మెదక్ జిల్లాలో రెండు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఒకటి మెదక్, రెండోది నర్సాపూర్. నర్సాపూర్ ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోట. తర్వాత హస్తం పార్టీ హవా నడిచిన సెగ్మెంట్. కానీ... గత మూడు విడతల నుంచి బీఆర్ఎస్ విజయ పరంపర కొనసాగుతోంది. ఇక 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఇక్కడ కాంగ్రెస్ సమీకరణలు మారిపోయాయి. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్న కంఠారెడ్డి తిరుపతి రెడ్డి మెదక్ అసెంబ్లీ టికెట్ ఆశించారు.
మాజీ మంత్రి చిన్నారెడ్డిని కాదని మేఘారెడ్డికి కాంగ్రెస్ టికెట్ ఇవ్వడం, ఆయన గెలవడంతో ముసలం మొదలైందంటున్నారు. ఆ తర్వాత చిన్నారెడ్డికి రాష్ట్ర ప్లానింగ్ కమిటీ వైస్ చైర్మన్ పదవి కట్టబెట్టినా.... ఆయన మాత్రం నియోజక వర్గానికే పరిమితం కావడంతో ప్రోటోకాల్ సమస్యతో పాటు వర్గపోరు ముదిరి పాకాన పడిందని అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు.
కేసీఆర్ పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు దొరికిన చోటల్లా అప్పులు చేశాడని ఆరోపించారు. అందినకాడల్లా ఎగబెట్టి పోయాడు అని మండిపడ్డారు. మళ్లీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని తిరిగి గాడిన పెడుతున్నామని సీఎం రేవంత్ చెప్పారు.
CM Revanth Reddy: తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వ్యవసాయ యోగ్యమైన భూములన్నింటికీ రైతు భరోసా నిధులను జమ చేస్తామని తెలిపారు. ఎన్ని ఎకరాలున్నా రైతులందరికీ రైతు భరోసాను అందజేస్తామని ప్రకటించారు. 9 రోజుల్లోనే రైతులందరి అకౌంట్లలోకి రైతు భరోసా నగదు పడుతుందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ శాఖ మంత్రి జయంత్ చౌదరి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో నైపుణ్యాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో స్కిల్ డెలప్మెంట్ కు సంబంధించి తీసుకుంటున్న చర్యలను కేంద్ర మంత్రికి సీఎం రేవంత్ వివరించారు. రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి అభినందించారు. రాష్ట్రంలో స్కిల్ డెవలప్ మెంట్ కు కేంద్ర ప్రభుత్వ సహకారం ఉంటుందని…
Maoists : తెలుగు రాష్ట్రాల్లో ఈనెల 20న బంద్‌కు మావోయిస్టు పార్టీ పిలుపునిచ్చింది. ఇటీవల జరిగిన ఆపరేషన్ కగార్ దాడిని ఖండిస్తూ ఈ బంద్‌ను ప్రకటించినట్లు మావోయిస్టు అధికార ప్రతినిధి జగన్ పేరుతో ఒక ప్రకటన విడుదలైంది. ప్రకటనలో ప్రకారం, జూన్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకూ జరిగిన ఆపరేషన్ కగార్ పేరుతో నేషనల్ పార్క్ పరిధిలో చేపట్టిన దాడుల్లో రాష్ట్ర స్థాయి కీలక నాయకులైన కామ్రేడ్ టీఎల్ఎన్ఎస్ చలం అలియాస్ ఆనంద్, కామ్రేడ్…
Weather Updates :తెలుగు రాష్ట్రాల్లో వర్షాల పరిస్థితి గందరగోళంగా మారింది. భారత వాతావరణ శాఖ తాజా బులిటెన్ ప్రకారం, జూన్ 17వ తేదీ వరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందన్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం కొంత భిన్నంగా కనిపిస్తున్నాయి. తెలంగాణలో ఆదివారం రోజంతా మేఘాలు కమ్ముకున్నా, వర్షం మాత్రం కొన్ని చోట్లే కురిసే సూచనలు కనిపిస్తున్నాయి. హైదరాబాద్‌తో పాటు మధ్య, ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో సాయంత్రం తరువాత జల్లులు పడొచ్చని…
Telangana Inter Supply Results : తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక సమాచారం. రాష్ట్ర ఇంటర్‌బోర్డు (TSBIE) అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాల విడుదలకు తుది తేదీని ప్రకటించింది. బోర్డు కార్యదర్శి కృష్ణ ఆదిత్య వెల్లడించిన ప్రకారం, ఈ నెల 16వ తేదీ (సోమవారం) మధ్యాహ్నం ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విడుదల చేయనున్నారు. Kajol : ఫోటోగ్రాఫర్లు.. మమల్ని అక్కడ కూడా వదలడంలేదు ఇంతకు ముందు మే 22 నుంచి 29వ తేదీ వరకు…