బట్టతలను కవర్ చేసి విగ్గూ పెట్టుకొన్ని మోసాలకు పాల్పడుతున్న కార్తీక్ వర్మ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో తానొక ఎన్ఆర్ఐ అంటూ…మహిళలను ట్రాప్ చేసేవాడు కార్తీక్. తన వివాహం కాలేదని చెప్పి విగ్గుతో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టేవాడు కార్తీక్ వర్మ. అయితే.. ఆ అందమైన కార్తీక్ వర్మ ఫోటోలు చూసి వలలో పడుతున్నారు అమ్మాయిలు. ఇప్పటి వరకు 20 మంది అమ్మాయిలను మోసం చేసిన కార్తీక్ వర్మ .. అమ్మాయిలతో…
సింగరేణి గనుల్లో మరో ప్రమాదం జరిగింది.. మంచిర్యాల జిల్లా నస్పూర్ మండలం శ్రీరాంపూర్ డివిజన్ ఎస్సార్పీ 3 గనిలో ఇవాళ ఉదయం గని పైకప్పు కూలిన ఘటనలో నలుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు.. ఈ ప్రమాదంలో గనిలోని 21 డిప్ 24 లెవల్, 3ఎస్పీ 2 సీం వద్ద గని పైకప్పు రక్షణ చర్యలు చేపడుతున్న టింబర్‌మెన్ బేర లచ్చయ్య, సపోర్ట్‌మెన్ వీ క్రిష్ణారెడ్డి, బదిలీ వర్కర్లు గడ్డం సత్యనర్సింహారాజు, రెంక చంద్రశేఖర్ మృతిచెందారు.. పై కప్పు…
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీష్‌రావుకు.. వైద్య, ఆరోగ్య శాఖ బాధ్యతలను కూడా అప్పగించారు సీఎం కేసీఆర్.. ఇక, ఇవాళ ఆరోగ్యశాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తన్నీరు హరీష్ రావును వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు మర్యాద పూర్వకంగా కలిశారు.. వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం.రిజ్వి, కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ వాకాటి కరుణ, ప్రజారోగ్య శాఖ డైరెక్టర్ డా. శ్రీనివాస రావు, వైద్య విద్యా శాఖ డైరెకర్ డా. రమేష్ రెడ్డి, ఓ.ఎస్.డి. గంగాధర్,…
ఎమ్మెల్యే కోటాలో టీఆర్ఎస్ పార్టీ ఎంపిక చేసే ఆ ఆరుగురు ఎమ్మెల్సీలు ఏవిట్లు? ఆరు సీట్లలో ఏ సామాజిక వర్గానికి ఎన్ని సీట్లు దక్కుతాయి? పార్టీలో ఇప్పుడు ఇదే చర్చ మొదలైంది. చట్టసభల్లో కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యత కల్పిస్తామని గతంలో సీఎం కేసీఆర్ మాటిచ్చారు. మరి ఇప్పుడా మాట ప్రకారమే అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారా? లేదా? అనే ఉత్కంఠ మొదలైంది.ఎమ్మెల్సీ ఎన్నికలపై టీఆర్ఎస్లో ఆసక్తికర చర్చ మొదలైంది. శాసనమండలికి ఎన్నిక కాబోతున్న ఆరుగురు ఎమ్మెల్సీలు ఎవరు?…
తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు ఓ రోజు పైకి.. మరో రోజు కిందికి కదులుతూనే ఉన్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 38,242 శాంపిల్స్ పరీక్షించగా.. 164 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.. మరో వ్యక్తి కోవిడ్‌తో చనిపోగా.. 171 మంది బాధితులు పూర్తిస్థాయిలో కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో.. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,72,987కు చేరగా.. రికవరీ కేసులు 6,65,272కు పెరిగాయి.. ఇక,…
