పోలీసింగ్‌లో వరంగల్‌కు ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. అలాంటి పోలీసులు ఇప్పుడు నానా ఇబ్బందులు పడుతున్నారట. బదిలీలు, సస్పెన్షన్లు, మెమోలతో హడలిపోతున్నారు. అది కూడా వరంగల్ తూర్పు నియోజకవర్గ పరిధిలోనే జరగడం ఆసక్తికరంగా మారింది.
భారత్ పర్యటనలో ఉన్న టోనీ బ్లెయిర్‌తో ఢిల్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ (జూన్ 19న) సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణలో రైతులు, యువత, మహిళలు లాంటి విభిన్న వర్గాల సామాజిక, ఆర్థిక అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు టోనీ బ్లెయిర్‌కు సీఎం తెలియజేశారు.
21వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా యోగ దినోత్సవ వేడుకలు జరగబోతున్నాయని తెలిపారు. భారత ప్రభుత్వం తరపున, రాష్ట్ర ప్రభుత్వాల తరఫున దేశంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నాం.. విశాఖపట్నం వేదికగా యోగా కార్యక్రమాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తేల్చి చెప్పారు.
Hyderabad Metro Phase II: ఢిల్లీలో కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ తో ఆయన నివాసంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సమావేశం అయ్యారు. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ నగరంలో 76.4 కిలోమీటర్ల పొడవైన మెట్రో ఫేజ్-II అవసరం ఎంతో ఉందని కేంద్ర మంత్రికి దృష్టికి తీసుకెళ్లారు
Rythu Bharosa: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన మాట ప్రకారం వానాకాలం పంటల పెట్టుబడి సాయంగా అందిస్తున్న రైతు భరోసాను రికార్డు వేగంతో పంపిణీ చేస్తోంది. కేవలం తొమ్మిది రోజుల్లో రూ. 9 వేల కోట్లు జమ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన మేరకు ఆర్థిక శాఖ ఏ రోజుకారోజు నిధులను విడుదల చేస్తుంది.
బనకచర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు.. తెలంగాణతో నేను ఎప్పుడైనా గొడవపడ్డానా? అని ప్రశ్నించిన ఆయన.. తెలంగాణ వాళ్లతో పోరాటం ఎందుకు? కట్టాలనుకుంటున్న ప్రాజెక్టులన్నీ కట్టుకోండి.. మిగిలిన నీటినే మేం వాడుకుంటాం అన్నారు.. ప్రాజెక్టుల విషయంలో తెలంగాణతో పోరాటం చేయను అని స్పష్టం చేశారు.. బనకచర్ల ప్రాజెక్టుపై పోరాటాలు అవసరం లేదు.. ఎవరి నీరు వారిది.. అవసరమైతే ఢిల్లీలో కూర్చొని మాట్లాడుకుందాం.. సముద్రంలోకి పోయే నీటిని ఇచ్చుపుచ్చుకునే ధోరణిలో వాడుకుందాం అన్నారు చంద్రబాబు..
Telangana: ఈ విద్యా సంవత్సరం 202-26 ఇంజనీరింగ్ కాలేజ్ ల ఫీజు పెంపు లేనట్టే.. పాత ఫీజులనే కొనసాగించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఫీజుల పెంపు విషయంలో కాలేజీలు ఇచ్చిన రిపోర్టులు, కాలేజీల్లో ఉన్న వసతులై అధ్యయనం చేసేందుకు సబ్ కమిటీ వేయాలని AFRC నిర్ణయం తీసుకుంది.
CM Revanth Reddy: తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు ప్రీ ఫీజుబిలిటీ రిపోర్ట్‌ను తిరస్కరించాలని జల్‌శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.