మహబూబ్‌నగర్ జిల్లా బాలానగర్ మండలం తిరుమలగిరి గ్రామంలో పర్యటించారు ములుగు ఎమ్మెల్యే సీతక్క. తిరుమలగిరిలోని నిరుపేద సుజాతమ్మ ఇంటిని సందర్శించిన ఎమ్మెల్యే సీతక్క కేసీఆర్ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బిజేపి, టీఆర్ఎస్ రెండు ఒక్కటే, రాష్ట్రంలో కుస్తీ,ఢిల్లీలో దోస్తీ అన్నారు. ధర్నాచౌక్ తీసేసిన కేసిఆర్ కు ధర్నా చేసే హక్కులేదన్నారు. నిరుపేద సుజాతమ్మకు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇల్లుకట్టించడం అభినందనీయం అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రికి కనీసం సోయిలేదు. పేదలు ఇండ్లులేక బాత్రూంలలో ఉంటే…
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న శిశువిహార్ పిల్లల కోసం ప్రత్యేకంగా నిలోఫర్ ఆసుపత్రిలో వార్డు ఏపాటు చేసారు. ఈ విషయం పై మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ… 10 బెడ్స్ తో కూడిన వార్డ్ ఏర్పాటు చేసాం. ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్య ఆరోగ్య శాఖకు పెద్దపీట వేశారు. వైద్య ఆరోగ్య శాఖ బలోపేతం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ 10 వేల కోట్లను ఖర్చు పెట్టనున్నారు. కోవిడ్ లో వైద్యలు ప్రాణాలకు తెగించి పని చేసారు.. ఇక ముందు కూడా…
దక్షిణాది రాష్ట్రాల కౌన్సిల్ సమావేశం లో తెలంగాణ ప్రస్తావించిన అంశాలను వివరించారు హోంమంత్రి మహమూద్ అలీ. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, నక్కలగండి ఎత్తిపోతల పథకం అనుమతులు. జనవరి 15 లోపు డీపీఆర్ లు కేఆర్ఎంబీకి సమర్పించాలని..డీపీఆర్ ల ఆధారంగా సెంటర్ వాటర్ కమిషన్ నిర్ణయం తీసుకుంటుందన్నారు. రాజీవ్ గాంధి సంగంబండ బ్యారేజ్ ద్వారా కర్ణాటక లో మునిగి పోనున్న ప్రాంతాల పై తెలంగాణ, కర్ణాటక ఉమ్మడి గా సర్వే నిర్వహించాలని నిర్ణయం. ఏపీకి తెలంగాణ రూ.6015…
ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణాలే కీలకం కాబోతున్నాయా? అధిష్ఠానం ఆలోచన ఆ దిశగానే ఉందా? సిట్టింగ్ పరిస్థితి ఏంటి? పీఠం ఎక్కేందుకు సిద్ధంగా ఉన్నదెవరు? గులాబీ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? అభ్యర్థి ఎంపికలో కుల సమీకరణాలే కీలకమా? ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆశావహులు ఒక్కసారిగా తెరపైకి వచ్చారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పురాణం సతీష్ పదవీకాలం ముగియనుండటంతో..ఆ స్థానంలో ఎన్నిక నిర్వహిస్తున్నారు. తనకు మరోసారి అవకాశం…
ఇప్పటికే కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కురుస్తున్న భారీ వర్షా లకు జనజీవనం అస్తవ్యస్తం అయింది. తాజాగా వాతవారణ శాఖ తెలంగాణకు సైతం వర్షం ముప్పు ఉందని పేర్కొంది. తెలంగాణలో రాగల మూడు రోజుల పాటు అక్కడక్కడ తేలికపాటి నుంచి భారీ వర్షా లు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కిందిస్థాయి నుంచి వీస్తున్న గాలులు తూర్పు దిశ నుంచి తెలంగాణ వైపునకు వీస్తున్నాయని, అలాగే బంగాళ ఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని తెలిపింది. ఈనెల…