కరోనా మహమ్మారి బారినపడి మృతిచెందినవారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం.. కోవిడ్ సోకి మరణించిన వారి కుటుంబాలకు రూ. 50 వేలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వనున్నట్లు తెలిపింది.. రాష్ట్ర విపత్తుల నిర్వహణ నిధుల నుంచి ఈ పరిహారం అందజేయనుండగా.. ఈ మేరకు మార్గదర్శకాలను జారీ చేసింది తెలంగాణ సర్కార్.. ఇక, కోవిడ్ డెత్ సర్టిఫికెట్ జారీ చేసేందుకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది ప్రభుత్వం.. మృతుల కుటుంబ సభ్యుల ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది..…
మరోసారి దేశవ్యాప్తంగా సిద్ధిపేట పేరు మార్మోగిపోయింది. ప్రసిద్ధి పేటగా… తెలంగాణ ఖ్యాతిని ఇనుమడింప జేసింది. సిద్ధిపేట శుద్ధిపేట అని మరోసారి చాటి చెప్పింంది. స్వచ్ సర్వేక్షన్ లో జాతీయ స్థాయి లో ఎంపిక అయిన సిద్ధిపేట పట్టణం. ఈ సందర్భంగా సిద్దిపేట ప్రజలకు మంత్రి హరీశ్ రావు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ విజయం సాధ్యమైందన్నారు. ఈ నెల 20వ తేదీన ఢిల్లీలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా సిద్ధిపేట మున్సిపల్ చైర్మన్ మంజుల…
మద్యం షాపుల కేటాయింపుల్లోనూ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం.. గౌడ్, ఎస్సీ, ఎస్టీలకు షాపుల కేటాయింపుల్లో రిజర్వేషన్లు కల్పించింది.. అయితే, మద్యం దుకాణాల కేటాయింపులో రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.. ఖమ్మం జిల్లాకు చెందిన రవికాంత్ ఈ రిజర్వేషన్లను సవాల్ చేస్తూ పిటిషన్ వేయగా.. హైకోర్టు అత్యవసర విచారణకు స్వీకరించింది.. కులాల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దని సుప్రీంకోర్టు తీర్పు ఉందన్న తన పిటిషన్లో పేర్కొన్నారు పిటిషనర్.. అయితే, ఈ కేసుపై విచారణ చేపట్టిన తెలంగాణ…
హైదరాబాద్‌లో మరో దారుణమైన ఘటన జరిగింది.. ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందని.. తనతో కాకుండో మరో వ్యక్తితో పెళ్లికి సిద్ధమవుతుందంటూ ఓ యువతిపై కత్తితో విచక్షణా రహితంగా దాడి చేశాడో యువకుడు.. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హస్తినాపురంలో జరిగిన దారుణమైన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వికారాబాద్ జిల్లా దౌలతాబాద్ మండలం చంద్రకల్‌కు చెందిన ఓ యువతి.. అదే ప్రాంతానికి చెందిన బస్వరాజ్ అనే యువకుడు గత కొన్నేళ్లుగా ప్రేమించుకున్నట్టుగా తెలుస్తోంది.. Read Also:…
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్రం వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారింది పరిస్థితి.. ఈ వ్యవహారంలో కేంద్రంపై సీఎం కేసీఆర్, మంత్రులు, టీఆర్ఎస్ నేతలు విమర్శలు గుప్పిస్తుంటే.. అదే రేంజ్లో కేంద్ర మంత్రుల నుంచి రాష్ట్ర బీజేపీ నేతల వరకు అంతా కేసీఆర్‌పై ఆరోపణలు చేస్తున్నారు. దీంతో.. కేంద్రం వైఖరి ఏంటి? రాష్ట్ర విధానం ఏంటి? అనే దానిపై గందరగోళ పరిస్థితి ఏర్పడుతోంది.. అయితే, యాసంగి ధాన్యం కొంటామని బీజేపీ నేతలు అధికారికంగా ఉత్తర్వులు తీసుకురావాలని డిమాండ్ చేశారు…