యాదాద్రి భువనగిరి జిల్లాలోని ‘భూదాన్ పోచంపల్లి’కి ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా అంతర్జాతీయ గుర్తింపు లభించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు.. ఐక్యరాజ్య సమితి అనుబంధ ప్రపంచ పర్యాటక సంస్థ, భూదాన్ పోచంపల్లిని ఉత్తమ ప్రపంచ పర్యాటక గ్రామంగా ఎంపిక చేయడం అభినందనీయమన్న కేసీఆర్.. తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవనం దిశగా స్వయంపాలనలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కార్యాచరణ ఫలితంగా, తెలంగాణ చారిత్రక పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ గుర్తింపును సాధిస్తున్నాయని తెలిపారు. Read…
అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.. ఇవాళ వాకర్స్ వెలిఫేర్ అసోసియేషన్ సమావేశంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్… జగిత్యాల అధికార మున్సిపల్ పాలక వర్గంపై హాట్ కామెంట్స్ చేశారు.. జగిత్యాల మున్సిపల్ పాలక వర్గానికి క్యాన్సర్ వచ్చిందంటూ కాకరేపిన ఆయన.. జగిత్యాల బల్దియా రోగం త్వరలో బాగు చేయాలి అని కామెంట్ చేశారు.. Read Also: మాంసాహారం విక్రయాలపై గుజరాత్…
తెలంగాణలో పొలిటికల్ ఈక్వేషన్స్ మారుతున్నాయా? కేసీఆర్ ఫోకస్ కాంగ్రెస్ నుంచి బీజేపీకి షిఫ్ట్ అయిందా? ఇప్పుడు ఆయన బీజేపీపై చేస్తున్నది ఉత్తుత్తి ఫైటేనా? లేదంటే మ్యాటర్ నిజంగానే సీరియస్సా? తాజా పరిణామాల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో మెదులుతున్న ప్రశ్నలు ఇవి. హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు తెలంగాణ రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. ఉప ఎన్నిక తమకు లైట్ అని గులాబీ పార్టీ నేతలు అంటే అనొచ్చు. కానీ దాని తాలూకు ఓటమి అనేకల రకాలుగా ఆ పార్టీ…
తెలంగాణ సీఎం కేసీఆర్ పై మరోసారి నిప్పులు చెరిగారు వైసీఆర్టీపీ పార్టీ అధినేత వైఎస్ షర్మిల. రైతుల కడుపు కొట్టి, బడులను బంద్ పెట్టి, బార్లకు “రండి బాబు .. రండి” అంటూ డోర్లు తెరుస్తున్నాడని… దీనిపై సీఎం కేసీఆర్ సిగ్గుపడాలని నిప్పులు చెరిగారు వైఎస్ షర్మిల. ఇంటికో ఉద్యోగం ఇస్తానని చెప్పి… ఇంటికో తాగుబోతుని తయారు చేస్తున్నాడని కేసీఆర్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల. ఆదాయం పెంచుకొనే తెలివి లేక లిక్కర్ మీద…
తెలంగాణలోని భూదాన్ పోచంపల్లి విలేజ్ అరుదైన గౌరవాన్ని సొంతం చేసుకుంది… రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది… ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్యసమితికి అనుబంధంగా పనిచేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్ టూరిజం విలేజ్ పోటీల్లో భారత్ నుంచి పోటీపడిన తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది.. భారత్ నుంచి భూదాన్‌పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్థాన్, మధ్యప్రదేశ్‌లోని…
ట్రాఫిక్ రూల్స్ వాహనదారులకు షాకిస్తున్నాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ తరహాలోనే… ట్రాఫిక్ రూల్స్ ను పాటించని వారికి కూడా కౌన్సెలింగ్ ఇవ్వాలని పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 10 చలాన్లు పెండింగ్ లో ఉన్న వాహనదారులను పిలిచి కౌన్సిలింగ్ నిర్వహిస్తారు. ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు 10 చలాన్ల కంటే ఎక్కువ ఉంటే వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్ ట్రైనిగ్ ఇనిస్టిట్యూట్ కు పోలీసులు పంపిస్తున్నారు. ఈ కౌన్సిలింగ్ లో ఎలాంటి ట్రాఫిక్ ఉల్లంఘటనలకు…
గవర్నర్ ను కలిసిన బీజేపీ నేతలు నిన్న నల్గొండ జిల్లా బండి సంజయ్ పర్యటనలో చోటు చేసుకున్న పరిణామాలు ఆయన కాన్వాయ్ పై దాడి పై గవర్నర్ కి ఫిర్యాదు చేసారు. అనంతరం బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ… హుజురాబాద్ ఓటమిని కేసీఆర్ జీర్ణించుకోలేకపోతున్నారు అని అన్నారు. ఇక సీఎం ఆదేశాల మేరకే బండి సంజయ్ పై దాడి జరిగింది. తెలంగాణలో శాంతిభద్రతలు క్షిణీస్తున్నాయి. అందుకే గవర్నర్ దృష్టి కి తీసుకెళ్ళాం అని తెలిపారు.…
హైదరాబాద్ వరంగల్ జాతీయ రహదారిపై రైతులు ఉదయం నుంచి రాస్తారోకో చేస్తున్నారు. బీబీనగర్ ధాన్యం కొనుగోలు కేంద్రం వద్దకు రైతులు పెద్ద ఎత్తున చేరుకొని ధర్నా చేశారు. జాతీయ రహదారిపై రైతులు ఒడ్లుపోసి తగలబెట్టారు. దీంతో బీబీనగర్-హైదరాబాద్ రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. Read: ఆ గ్రామంలో నివశించాలంటే… ఆ అవయవం తీయించుకోవాల్సిందే.. ఉదయం నుంచి ట్రాఫిక్ జామ్ కావడంతో అధికారులు, పోలీసులు అక్కడికి చేరుకొని ట్రాఫిక్‌ను క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. గత…
నిన్న జరిగిన దౌర్జన్య కాండను బీజేపీ తీవ్రంగా ఖండిస్తోంది. రైతుల కోసం ఏ దాడులైనా భరిస్తాం. రైతుల పక్షాన పోరాడతాము అని బండి సంజయ్ అన్నారు. దాడుల్లో రైతులకే కొడుగుడ్లు తగిలాయి, రాళ్లు తగిలితే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించారు. దాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతుల సమస్యలను చెప్పుకునేందుకు వస్తుంటే టీఆరెస్ భయపడుతోంది. బాధలు చెప్పుకునేందుకు వచ్చే రైతులను బెదిరింపులకు గురి చేస్తున్నారు. బాధ్యత యుతంగా ఉండాల్సిన సీఎం కేసీఆర్ దాడులకు పిలుపునిస్తున్నారు. రైతుల ఇబ్బందులు ప్రశిస్తే…