింగ్ స్టూడెంట్ సాయి కుమార్ నుండి డ్రగ్స్ ను సీజ్ చేశారు బాలానగర్ ఎక్సైజ్ పోలీసులు. సాయి కుమార్ కు డ్రగ్స్ ను సప్లై చేశారు నిందితులు రామకృష్ణ గౌడ్ , హనుమంత రెడ్డి. ఇద్దరు డ్రగ్స్ నిందితులను మూడు రోజులు పాటు కష్టడీ కి తీసుకున్నారు ఎక్సైజ్ పోలీసులు.…
టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి యూత్‌లో బాగా ఫాలోయింగ్ ఉంది. దీంతో ఆయన ఏ కార్యక్రమానికి పిలుపునిచ్చినా యువ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరవుతూ ఉంటారు. ఈనెల 8న (సోమవారం) టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన తన అభిమానుల కోసం ఓ ప్రకటన విడుదల చేశారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమలలోని వెంకటేశ్వర స్వామి దర్శనానికి వెళ్తున్నానని, అందువల్ల తాను కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు, అభిమానులకు అందుబాటులో ఉండటం లేదని.. ఈ విషయాన్ని…
తెలంగాణలో చలి పెరగనుంది. ఈశాన్య భారతం నుంచి చల్లని గాలులు వీస్తుండటంతో రానున్న మూడు రోజుల పాటు రాష్ట్రంలో చలి పెరిగే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఇప్పటికే పగటి పూట ఉష్ణోగ్రతలు సాధారణ సాయిలో నమోదవుతున్నాయని, ఎక్కడా పెద్దగా మార్పులు లేవని వివరించింది. అటు రాత్రి పూట కూడా ఉష్ణోగ్రతలు పడిపోయాయని తెలిపింది. Read Also: చలికాలం చర్మ సంరక్షణ ఎలా? శుక్రవారం రాత్రి ఆదిలాబాద్‌లో 16.6 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ…
బీసీ సంఘాల అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యకు కొంతమంది గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. దీంతో ఈ విషయంపై హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డికి ఆర్.కృష్ణయ్య ఫిర్యాదు చేశారు. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ యాదవ్‌కు మద్దతు ఇచ్చిన నాటి నుంచి తనకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయని ఆర్.కృష్ణయ్య ఆరోపించారు. తన ఫోన్ నంబర్‌ను సోషల్ మీడియాలో పెట్టి బెదిరింపులకు పాల్పడుతున్నట్లు ఆయన తెలిపారు.…
కొత్త మద్యం పాలసీ ఖరారు ఉత్తర్వులు జారీ చేసింది తెలంగాణ ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఫీజు లో మార్పు లేదు.. స్లాబ్స్ కూడా గతం లో లాగానే 6 ఉంటాయి అని తెలిపింది. లైసెన్స్ ఫీజు లో కూడా మార్పు లేదు. దరఖాస్తు ఫీజ్ 2 లక్షలు.. 6 స్లాబ్స్ ఉంటాయి. 5 వేల జనాభా వరకు 50 లక్షలు లైసెన్స్ ఫీ… 5 వేల 1 నుండి 50 వేల 55 లక్షలు… 50 వేల 1…