Harish Rao: తెలంగాణ భవన్ లో మీడియాతో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. బ్యాగుల మీద నాలెడ్జి ఉన్న రేవంత్ రెడ్డికి బేసిన్ ల మీద లేదు అని ఆరోపించారు. ఈయనకు బేసిక్స్ తెలియదు.. బేసిన్స్ తెలియదు.. మన రాష్ట్ర పరువు పోయింది అని ఎద్దేవా చేశారు.
సొంత పార్టీ నేతలని టార్గెట్ చేశారు. కడియం శ్రీహరి, బసవరాజు సారయ్య, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిలను పరోక్షంగా విమర్శించారు. కొండ మురళి పార్టీ మారితే పదవికి రాజీనామా చేసి మారిండు అని పేర్కొన్నాడు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మృతి తర్వాత మంత్రిగా ఉన్న కొండా సురేఖ కూడా పదవికి రాజీనామా చేసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిందన్నారు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి.
Eatala Rajendar: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. ఈ సందర్భంగా కేబినెట్ లో ఆమోదం లేకుండా ఏమి జరగదు.. ఆయన మంత్రి వర్గంలో ఉన్నవారే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వారిని అడగవచ్చు అని సూచించారు.
ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్లో రకరకాల ట్విస్ట్‌లు పెరుగుతున్నాయి. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ సీరియస్‌గా ముందుకు పోతోంది. లోతుల్లోకి వెళ్ళేకొద్దీ... తీగలు ఎక్కడెక్కడికో కనెక్ట్ అవుతున్నట్టు కనిపిస్తోంది. ఈ క్రమంలోనే... బీజేపీ స్వరం పెంచడం హాట్ టాపిక్ అయింది. దీంతో... ఆ పార్టీ ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది. మా ఫోన్ కాల్స్‌ని కూడా వినేశారు.
దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీసులకు ఒక మంచి పేరుంది.. మావోయిస్టు కట్టడి చేయడంలో తెలంగాణ పోలీస్ లకు మించి ఎవరు చేయలేరని చెప్తారు.. మావోయిస్టుపై ఆపరేషన్ చేయడం ఎన్కౌంటర్ చేయడం మావోయిస్టులో కీలక సమాచారాన్ని బయటకి తీసుకురావడంలో తెలంగాణ పోలీస్ లకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి ..అయితే ఇవన్నీ చేయడానికి మావోయిస్టుల లోపటికి వెళ్లి వాళ్ళ సమాచారం తెలుసుకోవడమే కాకుండా వాళ్ళ ఫోన్లను వాళ్లకు సహాయాలు చేసేవారి ఎప్పటికప్పుడు ట్యాప్ చేసి ఆమెరకు మావోయిస్టులపై తెలంగాణ పోలీస్…
Iran-Israel : ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో విదేశాల్లో ఉంటున్న భారతీయుల భద్రతపై ఆందోళన మొదలైంది. విద్య, ఉపాధి కోసం ఆయా దేశాలకు వెళ్లిన వారిపై ప్రభావం పడుతుండటంతో తెలంగాణ ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్‌లైన్ నంబర్లు ఏర్పాటు చేసింది. ఇదే సమయంలో ఓ విషాదకర సంఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల పట్టణానికి చెందిన 57ఏళ్ల రెవెళ్ల రవీందర్ అనే వ్యక్తి ఇజ్రాయెల్‌లో చికిత్స పొందుతూ మరణించారు. గత…
CM Revanth Reddy : సైబర్ నగరంగా పేరొందిన హైదరాబాద్‌లో ఇప్పుడు గూగుల్ నుంచి మరో ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ మొదలవుతోంది. ప్రముఖ ఐటీ దిగ్గజం గూగుల్ ఏర్పాటు చేస్తున్న గూగుల్ సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ (GSEC) ఇవాళ ఉదయం 11 గంటలకు హైటెక్‌సిటీ దివ్యశ్రీ భవన్లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇది భారత్‌లో గూగుల్ ఏర్పాటు చేస్తున్న మొట్టమొదటి సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ కావడం విశేషం. ఆసియా-పసిఫిక్ రీజియన్‌లో…
KTR Sends Legal Notice: తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లీగల్ నోటీసులు ఇచ్చారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనపై మహేష్ గౌడ్ ఆరోపణలు చేయడంతో ఈ నోటీసులు పంపినట్లు తెలుస్తుంది.