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశంలో పాల్గొన్న ముఖ్యమంత్రి పలు కీలక అంశాలను ప్రస్తావించారు. తిరుపతిలోని తాజ్ హోటల్లో దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ఆదివారం జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్.జగన్, కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై సహా లెఫ్టినెంట్ గవర్నర్లు, అడ్మినిస్ట్రేటర్లు, మంత్రులు, అధికారులు హాజరయ్యారు. ఏపీకి సంబంధించిన కీలక అంశాలను ఈ సమావేశంలో ప్రస్తావించారు సీఎం జగన్. సమావేశంలో విలువైన సమాచారాన్ని, తగిన సూచనలు, సలహాలు అందించిన కర్ణాటక…
దళితబంధు మాదిరి గిరిజనబంధు అమలు చేయాలి అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల్లో ప్రజలను వంచించటానికి సీఎం కేసీఆర్ దొంగ స్కీంలను తీసుకొచ్చాడు. నవంబర్ 4న దళితబంధు అమలు చేస్తామన్న కేసీఆర్ మాటలు ఒట్టి మాటలు. రిజర్వేషన్లను అడ్డుకుని గిరిజనుల కళ్ళల్లో మట్టికొట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని తెలిపారు. మూడెకరాల భూమి దేవుడెరుగు.. సాగుచేసుకుంటోన్న పోడు భూములను లాక్కుంటున్నాడు. ధరణి పోర్టల్ వలన సొంత భూముల మీద హక్కులు కోల్పోతున్నాం. సమాజంలో అత్యంత…
ఆ జిల్లాలో నిర్వహించిన రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ నేతలు వర్గపోరుకే ప్రాధాన్యం ఇచ్చారా? పెద్దల హితోక్తులు చెవికి ఎక్కించుకోలేదా? మిగతావాళ్లు కలిసి సాగినా.. అక్కడ వేర్వేరు శిబిరాలు ఎందుకు వెలిశాయి? ఇంతకీ ఏంటా జిల్లా? లెట్స్ వాచ్! కలిసి నిరసనల్లో పాల్గొన్నది కొందరేనా? కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగడుతూ నిర్వహించిన రైతు ధర్నా కార్యక్రమాలను సక్సెస్ చేయడానికి టీఆర్ఎస్ నేతలు పోటీపడ్డారు. ఇదే సమయంలో ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కొందరు నాయకులు తమ మధ్య ఉన్న విభేదాలను…
మింగ మెతుకు లేదు మీసాలకు సంపంగి నూనె అనే చందంగా మారింది తెలంగాణ ఆర్టీసీ పరిస్థితి. వేలకోట్ల అప్పుల్లో కూరుకుపోయిన ఆర్టీసీలో దుబారా ఖర్చులు తగ్గడం లేదు. సంస్థను ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కించాల్సిన సారథులు, ఉన్నతాధికారులు.. లగ్జరీ కార్ల కోసం ఆర్టీసీపై మరింత భారం వేస్తున్నారు. విమర్శలకు ఆస్కారం కల్పిస్తున్నారు. లక్షలు ఖర్చుపెట్టి సారథుల కోసం కొత్త కార్లు? ఆర్టీసీని ఆదరించండి, ఆర్టీసీ బస్సులు ఎక్కండి.. ఆర్టీసీని ఆర్థికంగా ఆదుకోండి.. ప్రభుత్వం, ప్రజా రోడ్డు రవాణా…
మావోయిస్ట్ పార్టీ ప్రముఖ నేత ఆర్కే భార్య శిరీష తెలంగాణ పోలీసులపై విమర్శలు చేశారు. ఆర్కేపై వచ్చిన కథనాలను, ఇంటర్వ్యూలను సేకరించి తాను బుక్ తయారుచేసి హైదరాబాద్‌లో ఆవిష్కరించాలని భావించానని…మీడియాలో వచ్చిన కథనాలను మాత్రమే పుస్తకంలో ప్రస్తావించానని, కానీ ఆ పుస్తకావిష్కరణను పోలీసులు అడ్డుకున్నారని శిరీష ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పుస్తకంలో ఎటువంటి విప్లవ సాహిత్యం లేదన్నారు. పుస్తక ఆవిష్కరణ కోసం డీజీపీ దగ్గర అర్జీ పెట్టుకున్నానని, ఆ తరువాత రోజే పుస్తకం ప్రింట్ చేస్తున్న…