తెలంగాణ మంత్రులు ఒకరిద్దరు మీడియా ముందు మాట్లాడుతున్న కొన్ని విషయాలు కాస్త రచ్చకు దారితీస్తున్నాయి. తమ శాఖలకు సంబంధం లేని విషయాల విషయాల గురించి కూడా కామెంట్స్ చేస్తుండటంతో.. మిగిలిన మంత్రులు నొచ్చుకున్నట్టు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ నాయకత్వానికి, ఏఐసీసీ వ్యవహారాల ఇన్చార్జ్కు కూడా చెప్పుకున్నారట. ప్రభుత్వ పథకాలపై మంత్రుల కామెంట్స్‌తో చాలా రోజులుగా గందరగోళం పెరుగుతోంది.
ఏడాదిన్నర టైం ఇచ్చినా.. వీళ్ళలో మార్పు లేదు, ఇకమీదట కూడా అలాగే ఉంటే కుదరదని అనుకున్నారో, లేదంటే లేటెస్ట్ ఢిల్లీ టూర్లో పార్టీ పెద్దలతో రెండు రోజుల పాటు జరిగిన సమావేశాల్లో క్లారిటీ వచ్చిందోగానీ.. ఈసారి హస్తిన ఫ్లైట్ దిగినప్పటి నుంచి ముఖ్యమంత్రిలో మార్పు స్పష్టంగా కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఆయన కాన్ఫిడెంట్‌గా అడుగులేస్తున్నారని విశ్లేషిస్తున్నారు. ఇక, ఉత్సాహం ఆపుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులైతే.
KTR Formula E-Car Race: ఫార్ములా ఈ-రేస్ కేసు విచారణ సందర్భంగా కేటీఆర్ మొబైల్ ఫోన్లతో పాటు ల్యాప్ టాప్ ఇవ్వాలని ఏసీబీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఇక, ఏసీబీకి సెల్ ఫోన్లు అప్పగించాలన్న దానిపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు. బలవంతంగా వ్యక్తిగతమైన సెల్ ఫోన్లు తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి..
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో గోవుల సంరక్షణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (జూన్ 17న) సాయంత్రం తన నివాసంలో సమీక్ష నిర్వహించారు. మన సంస్కృతిలో గోవులకు ఉన్న ప్రాధాన్యం, భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకోవడంతో పాటు గోవుల సంరక్షణే ప్రధానంగా విధానాల రూపకల్పన చేయాలని అభిప్రాయపడ్డారు.
TET Exams: తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి టెట్ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ పరీక్షలు రెండు షిఫ్టులలో ఆన్లైన్ పద్దతిలో నిర్వహించబడతాయి. మొదటి షిఫ్ట్ ఉదయం 9 గంటల నుంచి 11:30 వరకు జరగనుండగా.. రెండవ షిఫ్ట్ మధ్యాహ్నం 2:00 నుంచి 4:30 గంటల వరకు కొనసాగనుంది.
Phone Tapping: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మావోయిస్టుల పేరు చెప్పి ఫోన్ టాపింగ్ కి ప్రభాకర్ రావు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. సాధారణ ఎన్నికల సమయంలో 600 మంది మావోయిస్టులకు సహాయం చేస్తున్నారని చెప్పి 600 ఫోన్ లను రివ్యూ కమిటీకి ఇచ్చి టాపిక్కు పాల్పడ్డారు.
కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై గోషామహల్ శాసన సభ్యులు రాజాసింగ్ స్పందించారు. ఈ సందర్భంగా వ్యక్తిగత విభేదాలను విడిచి పెట్టి, ఐక్యంగా లక్ష్య సాధన కోసం పని చేద్దామని కోరారు. మీరు ఎప్పుడు కలిస్తానని చెప్పిన అప్పుడు వచ్చి కలుస్తానన్నారు.
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. సాధారణ ఎన్నికల సమయంలోని నవంబర్ 15న పెద్ద ఎత్తున ట్యాపింగ్ కి పాల్పడినట్లు తేలింది. నవంబర్ 15వ తేదీన 600 మంది ఫోన్లను ప్రభాకర్ రావు టీం ట్యాప్ చేసినట్లే గుర్తించారు.