ఒకప్పుడు దొంగతనం చేయాలంటే.. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్లాలి.. బెదిరించో.. అదిరించో.. ఇంకో విధంగానో అందినకాడికి దండుకునేవారు… కానీ, ఆధునిక యుగంలో అంతా మారిపోయింది.. అంతా స్మార్ట్ అయిపోయారు.. చివరికి దొంగలు కూడా టెక్నాలిజీని ఉపయోగించి స్మార్ట్‌గా కొట్టెస్తున్నారు.. తాజాగా, గేట్ వే సంస్థపై సైబర్ ఎటాక్ జరిగింది.. అరగంట వ్యవధిలో కోటి 28 లక్షల రూపాయలు కాజేశారట కేటుగాళ్లు.. ఇంకా భారీగానే కొట్టేసే ప్రయత్నం చేయగా.. అలారం మోగడంతో అప్రమత్తమైన ఆ సంస్థ అధికారులు.. ఆ ప్రయత్నాని…
తెలంగాణలో పూర్వ వైభవం తెచ్చుకునేందుకు తెలంగాణ కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తోంది. 2014 తర్వాత పార్టీ పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతోంది. ఈమధ్యే జరిగిన హుజురాబాద్ ఉప ఎన్నికలో డిపాజిట్ కోల్పోయింది భారత జాతీయ కాంగ్రెస్. పార్టీ క్యాడర్ లో ఉత్తేజం నింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ నెల 14 నుండి 21 వరకు ఎన్నికల కోడ్ లోబడే.. కాంగ్రెస్ జన జాగరణ ప్రజా చైతన్య పాదయాత్ర లు నిర్వహించాలని పార్టీ నిర్ణయించింది. జిల్లా కలెక్టర్ ల పర్మిషన్ లు…
జనంతో బాగా గ్యాప్ వచ్చిందని ఆ జిల్లాలోని ఎమ్మెల్యే, ఎంపీలు ఆందోళన చెందుతున్నారా? మళ్లీ ప్రజలకు దగ్గర య్యేందుకు డివోషనల్ బాట పట్టారా? సడెన్‌గా ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? ఇంతకీ ఎవరా నాయకులు? ప్రజాప్రతినిధుల భక్తి లెక్కలు వేరా? గుస్సాడీ నృత్యాలు.. కార్తీక దీపోత్సవాలు..! ప్రస్తుతం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఈ వేడుకలు జోరుగా సాగుతున్నాయి. ఇవన్నీ ఏ ధార్మిక సంస్థలో నిర్వహిస్తున్నాయంటే పొరపాటు. ఫౌండేషన్ ద్వారా కొందరు.. సొంతంగా మారికొందరు తమలోని భక్తిని భారీగానే బయటపెడుతున్నారు.…
మాజీ మంత్రి, ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్… ఒక్క సారిగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే, తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్… నిర్వహించిన ఓ శుభకార్యంలో సందడి చేశారు. అదేంటి… టీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికి ఈటల రాజేందర్ వెళ్లడమేంటని అనుకుంటున్నారా ? అవును ఇది నిజమే. తెలంగాణ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ గారి కుమార్తె వివాహ వేడుకకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించారు ఈటల…
జర్నలిస్టుల కు టీఎస్ ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. ట్విట్టర్ వేదికగా పలువురు జర్నలిస్టుల సూచన మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు.. ఇదివరకు అక్రిడిటేషన్ ఉన్న జర్నలిస్టులు బస్సు ప్రయాణంలో టికెట్ తీసుకునేందుకు .. ప్రత్యేక బస్సు పాస్ చూపించి 2/3 కన్సెషన్ ఆప్షన్ కింద టికెట్ తీసుకునే అవకాశం ఉండేది. తాజాగా టీఎస్ ఆర్టీసీకి చెందిన వెబ్సైట్ నుంచి కూడా టికెట్లు బుక్ చేసుకునేందుకు రాయితీతో కూడిన అవకాశం కల్పించారు…
గెలిచే అవకాశం లేకపోయినా.. ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ ఎందుకు దిగుతోంది? అన్ని చోట్లా పోటీ చేస్తుందా.. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం అవుతుందా? ఈ విషయంలో కమలనాథుల లెక్కలేంటి? బలం లేని చోట బరిలో బీజేపీ..! తెలంగాణలో మళ్లీ ఎన్నికల వేడి నెలకొన్నా.. వార్ ఏకపక్షం కావడంతో పెద్దగా చర్చ లేదు. ఎన్నికలు జరిగే 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలు ప్రస్తుతం టీఆర్ఎస్వే. ఈ ఎన్నికల్లో ఓటేసే ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, కార్పొరేటర్ల…
వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తలపెట్టిన రైతు నివేదన దీక్షకు అనుమతి నిరాకరించారు హైదరాబాద్ పోలీసులు.. ఇందిరాపార్క్ వద్ద మూడు రోజుల పాటు వైఎస్ షర్మిల రైతు నివేదన దీక్ష నిర్వహించేందుకు అనుమతి కోరారు.. అయితే, మూడు రోజుల దీక్షను అనుమతి ఇచ్చేందుకు నిరాకరించారు సెంట్రల్ జోన్ పోలీసులు.. కానీ, రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే దీక్ష నిర్వహణకు అనుమతి ఇచ్చారు. దీంతో.. దానికి అనుగుణంగా వైఎస్ఆర్…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఇప్పటికే ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో భారీ వర్షాలు కురిసాయి.. మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వర్షం పడుతూనే ఉంది. కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి.. చెన్నై లాంటి ప్రాంతాలు ఇంకా కోలుకోలేదు.. అయితే, ఆ అల్పపీడన ప్రభుత్వంతో తెలంగాణలోనూ వర్షాలు కురుస్తాయని చెబుతోంది హైదరాబాద్ వాతావరణ కేంద్రం.. రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు ఈ నెల 13వ తేదీన…
దేశవ్యాప్తంగా 2019-20 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించి అత్యధిక విరాళాలు సేకరించిన ప్రాంతీయ పార్టీలలో తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అగ్రస్థానంలో నిలిచింది. టీఆర్ఎస్ పార్టీకి విరాళాల రూపంలో రూ.89 కోట్లు వచ్చినట్లు ఏడీఆర్ అనే సంస్థ వెల్లడించింది. ఈ జాబితాలో తెలుగు దేశం పార్టీ (టీడీపీ) రెండో స్థానంలో ఉంది. టీడీపీకి విరాళాల రూపంలో రూ.81 కోట్లు వచ్చాయి. అటు ఏపీలో అధికార పార్టీ వైఎస్ఆర్సీపీకి విరాళాల రూపంలో రూ.74 కోట్లు సమకూరినట్లు ఏడీఆర్ తెలిపింది. దేశవ్యాప్తంగా…
పేదవాడైనా.. ధనవంతుడైనా తనకు న్యాయం కోసం కోర్టుల వైపే చూస్తారు. అందరికీ న్యాయం దక్కాలనేదే మన రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు. అలాంటి బ్యాక్ డ్రాప్ తో వచ్చిన సినిమా జై భీమ్… తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం మార్మోగిపోతోంది. అందులో అన్యాయంగా అమాయకుడిపై కేసులు మోపి.. జైల్లో చిత్ర హింసలు ఎలా పెడతారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఏళ్లు గడుస్తున్నా ఇలాంటి కేసులు ఎక్కడో ఒకచోట బయటపడుతూనే ఉన్నాయి. తాజాగా సూర్యాపేట జిల్లా…